పంచాంగం
తేదీ 01-02-2025, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.37 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:55 గంటలకు.
తిథి: శుక్ల తదియ మ 2.30 వరకు, తదుపరి చవితి
నక్షత్రం: శతభిషం ఉ 7.08 వరకు, తదుపరి పూర్వాభాద్ర తె 5.53 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర
శుభ సమయం: ప. 12.05 నుంచి 12.33 వరకు
దుర్ముహూర్తం: ఉ 6.00 నుంచి 7.36 వరకు
రాహుకాలం: ప.9.00 నుంచి 10.30 వరకు
యమగండం: మ. 1.30 నుంచి 3.00 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. అజీర్తి సమస్యలు పలకడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. ఆహార నియమాలు పాటించాలి. ప్రత్యర్ధుల కదలికలను గమనిస్తూ ఉండాలి. ఎవరితోనూ వ్యాపార సంబంధిత లావాదేవీల గురించి చర్చించకండి.
వృషభ రాశి: అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. రాబడి పెరుగుతుంది. మొండి బకాయిలు, వసూలు అవుతాయి. పెద్ద మొత్తంలో రుణాలను తీర్చగలుగుతారు. పొదుపు చేయాలనుకునే వారికి ఈరోజు అనుకూల సమయం. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిథున రాశి: ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా ఊహించని లాభాలు అందుతాయి. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. సమయస్ఫూర్తితో ఇతరుల ప్రశంసలు అందుకుంటారు.
కర్కాటక రాశి: ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి ఆదాయ మార్గాలను అన్వేషించాలి. అనవసర ఖర్చుల జోలికి పోరాదు. మనసు చెడు ఆలోచనల వైపుకు మల్లుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవారు ఉన్నారు. చేపట్టిన పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడతాయి. అదనపు బాధ్యతలు పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. అనుకున్న ఫలితాలు సాధించడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.
సింహరాశి: కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆస్తి సంబంధిత వివాదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. గృహంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.
కన్యారాశి: భవిష్యత్తుకు మేలు చేసే గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి ప్రమోషన్లు అందుతాయి. విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టిన పనులు శుభ ఫలితాలను ఇస్తాయి.
తులారాశి: బంధుమిత్రులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. నూతన వస్తు వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభ సమయం. రాజకీయ రంగాల వారికి అదనపు బాధ్యతలు పెరుగుతాయి.
వృశ్చిక రాశి: ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఇంటి పెద్దలు అనారోగ్యం పాలవ్వడం వల్ల ఆందోళన చెందుతారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. చెప్పుడు మాటలకు ప్రభావితం అవుతారు. ముఖ్యమైన పనులను, ప్రయాణాలను వాయిదా వేయటం మంచిది.
ధనస్సు రాశి: చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇంటి పెద్దల సాయంతో వ్యక్తిగత సమస్యను పరిష్కరించుకుంటారు. భవిష్యత్తుకు మేలు చేసే గొప్ప వ్యక్తులతో పరిచయం అవుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.
మకర రాశి: ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఉదర సంబంధిత అనారోగ్యం ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది. ఆహార నియమాలు పాటించాలి. అదనపు బాధ్యతలు పెరిగినప్పటికీ సమర్థవంతంగా వాటిని నిర్వర్తించగలుగుతారు. కుటుంబ సభ్యుల సాయంతో వ్యక్తిగత సమస్యను పరిష్కరించుకుంటారు.
కుంభరాశి: వ్యాపారులకు నూతన ప్రాజెక్టులు చేతికందుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా అనూహ్యమైన లాభాలు అందుతాయి. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. సంతానాభివృద్ధి విషయంలో శుభవార్తలు అందుకుంటారు. అదనపు బాధ్యతలు పెరిగినప్పటికీ సమర్థవంతంగా వాటిని నిర్వర్తించగలుగుతారు.
మీన రాశి: పని ఒత్తిడి ఎక్కువవుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. కొందరి ప్రవర్తన వల్ల కలత చెందుతారు. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోకండి. మీది కానీ వ్యవహారంలో తలదూర్చడం వల్ల న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఖర్చుల విషయంలో పొదుపు పాటించండి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. అరువు తెచ్చుకున్న వాహనాలు వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.