పంచాంగం
తేదీ 20-02-2025, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.32 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:00 గంటలకు.
తిథి: బహుళ సప్తమి ఉ 6.39 వరకు, తదుపరి అష్టమి
నక్షత్రం: విశాఖ ఉ 10.39 వరకు, తదుపరి అనురాధ
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: ప. 10.00 నుంచి 10.48 వరకు, తిరిగి మ 2.48 నుంచి 3.36 వరకు
రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ప. 6.00 నుంచి 7.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: మిశ్రమ కాలం. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. మొండి బకాయిలు వసూలు అవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదనపు బాధ్యతలు పెరుగుతాయి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. ఒత్తిడికి లోనవుతారు. ఎవరితోనూ వాగ్వాదాలు పెట్టుకోకండి. కుటుంబ సభ్యుల్లో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.
వృషభ రాశి: కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. కీలక సమయాల్లో బంధుమిత్రుల మద్దతు లభిస్తుంది. కోర్టు వివాదాల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలు పెద్ద మొత్తంలో తీర్చగలుగుతారు.
మిధున రాశి: మీ ప్రవర్తన వల్ల ఇతరులు నొచ్చుకునే అవకాశం ఉంది. ఫలితంగా మీకు ఇష్టమైనవారు దూరమయ్యే ప్రమాదం ఉంది. ద్వంద్వ వైఖరి పనికిరాదు. ఆలోచనల్లో స్పష్టత అవసరం. చెడు సావాసాల వల్ల సమస్యల్లో పడతారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.
కర్కాటక రాశి: అదృష్ట కాలం నడుస్తోంది. ఈ సమయాన్ని మంచి పనులకు సద్వినియోగం చేసుకోవడం వల్ల భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుంచి అందిన వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. డబ్బు పొదుపు చేయాలనుకునే వారికి అనుకూల సమయం.
సింహరాశి: మిశ్రమకాలం. మిమ్మల్ని తప్పుదారి పట్టించేవారు ఉన్నారు. జీవిత భాగస్వామితో ఎట్టి పరిస్థితుల్లోనూ విభేదించకండి. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండండి. మీ ప్రవర్తన వల్ల ఇష్టమైన వారు దూరమయ్యే ప్రమాదం ఉంది. వ్యక్తిగత సమస్యలను కుటుంబ సభ్యుల సమక్షంలో పరిష్కరించుకోండి. సొంత నిర్ణయాలు పనికిరావు.
కన్యారాశి: చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. గత కొంతకాలంగా ఏర్పడిన అనిశ్చితి తొలగిపోతుంది. భవిష్యత్తుకు సంబంధించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడపగలుగుతారు. బంధువుల రాక ఆనందాన్నిస్తుంది.
తులారాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ప్రత్యర్థులు రెచ్చగొట్టాలని చూస్తారు. మొహమాటాలకి పోయి ఖర్చులు పెంచుకుంటారు. అయినప్పటికీ రుణాలు చేయరాదు. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండండి. ప్రత్యర్థులు తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. చెడు సావాసాల వల్ల సమస్యల్లో పడతారు.
వృశ్చిక రాశి: అదృష్ట కాలం. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.
ధనస్సు రాశి: భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత సమస్యలను ఆప్తులతో పంచుకోవడం ద్వారా పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం గానే ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. కంటికి సంబంధించిన అనారోగ్యం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.
మకర రాశి: అదనపు బాధ్యతలు పెరిగినప్పటికీ వాటిని సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆలోచన పరిధి పెరుగుతుంది. ఉద్యోగులు తమ పనితీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు.
కుంభరాశి: ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. పని ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల స్వల్ప అనారోగ్యానికి గురవుతారు. కీలక వ్యవహారాల్లో తోబుట్టువుల మద్దతు లభిస్తుంది. ఆప్తుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.
మీనరాశి: మీ సహనానికి పరీక్ష పెట్టే సంఘటనలు చోటు చేసుకుంటాయి.ఆత్మవిశ్వాసంతో వాటిని ఎదుర్కోండి. ప్రత్యర్థులు రెచ్చగొట్టాలని చూస్తారు. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండండి. ఇతరులతో సంభాషించేటప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. మీ దురుసు ప్రవర్తన వల్ల ఇష్టమైన వారికి దూరమయ్యే ప్రమాదం ఉంది.
