Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 20 మే 2022

పంచాంగం

  1. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు వైశాఖమాసం బహుళపక్షం

సూర్యోదయం: ఉ.5:33
సూర్యాస్తమయం: సా.6:15
తిథి: వైశాఖ బహుళ పంచమి రా.10:24 వరకు తదుపరి వైశాఖ బహుళ షష్ఠి
సంస్కృతవారం: భృగు వాసరః (శుక్రవారం)
నక్షత్రము: పూర్వాషాఢ ఉ.7:50 వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: శుభం రా.6:11 వరకు తదుపరి శుక్లం
కరణం: కౌలవ ఉ.11:36వరకు తదుపరి తైతుల
వర్జ్యం:మ.3:10నుండి 4:40 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:24 నుండి 9:12 వరకు తదుపరి మ.12:24 నుండి 1:12 వరకు
రాహుకాలం: ఉ.10:30 నుండి 12:00 వరకు
యమగండం: మ.3:00 నుండి 4:30 వరకు
గుళికా కాలం : ఉ.7:23 నుండి 8:59 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:10 నుండి తె.4:58 వరకు
అమృతఘడియలు: రా.12:19 నుండి 1:49 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:47 నుండి మ.13:38 వరకు

ఈరోజు. (20-05-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఇంటా బయట శుభ ఫలితాలను పొందుతారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి. దైవానుగ్రహం తో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో భవిష్యత్తు ప్రణాళికను చేస్తారు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఉత్తమ ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది.

వృషభం: శారీరక మానసిక అనారోగ్యాలు ఉంటాయి. ఇతరుల మీద మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. అనుకొన్న సమయానికి అనుకున్న రీతిలో పనులు పూర్తికాక ఇబ్బందికి గురవుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులు కోపానికి గురికావల్సి వస్తుంది. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి.

మిథునం: నూతన వస్తు,వాహన సౌకర్యం పొందుతారు సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది ఉద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.

కర్కాటకం: ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సంఘంలో విశేషమైన గౌరవమర్యాదలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.

సింహం: ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి వ్యాపారమున ఆలోచన లో స్థిరత్వం లోపిస్తుంది. శరీర ఆరోగ్య సమస్యలు కొంత కలవరపెడతాయి. వృధా ఖర్చులు చేస్తారు విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

కన్య: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పాత మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

తుల: నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.అన్ని వైపుల మంచి జరుగుతుంది. కొన్ని వ్యవహారాలు ఆత్మవిశ్వాసంతో దైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. వృత్తిఉద్యోగాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి.

వృశ్చికం: ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి.సౌకర్యాల కొరత లేకున్నా ఇతరుల వలన ఇబ్బందులు ఉంటాయి. కారణం లేకుండానే కుటుంబసభ్యులతో వివాదాలు కలుగుతాయి నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు మానసిక చింతను కలిగిస్తాయి.

ధనస్సు: దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది విలువైన వస్తువులను సేకరించి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు అనుకూల సమయం.

మకరం: చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి. బంధువుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగ విషయమై చెయ్యని పనికి నిందలు పడతారు నిరుద్యోగ ప్రయత్నాలకు నిరాశ తప్పదు.

కుంభం: బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది విలువైన వస్తువులు బహుమతులుగా లభిస్తాయి.

మీనం: ఇతరులతో వివాదాలు కలిగిన విజయం కలుగుతుంది వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరాభిమానాలకు పొందుతారు వ్యాపారపరంగా ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు అమలుపరచి మంచి ఫలితాలను సాధిస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను జారవిడువకుండా చూసుకోవాలి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

క్రైమ్, సస్పెన్స్, రొమాన్స్, కామెడీతో.. ‘అం అః’ సినిమా..! ట్రైలర్ విడుదల

సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా శ్యామ్ మండల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అం అః'. (ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్లర్) ట్యాగ్‌లైన్‌. రంగ‌స్థలం మూవీ...

లైగర్ ‘పీకే’ పోస్టర్‌ తో పబ్లిసిటీ పీక్స్‌

డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాద్ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతుంది. షూటింగ్ ముగిసి నెలలు గడుస్తోంది....

