పంచాంగం
తేదీ 20-03-2025, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు.
తిథి: బహుళ షష్ఠి రా. 10.36 వరకు, తదుపరి సప్తమి
నక్షత్రం: అనురాధ రా. 7.58 వరకు, తదుపరి జ్యేష్ఠ
శుభ సమయం: ఉ 10.45 నుంచి 11.37 వరకు, తిరిగి సా. 5.47 నుంచి 6.35 వరకు
దుర్ముహూర్తం: ప 10.00 నుంచి 10.48 వరకు, తిరిగి ప. 2.48 నుంచి 3.36 వరకు
రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ. 6.00 నుంచి 7.30 వరకు
రాశి ఫలాలు
మేషరాశి: కొన్ని విషయాల్లో మీ అంచనాలు తప్పుతాయి. నమ్మినవారే మోసం చేసి ప్రమాదం ఉంది. కొందరి ప్రవర్తన మీకు బాధ కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలను వాయిదా వేయటం మంచిది.
వృషభ రాశి: అదృష్ట కాలం. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు.
మిధున రాశి: బకాయిలు వసూలు అవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. శత్రువులు మిత్రులవుతారు. ఆప్తుల మధ్య నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.
కర్కాటక రాశి: ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టిన పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనో నిబ్బరాన్ని కోల్పోకండి. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తాయి. కొందరి ప్రవర్తన వల్ల కలత చెందుతారు. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి.
సింహరాశి: జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలను తొలగించుకునే ప్రయత్నం చేయాలి. మూడో వ్యక్తి ప్రమేయం ఉండకుండా చూసుకోండి. వివాదాలకు తావివ్వకండి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలి. మీది కానీ వ్యవహారంలో తల దూర్చకండి.
కన్యారాశి: అనుకూల సమయం. మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలను తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.
తులారాశి: కుటుంబ సభ్యులతో స్వల్పంగా విభేదించాల్సి రావచ్చు. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోవచ్చు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ప్రయత్నాలు మొదలుపెట్టండి. ఇతరులతో సంభాషించేటప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ప్రయాణాలను వాయిదా వేయటం మంచిది.
వృశ్చిక రాశి: వ్యాపారులకు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకున్నవారు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. తొందరపాటు చర్యల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. స్వల్పంగా అలసటకు లోనవుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.
ధనస్సు రాశి: ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాల వల్ల సమస్యల్లో పడతారు. అవసరానికి తోబుట్టువుల నుంచి సాయం అందుతుంది. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. వ్యాపార భాగస్వామి ప్రవర్తనను గమనిస్తూ ఉండండి. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు ఈరోజు జరపకపోవడం మంచిది.
మకర రాశి: ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి.
కుంభరాశి: మిశ్రమకాలం. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. పని ప్రదేశంలో ఆహ్లాద తర్వాత వాతావరణం ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.
మీన రాశి: ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు జాగ్రత్తగా ఉండండి ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టిన పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అరువు తెచ్చుకున్న వాహనాలు వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి.