పంచాంగం
తేదీ 20-01-2025, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, పుష్యమాసం, హేమంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.38 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:45 గంటలకు.
తిథి: బహుళ షష్టి ఉ 8.58 వరకు, తదుపరి సప్తమి
నక్షత్రం: హస్త రా. 7.50 వరకు, తదుపరి చిత్త
శుభ సమయం: సా 6.56 నుంచి 7.20 వరకు
దుర్ముహూర్తం: ప. 12.24 నుంచి 1.12 వరకు, తిరిగి ప. 2.46 నుంచి 3.34 వరకు
రాహుకాలం: ఉ 7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ప. 10.30 నుంచి 12.00 వరకు
రాశి ఫలాలు
మేషరాశి: సానుకూల ఫలితాలు ఉన్నాయి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. ఇంటి పెద్దల సాయంతో ఒక ముఖ్యమైన పని పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి అందిన వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వృషభ రాశి: మిశ్రమకాలం. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. సంతానాభివృద్ధి కి సంబంధించి శుభవార్తలు వింటారు. ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది.
మిథున రాశి: అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. కుటుంబంలో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు శుభ ఫలితాలను ఇస్తాయి. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. ఉద్యోగులకు కోరుకున్న చోటుకు స్థానచలనం లభిస్తుంది.
కర్కాటక రాశి: కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకుంటారు. సత్ప్రవర్తనతో ఇతరుల ప్రశంసలు అందుకుంటారు. సంతానాభివృద్ధి గురించి శుభవార్తలు వింటారు. పెద్ద మొత్తంలో రుణాలను తీర్చగలుగుతారు. ఇంటి పెద్దల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
సింహరాశి: సమయం వృధా చేయకండి. ముఖ్యమైన పనులపై శ్రద్ధ పెట్టాలి. ఖర్చులపై నియంత్రణ ఉండాలి. ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టమైన వారితో విలువైన సమయాన్ని గడుపుతారు.
కన్య రాశి: చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. భవిష్యత్తు ఉపయోగపడే ఒక ముఖ్యమైన వ్యక్తిని ఈరోజు కలుసుకుంటారు. ఆప్తుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఎలా ఉంటుంది.
తులారాశి: అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. నమ్మినవారే మోసం చేసే ప్రమాదం ఉంది. అరువు తెచ్చుకున్న వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఎవరితోనూ అనవసర వాగ్వాదానికి దిగరాదు. మీది కాని వ్యవహారంలో తల దూర్చడం వల్ల న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
వృశ్చిక రాశి: కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఒక వ్యవహారంలో డబ్బు చేతికందుతుంది. ఆస్తి సంబంధ వివాదాలు తొలగిపోతాయి. బంధుమిత్రులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
ధనస్సు రాశి: ఉద్యోగులకు కోరుకున్న చోటుకు స్థానచలనం లభిస్తుంది. మంచి పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. రాజకీయ రంగాల వారికి అదనపు బాధ్యతలు పెరుగుతాయి.
మకర రాశి: ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. అవసరానికి తోబుట్టువుల నుంచి సాయం అందుతుంది. రుణాలను పెద్ద మొత్తంలో తీర్చగలుగుతారు. నూతన వస్తు వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు తొలి అడుగు పడుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.
కుంభరాశి: మిశ్రమకాలం. ఉత్తమ పనితీరుతో ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. నమ్మిన వారే మోసం చేసే ప్రమాదం ఉంది. ముఖ్యమైన విషయాల్లో అజాగ్రత్త పనికిరాదు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల వివాదాల్లో చిక్కుకుంటారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
మీన రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.