Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 19 జూలై 2024

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,961FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 19- 07- 2024, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆషాఢ మాసం, గ్రీష్మ రుతువు.

సూర్యోదయం: ఉదయం 5:38 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:38 గంటలకు.
తిథి: శుక్ల త్రయోదశి సా 5.54 వరకు, తదుపరి చతుర్దశి.
నక్షత్రం: మూల రా. 2.40 వరకు, తదుపరి పూర్వాషాడ.
దుర్ముహూర్తం: ఉ 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి 12.24 నుంచి 1.12 వరకు.
శుభ సమయం: సా. 5.00 నుంచి 6.00 వరకు.
రాహుకాలం: ఉ 10.30 నుంచి 12.00 వరకు.
యమగండం: మ. 3.00 నుంచి 4.30 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు వేగవంతంగా పూర్తవుతాయి. గతం కంటే ఈరోజు మెరుగ్గా ఉంటుంది. అతిథుల రాక ఆనందాన్నిస్తుంది. బ్యాంకు రుణం కోసం ప్రయత్నిస్తున్న వారు సులభంగా పొందుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి.

వృషభ రాశి: ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదురవుతాయి. సమస్యలు చుట్టుముడతాయి. కుటుంబ సభ్యులు సీజనల్ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యాధి మరింత తీవ్రమౌతుంది. పెట్టుబడులు పెట్టాలనుకునే వ్యాపారులు వాయిదా వేయడం మంచిది. కొన్ని విషయాల్లో జీవిత భాగస్వామితో విభేదించాల్సి రావచ్చు. కుటుంబ సభ్యులతోనూ మనస్పర్ధలు పెరుగుతాయి.

మిథున రాశి: మిశ్రమ కాలం. పని భారం వల్ల ఒత్తిడికి లోనవుతారు. ఎవరిని నమ్మి వ్యాపార భాగస్వాములుగా చేర్చుకోరాదు. వ్యాపారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఎవరితోనూ విభేదించరాదు. అధికారులు మీ పనితీరు పట్ల సంతృప్తిగా ఉండకపోవచ్చు.

కర్కాటక రాశి: ఎవరితోనూ వాగ్వాదానికి దిగకూడదు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోరాదు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు మరింత పెరుగుతాయి. విద్యార్థులకు ఒత్తిడి ఎక్కువవుతుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. గిట్టని వారు తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది. ఆర్థిక సమస్యలు తగ్గు ముఖం పడతాయి.

సింహరాశి: శుభకాలం. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇంటి సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోబుట్టువులను కలుసుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న ఒక సమస్య తల్లిదండ్రుల జోక్యంతో పరిష్కారం అవుతుంది. వ్యాపార లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారానికి సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా చూసుకోవాలి.

కన్యా రాశి: ఈ రాశి వారి ప్రవర్తనలో సంయమనం పాటించాలి. పనిచేసే ప్రదేశంలో ఉద్యోగులు చిక్కులు ఎదుర్కోవచ్చు. అది మీ ప్రమోషన్ పై ప్రభావం చూపుతుంది. అపరిచితులకు దూరంగా ఉండండి. కొన్ని ముఖ్యమైన పనుల కోసం దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొందరు మీ పనులకు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. విద్యార్థులు తమ ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటారు.

తులారాశి: ఈరోజు ఈ రాశి వారు ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటారు. కొంత మేర ఆస్తి నష్టం సంభవిస్తుంది. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు అందుతాయి.

వృశ్చిక రాశి: పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. రాజకీయ రంగాల్లో ఉన్నవారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చట్టపరమైన చిక్కులు ఎదుర్కొన్నప్పటికీ అనుభవజ్ఞుల జోక్యంతో బయటపడతారు. మీ మంచితనాన్ని ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. గతంలో చేసిన పొరపాట్ల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

ధనస్సు రాశి: దూర ప్రయాణాలు చేసేవారు తమ విలువైన వస్తువులని జాగ్రత్తగా చూసుకోవాలి. అవి తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. ఆర్థిక సమస్యలు ఎదురైనప్పటికీ రుణాలు చేయకపోవడం మంచిది. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో విభేదించాల్సి రావచ్చు.

మకర రాశి: ఒత్తిడి వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేక పోతారు. పిల్లలతో దురుసుగా ప్రవర్తించడం మానుకోండి. వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోరాదు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిది. పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులకు కూడా సరైన సమయం కాదు. కొన్ని ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు.

కుంభరాశి: ఎటువంటి వివాదాల్లోనూ జోక్యం చేసుకోకుండా ఉండాలి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారానికి ముందడుగు పడుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. అడ్డంకులను ఎదుర్కోవడానికి తోబుట్టువులు సాయం చేస్తారు. ఇంటి పెద్దల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. చర్చల ద్వారా జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి.

మీన రాశి: వ్యాపారులకు మొండి బకాయిలు చేతికి అందుతాయి. ఒడిదొడుకులు ఉన్నప్పటికీ వ్యాపారం లాభాల బాట పడుతుంది. పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులకు సరైన సమయం. కుటుంబ సభ్యుల్లో అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

సినిమా

‘సంక్రాంతికి వస్తున్నాం’ నా కెరీర్ లో ఓ హిస్టరీ: డైరెక్టర్ అనిల్...

సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయం తన జీవితంలో ఓ హిస్టరీ లాంటిదని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల...

