పంచాంగం
తేదీ 20- 07- 2024, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆషాఢ మాసం, గ్రీష్మ రుతువు.
సూర్యోదయం: ఉదయం 5:38 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:38 గంటలకు.
తిథి: శుక్ల చతుర్దశి సా. 5.14 వరకు, తదుపరి పూర్ణిమ.
నక్షత్రం: పూర్వాషాడ రా. 2.33 వరకు, తదుపరి ఉత్తరాషాడ.
దుర్ముహూర్తం: ఉ 6.00 నుంచి 7.36 వరకు.
శుభ సమయం: సా 5.00 నుంచి 6.00 వరకు.
రాహుకాలం: ఉ 9.00 నుంచి 10.30 వరకు
యమగండం: మ. 1.30 నుంచి 3.00 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: సమస్యలు చుట్టుముడతాయి. వ్యాపారులు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు సంబంధిత పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీ ప్రవర్తన వల్ల ఇతరులు నొచ్చుకుంటారు. మీ వ్యక్తిగత విషయాలను స్నేహితులతో చర్చించడం వల్ల పరిష్కారం దొరుకుతుంది. న్యాయపరమైన చిక్కులు తొలగిపోతాయి. ముఖ్యమైన పనులపై దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.
వృషభ రాశి: అదృష్ట కాలం. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. క్లిష్ట సమయాల్లో తోబుట్టువుల సహాయం అందుతుంది. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునే వారికి సరైన సమయం. గతంలో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందే అవకాశం ఉంది.
మిథున రాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ముఖ్యమైన పనుల కోసం దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. వాతావరణ మార్పుల కారణంగా కొంత అనారోగ్యానికి గురవుతారు. పనిభారం కారణంగా ఒత్తిడి పెరుగుతుంది.
కర్కాటక రాశి: ముఖ్యమైన పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. గతంలో చేసిన సహాయం ఇప్పుడు ఉపయోగపడుతుంది. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. పెట్టుబడి పెట్టాలనుకునే వారు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ఆర్థిక సమస్యలు కొంతమేర తగ్గుముఖం పడతాయి.
సింహరాశి: నూతన వస్తు, వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి అనుకూల సమయం. అప్పుల బాధలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార భాగస్వామితో ఎట్టి పరిస్థితుల్లోనూ విభేదాలు పెట్టుకోరాదు. ఇద్దరి మధ్య మనస్పర్ధల వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి రావచ్చు.
కన్యారాశి: కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులతో వ్యక్తిగత సమస్యలు చెప్పుకుంటారు. జీవిత భాగస్వామికి నూతన ఉద్యోగ ఉద్యోగం యోగం ఉంది. మీ ఉద్దేశాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఎవరికైనా వాగ్దానం చేసేముందు కాస్త ఆలోచించాలి.
తులారాశి: ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనిని ఈరోజు పూర్తిచేసే అవకాశం లభిస్తుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని సంభాషించాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కొన్ని సమస్యల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
వృశ్చిక రాశి: మిశ్రమంగా ఉంటుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. గతంలో బాధించిన అనారోగ్యం మళ్లీ వారిని ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది. నిర్లక్ష్యం చేయరాదు. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.
ధనస్సు రాశి: ఈరోజు సానుకూలంగా ఉంటుంది. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అడ్డంకులు తొలగిపోతాయి. ఏదైనా పనిని ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. మొండి బకాయిలు చేతికందుతాయి. ఒక విషయంలో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. వాటిని చర్చించుకోవడం ద్వారా పరిష్కారం అవుతాయి.
మకర రాశి: చాలా కాలం నుంచి వేధిస్తున్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. రుణాలను పెద్ద మొత్తంలో తీర్చగలుగుతారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామితో విభేదించాల్సి రావచ్చు. చేపట్టిన పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి.
కుంభరాశి: అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. వాతావరణ పరిస్థితుల ప్రభావం ఆరోగ్యం మీద పడుతుంది. అకారణంగా నిందలు పడాల్సి రావచ్చు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. ఉద్యోగులు పై అధికారులను మెప్పించడానికి శ్రమించాల్సి ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాలు ఏర్పడతాయి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి.
మీన రాశి: ఈరోజు ఈ రాశి వారికి ఆరోగ్యం సహకరించదు. కల్తీ ఆహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్లిష్ట సమయాల్లో స్నేహితులు సహాయం అందిస్తారు. వ్యాపార సంబంధ పనులు మొదలు పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలి. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల ప్రయోజనం పొందుతారు.