పంచాంగం
తేదీ 20-10-2024, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం, శరత్ ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:57 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:41 గంటలకు.
తిథి: బహుళ తదియ ఉ 10.48 వరకు, తదుపరి చవితి
నక్షత్రం: కృత్తిక మ. 1.21 వరకు, తదుపరి రోహిణి
దుర్ముహూర్తం: సా 4.25 నుంచి 5.13 వరకు
శుభ సమయం: ఉ 07.00 నుంచి 09.00 వరకు
రాహుకాలం: సా 4.30 నుంచి 6.00 వరకు
యమగండం: మ. 12.00 నుంచి 1.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. వ్యాపార అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు.
వృషభ రాశి: మిశ్రమకాలం. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోరాదు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ప్రవర్తన వల్ల కలత చెందుతారు. జీవిత భాగస్వామితో కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు.
మిధున రాశి: ఈరోజు ఈ రాశి వారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంది. చేపట్టిన పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడతాయి. బద్ధకాన్ని దరిచేరనీయరాదు. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.
కర్కాటక రాశి: శుభకాలం. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. పూర్వీకుల ఆస్తి విషయంలో చోటు చేసుకున్న వివాదాలు తొలగిపోతాయి. ఉద్యోగులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. భవిష్యత్తు కార్యచరణ కోసం ప్రణాళికలు రచిస్తారు.
సింహరాశి: మనోనిబ్బరంతో మెలగాల్సిన సమయం. కొందరి ప్రవర్తన చికాకు కలిగించవచ్చు. అనవసర విషయాలకు, వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక సంబంధ లావాదేవీలను అపరిచితులతో జరపరాదు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు పరస్పర అవగాహనతో ఉండాలి. మూడో వ్యక్తి ప్రమేయం వల్ల వారి మధ్య విభేదాలు తలెత్తవచ్చు.
కన్యారాశి: కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అతిథుల రాక ఆనందాన్నిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని గడుపుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. భవిష్యత్తుకు ఉపయోగపడే వ్యక్తులను ఈరోజు కలుసుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
తులారాశి: మనశ్శాంతిని దూరం చేసే పరిస్థితులకు దూరంగా ఉండాలి. కొద్దిపాటి ఆర్థిక సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. అనారోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. ఇంటి పెద్దల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. నిర్లక్ష్యం చేయరాదు. ముఖ్యమైన విషయాల్లో తొందరపడి ఏ నిర్ణయం తీసుకోరాదు. ఏ పనైనా మొదలుపెట్టేముందు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది.
వృశ్చిక రాశి: అదృష్ట కాలం. కుటుంబ సభ్యుల సహకారంతో చిరకాల కోరికను నెరవేర్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బ్యాంకు నుంచి రుణం పొందాలనుకునే వారికి అనుకూల సమయం. బకాయిలు వసూలు అవుతాయి. నూతన వస్తు, వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి.
ధనస్సు రాశి: కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. రాజకీయ రంగాల వారికి అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది.
మకర రాశి: భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మాటల్లో పొదుపు అవసరం. ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకపోవడం మంచిది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి.
కుంభరాశి: ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు పనికిరావు. బద్ధకం ఆవహిస్తుంది ఫలితంగా ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల సలహా తీసుకుని ఏ పనైనా మొదలుపెట్టడం మంచిది. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. ఎవరితోనైనా మిత సంభాషణ మంచిది.
మీన రాశి: ప్రశాంతతను దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. నమ్మిన వారే మోసం చేసి ప్రమాదం ఉంది. ప్రత్యర్ధులు ఇబ్బందుల్లోకి నెట్టాలని చూస్తారు. ఎవరి మాటలకు ప్రభావితం కాకుండా ఉండాలి. విలువైన వస్తువును పోగొట్టుకొనే ప్రమాదం ఉన్నందున జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తత అవసరం ఖర్చులు పెరుగుతాయి. రుణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.