పంచాంగం:
తేదీ 19-01-2025, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, పుష్యమాసం, హేమంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.38 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:45 గంటలకు.
తిథి: బహుళ పంచమి ఉ 7.03 వరకు తదుపరి షష్టి
నక్షత్రం: ఉత్తర సా. 5.21 వరకు తదుపరి హస్త
శుభ సమయం: సామాన్యము
దుర్ముహూర్తం: సా. 4.25 నుంచి 5.13 వరకు
రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం: మ. 12.00 నుంచి 1.30 వరకు
రాశి ఫలాలు
మేషరాశి: అదృష్ట కాలం. పురోగతిలో నెలకొన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఆస్తి సంబంధ వివాదాలు కొలిక్కి వస్తాయి. సంతాన అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.
వృషభ రాశి: ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాల్సిన సమయం. ప్రయాణాల్లో కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఇష్టమైన వారితో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు. భవిష్యత్తుకు మేలు చేసే ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.
మిథున రాశి: ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్య మళ్ళీ తిరగబడుతుంది. మీ తప్పు లేకపోయినా ఒక వ్యవహారంలో మాట పడాల్సి రావచ్చు. స్వల్పంగా ఆస్తి నష్టం జరుగుతుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. రుణదాతల ఒత్తిడి ఎక్కువవుతుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి.
కర్కాటక రాశి: బంధుమిత్రుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం.
సింహరాశి: మిశ్రమకాలం. ఆలోచనల్లో స్థిరత్వం అవసరం. ముఖ్యమైన పనులపై శ్రద్ధ పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని వాయిదా వేయరాదు. సమయం వృధా చేసుకోకండి. మొహమాటాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ రుణాల జోలికి పోవద్దు. ఎవరినీ నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వరాదు.
కన్యారాశి: ఉద్యోగులకు స్థానచలన సూచనలు ఉన్నాయి. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా అనూహ్యమైన లాభాలు అందుతాయి. రాజకీయ రంగాల వారికి అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
తులారాశి: జాగ్రత్త గా వ్యవహరించాల్సిన సమయం. ప్రత్యర్ధులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. సమయానుకూలంగా వ్యవహరించి వాటిని ఎదుర్కోవాలి. మనసు చెడు ఆలోచనల వైపు మల్లుతుంది. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులు శుభ ఫలితాలను ఇస్తాయి.
వృశ్చిక రాశి: కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్లకు సంబంధించి శుభవార్తలు వింటారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. నూతన ప్రాజెక్టులు చేతికందుతాయి. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల ప్రయత్నానికి తొలి అడుగు పడుతుంది.
ధనస్సు రాశి: ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు శుభ ఫలితాలను ఇస్తాయి. పురోగతిలో నెలకొన్న ఆటంకాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తి సంబంధ వివాదాలు కొలిక్కి వస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వ్యాపారులకు నూతన ప్రాజెక్టులు చేతికందుతాయి.
మకర రాశి: మొండి బకాయిలు చేతికి అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలను ఎక్కువ మొత్తంలో తీర్చగలుగుతారు. వ్యాపారులకు నూతన ప్రాజెక్టులు చేతికందుతాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు.
కుంభరాశి: విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు. వ్యాపారులకు మేలైన ఫలితాలు వస్తాయి. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు తొలి అడుగు పడుతుంది. ఆప్తుల నుంచి అందిన వార్త ఆనందాన్నిస్తుంది.
మీనరాశి: ఎవరితోనూ విభేదాలు పెట్టుకోకండి. మీది కాని వ్యవహారంలో తలదూర్చకండి. ఇతరుల విషయాల్లో అనవసర జోక్యం వల్ల న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. రుణాల జోలికి పోవద్దు. ముఖ్యమైన పనులను వాయిదా వేయటం మంచిది.