ఐటీ దాడులతో ఆ ‘సినిమాల’ లెక్కలు తేలతాయా.?

ఓ సినిమా ఎంత వసూలు చేసింది.? ఎంత పెద్ద హిట్టయ్యింది.? ఈ విషయాల్ని వెల్లడించాల్సింది నిర్మాత మాత్రమే. బాక్సాఫీస్ లెక్కలంటూ సినీ మీడియాలో రాతలు కుప్పలు...

అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

అక్కినేని వారి ఇంట్లో వరుసగా శుభకార్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగచైతన్య తన ప్రేయసి శోభితను పెళ్లి చేసుకున్నాడు. చైతూ పెళ్లి సమయంలోనే అఖిల్...

ఆస్పత్రి నుంచి సైఫ్‌ అలీఖాన్ డిశ్చార్జి.. ఐదు రోజుల తర్వాత..!

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్‌ అలీఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో దాదాపు ఐదు రోజులు చికిత్స తీసుకున్న తర్వాత ఆయన్ను...

ఫిబ్రవరి 15న గ్రాండ్‌గా సిధ్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్

ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతోన్నాడు. ఫిబ్రవరి 15న ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను మూవ్78 లైవ్ సంస్థ ప్లాన్ చేసింది....

రాజకీయం

జనసేనపై ‘విలీన విషం’ చిమ్ముతున్న ఆర్కే.! అసలేంటి కథ.?

జనసేన పార్టీకి ‘గ్లాస్ సింబల్’ ఫిక్సయ్యింది.! కేంద్ర ఎన్నికల సంఘం, ఈ మేరకు జనసేన పార్టీకి సమాచారం అందించింది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి జనసేన పార్టీని గుర్తింపు పొందిన పార్టీగా, కేంద్ర ఎన్నికల...

డిప్యూటీ సీఎం పదవి ఎందుకంత స్పెషల్.!

ఉప ముఖ్యమంత్రి పదవి.. గతంలో ఎంతోమంది ఈ పదవిలో వున్నారనీ, అయితే.. ఉప ముఖ్యమంత్రిగా ఎవరికీ సరైన గుర్తింపు రాలేదనీ, ఆ పదవికి ఎవరూ సరైన గుర్తింపు తీసుకురాలేకపోయారనీ.. ఇప్పటికే పలు సందర్భాల్లో...

పాతాళానికి తొక్కివేయబడ్డ వైసీపీకి అవకాశమిస్తోన్న టీడీపీలోని ఓ ‘వర్గం’.!

చంద్రబాబుకి వ్యతిరేకంగా టీడీపీలో పావులు కదపడమేంటి.? టీడీపీ అను‘కుల’ మీడియా ఎందుకు చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేస్తోంది.? నారా లోకేష్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి, నారా లోకేష్ ముఖ్యమంత్రి.. అంటూ ఓ వర్గం టీడీపీ...

ఆ నోళ్ళకి తాళం వేసిన టీడీపీ: డ్యామేజ్ కంట్రోల్ అయ్యేనా.?

‘పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిథులు, అధికార ప్రతినిథులు.. ఎవరూ లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలంటూ వ్యాఖ్యలు చేయరాదు’ అంటూ, టీడీపీ అధినాయకత్వం, పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని...

మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడతా: చంద్రబాబు

నాకు మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడుతానంటూ చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తెలుగు జాతి నిత్య స్ఫూర్తిని ఇస్తుందని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల సంతోషమే తనకు ముఖ్యం అన్నారు....

ఎక్కువ చదివినవి

‘గేమ్ ఛేంజర్’ సినిమా మీద చిమ్మిన విషం ఖరీదు 4 కోట్లు.!?

ఐదు రూపాయలిస్తే ఎంత జుగుప్సాకరమైన కామెంట్ అయినా చేయగలిగే ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అక్కౌంట్లు బోలెడున్నాయ్. అవన్నీ నీలి కూలీలకు సంబంధించినవేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పది వేలు పారేస్తే, పనికిమాలిన వీడియోలు చేసి.....

ఎన్టీఆర్ తో మూవీ చేయాలని ఉంది.. హాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్..!

ఎన్టీఆర్ నటన గురించి ఇప్పటికే ఎంతో మంది దర్శకులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటన గురించే గతంలో రాజమౌళి ప్రత్యేకంగా కామెంట్ చేశారు. ఎన్టీఆర్ ఇండియన్ సినిమాకు దొరికిన వరం...

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 19 జనవరి 2025

పంచాంగం: తేదీ 19-01-2025, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, పుష్యమాసం, హేమంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.38 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 5:45 గంటలకు. తిథి: బహుళ పంచమి ఉ 7.03 వరకు తదుపరి...

‘గేమ్ ఛేంజర్’ సినిమాని విద్యార్థులకు చూపిస్తున్నారెందుకంటే.!

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నిర్మాత ‘దిల్’ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ రావడం, కుట్రపూరితంగా సినిమా హెచ్‌డీ వీడియోని...

లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే, పవన్ కళ్యాణ్‌కేంటి నష్టం.?

నారా లోకేష్‌ని ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ కొందరు టీడీపీ నాయకులు, మీడియాకెక్కి రచ్చ చేస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. సీఎం పవన్ కళ్యాణ్.. అని జనసేన శ్రేణులు హడావిడి చేస్తున్నాయి కదా.. ఇదీ...