పుష్ప 2 ఫైనల్ వర్షన్‌ ఇంకా రెడీ అవ్వలేదట

అల్లు అర్జున్‌.. సుకుమార్‌ ల కాంబోలో గత ఏడాది చివర్లో వచ్చిన పుష్ప సినిమా సెన్షేషనల్ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతటి ఘన విజయాన్ని సొంతం...

దిల్ రాజు ప్లాన్ తో ఆ సినిమాల రిలీజ్ షెడ్యూల్స్ గందరగోళం

టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ కమ్‌ డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌ రాజు సినిమా ల రిలీజ్ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన థాంక్యూ సినిమా...

మేజర్‌ కు అక్కడ కూడా బ్రహ్మరథం

అడవి శేష్‌ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన మేజర్‌ సినిమా విడుదల అయిన ప్రతి చోట కూడా పాజిటివ్‌ రెస్పాన్స్ ను దక్కించుకుంది....

రాజకీయం

మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నల్ల బెలూన్లతో నిరసన..! పలువురి అరెస్టు

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు....

‘వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే..’ అల్లూరి జయంతి వేడుకల్లో కేటీఆర్

వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై...

ఫాఫం రఘురామ.! చేసుకున్నోడికి చేసుకున్నంత.!

అంతన్నాడింతన్నాడే గంగరాజు.. అన్న పాట గుర్తుకొస్తోంది వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా పరిస్థితి చూస్తోంటే. కొండంత రాగం తీసి తుస్సుమనిపించేశారాయన. ఔను మరి, కోర్టుకెళ్ళారు.. ప్రత్యేక హెలికాప్టర్ అన్నారు.. చివరికి రైలులో పయనమైనా,...

యావత్ భారతావని తరపున అల్లూరికి పాదాభివందనం చేస్తున్నా: ప్రధాని మోదీ

భారతావని మన్యం వీరుడు, విప్లవ జ్యోతి, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ మనమంతా కలుసుకోవడం అదృష్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు...

అల్లూరి చుట్టూ రాజకీయం.! ఇదా ఆయనకిచ్చే గౌరవం.?

ఓ సినీ కవి, మహాత్మాగాంధీని ఉద్దేశిస్తూ.. ‘ఇలా నడి రోడ్డు మీదా.. కరెన్సీ నోటు మీదా.. మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ..’ అంటాడు. మహనీయుల్ని మనం ఎలా చూస్తున్నాం.? అన్న విషయమై...

ఎక్కువ చదివినవి

పవన్‌ బహుభార్యత్వంపై పోతుల సునీత తీవ్ర విమర్శలు

పవన్ కళ్యాణ్‌ సినిమా ల్లో ఎంత పెద్ద స్టార్‌ అయినా.. రాజకీయాల్లో ఎంతో నిజాయితీగా ఉంటాడు అనే పేరును దక్కించుకున్నా కూడా ఆయన యొక్క బహు భార్యత్వం తాలూకు మైనస్‌ ఎప్పటికప్పుడు ఆయన...

హైదరాబాద్: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీలు, హోర్డింగులు

హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీలు, హోర్డింగులు వెలిశాయి. జూలై 3వ తేదీన నగరంలోని పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొననున్న నేపథ్యంలో పరేడ్...

పటేల్ వర్సెస్ అల్లూరి.! ఎవరు గొప్ప.? ఎందుకీ చర్చ.!

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ భీమవరంలో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తున్నారు, విగ్రహావిష్కరణ చేయబోతున్నారు. అల్లూరి జయంతి వేడుకలు అలాగే, ఆజాదీ కా అమృత మహోత్సవ...

యావత్ భారతావని తరపున అల్లూరికి పాదాభివందనం చేస్తున్నా: ప్రధాని మోదీ

భారతావని మన్యం వీరుడు, విప్లవ జ్యోతి, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ మనమంతా కలుసుకోవడం అదృష్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు...

హైదరాబాద్: ప్రధాని మోదీ ప్రసంగంపై టీఆర్ఎస్, కాంగ్రెస్ విసుర్లు, విమర్శలు

సీఎం కేసీఆర్ ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పలేకపోయారని.. హైదరాబాద్ అందాలు మాత్రం చూసి వెళ్లారని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. బీజేపీ బహిరంగ సభ చప్పగా సాగిందని అన్నారు. ధాన్యం...