Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 19 ఫిబ్రవరి 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,724FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 19-02-2025, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు.

సూర్యోదయం: ఉదయం 6.32 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:00 గంటలకు.
తిథి: బహుళ సప్తమి పూర్తిగా
నక్షత్రం: స్వాతి పూర్తిగా ఉ 8.11 వరకు తదుపరి విశాఖ
శుభ సమయం: ఉ 9.08 నుంచి 9.24 వరకు
దుర్ముహూర్తం: ప. 11.36 నుంచి 12.24 వరకు
రాహుకాలం: మ.12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ప. 7.30 నుంచి 9.00 వరకు

రాశి ఫలాలు

మేషరాశి: బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. సానుకూల దృక్పథంతో ఉండండి. అనుకున్న పనులు నెరవేరుతాయి. అతి మంచితనం పనికిరాదు. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చేముందు ఆలోచించి ఇవ్వడం మంచిది. ప్రయాణాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి.

వృషభ రాశి: ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి కుటుంబంలో గత కొంతకాలంగా నెలకొన్న అనిశ్చితి కి పరిష్కారం దొరుకుతుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. చేపట్టిన పనుల్లో శుభ ఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రుల రాక ఆనందాన్నిస్తుంది. ఇతరులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి.

మిథున రాశి: కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారులకు విశేషమైన లాభాలు అందుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దు.

కర్కాటక రాశి: గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి బయటపడతారు. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. మొండి బకాయిలు వసూలు అవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు పొదుపు చేయడానికి అనుకూల సమయం. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు.

సింహరాశి: కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇతరులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. అహంభావాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి.

కన్యా రాశి: కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబంలో ఒకరికి వివాహం నిశ్చయమవుతుంది. ఇష్టమైన వారితో కలిసి ఆనందంగా గడుపుతారు. అదనపు బాధ్యతలు పెరిగినప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తించ గలుగుతారు. ఊహించని విధంగా డబ్బు చేతికందుతుంది. ఒక వ్యవహారంలో తోబుట్టువుల మద్దతు లభిస్తుంది.

తులారాశి: గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. విలువైన వస్తువులను సేకరిస్తారు. భూతగాదాలు కొలిక్కి వస్తాయి. ఆప్తులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగిపోతాయి.

వృశ్చిక రాశి: భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఎవరిని అతిగా నమ్మకండి. అపరిచితులతో జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. మీది కానీ వ్యవహారంలో తల దూర్చడం వల్ల న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇష్టమైన వారిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.

ధనస్సు రాశి: అదృష్ట కాలం. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు తొలి అడుగు పడుతుంది. ఉద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు అందుతాయి. పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా విశేషమైన లాభాలు అందుతాయి. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది సంతానాభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు.

మకర రాశి: సానుకూల వాతావరణం ఉంటుంది. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు సలహా తీసుకోండి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులు ఆ ప్రయత్నాలు మొదలు పెట్టొచ్చు. న్యాయవాద రంగంలో ఉన్నవారికి విశేషమైన గుర్తింపు లభిస్తుంది.

కుంభరాశి: చేపట్టిన పనులు విజయవంతం అవుతారు. కుటుంబ సభ్యుల నుంచి కీలక సమయాల్లో మద్దతు లభిస్తుంది. ఊహించని ధన లాభం కలుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఉదర సంబంధిత అనారోగ్యం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆహార నియమాలు పాటించండి. తగినంత విశ్రాంతి అవసరం.

మీన రాశి: చేపట్టిన పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడతాయి. ఏదైనా పని మొదలుపెట్టే ముందు కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మాటలను అదుపులో ఉంచుకోండి.కొన్ని సమయాల్లో మౌనంగా ఉండటం మంచిది. ఖర్చులు పెరిగినప్పటికీ రుణాల జోలికి పోవద్దు.

సినిమా

“పెద్ద కలలు కనండి.. కష్టపడితే విజయం మీదే” – ‘చెన్నై లవ్...

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ...

బాలకృష్ణ ఆరోగ్యంపై ఏఐజీ హెల్త్ బులెటిన్.. గాయం వివరాలు వెల్లడి

నందమూరి బాలకృష్ణకు సినిమా షూటింగ్ సందర్భంగా ఎడమ మోకాలికి గాయం కావడంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు...

‘సమ్మర్ హాలిడేస్’లో జయసుధ అమ్మమ్మ లుక్ విడుదల

కథా ప్రధానమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని, తన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న చిల్డ్రన్ మూవీ...

Chiranjeevi Birthday Special: చిరంజీవి మాస్ సినిమాలకు C/o దొంగమొగుడు

Chiranjeevi Birthday Special: ప్రతి ఏటా ఆగష్టు నెల వస్తుందంటే మెగాభిమానుల్లో ఆనందోత్సాహలు. ప్రతి ఏటా ఆగష్టు నెల రావడంతోనే చిరంజీవి పుట్టినరోజు ఆగష్టు 22వ...

బాలయ్య త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్ష

కాకినాడలో 'NBK111' సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయానికి గురైన నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు. బాలకృష్ణ ఆరోగ్యంపై...

రాజకీయం

తిరుమలలో హనుమాన్ విగ్రహం అపహరణ.. 24 గంటల్లో నివేదిక కోరిన మంత్రి

తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే డౌన్ ఘాట్ రోడ్డులో ఏడో మైలు వద్ద భక్తులు ప్రతిష్ఠించిన చిన్న హనుమాన్ రాతి విగ్రహం అపహరణకు గురైన ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం...

నీట్ రగడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చెయ్యాల్సిందేనా.?

దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు ఓ వైపు.. నీట్ వివాదం ముసుగులో అసాంఘీక శక్తుల అరాచకం ఇంకో వైపు.. వెరసి, దేశ రాజధానిలో హాట్ హాట్ వాతావరణం నెలకొంది. పోటీ పరీక్షలకు...

పవన్‌పై ఆరోపణలకు క్షమాపణ చెప్పాలి: జనసేన తెలంగాణ

హైదరాబాద్‌లోని కోడి చెరువు భూముల వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై చేసిన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జనసేన తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్...

ప్రభుత్వ పాఠశాలలే ఆదర్శం కావాలి: లోకేష్

ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి, ప్రైవేటు పాఠశాలలు కూడా చూసి అసూయపడే స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో...

కాదంబరి జెత్వానీ కేసు.. అసలు నిజాలివే!

కాదంబరి జెత్వానీ వ్యవహారం మరోసారి రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఈ అంశంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు పోస్టుల్లో...

ఎక్కువ చదివినవి

‘సింగ్ గీతం’ హీరోయిన్ షాలిని కొండేపూడి.. ఇప్పుడు దర్శకురాలు!

తెలుగు చిత్రసీమలో మరో మహిళా దర్శకురాలు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్ గీతం' చిత్రంలో హీరోయిన్‌గా నటించి...

డాక్టర్ హత్య కేసు.. భార్యపై అనుమానాలు?

కర్ణాటకలోని ధారవాడలో ఓ ప్రముఖ వైద్యుడు తన ఇంట్లోనే దారుణ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. 45 ఏళ్ల అనస్థీషియాలజిస్టు డాక్టర్ కిరణ్ హొన్నన్నవర్ అపార్ట్‌మెంట్‌లో మృతిచెందగా, ఆయన 8 ఏళ్ల కుమారుడు...

పలమనేరు అడవి ఏనుగు పట్టివేత… నెల రోజుల ఆపరేషన్ సక్సెస్

పలమనేరు పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా సంచరిస్తూ పంటలను ధ్వంసం చేయడంతో పాటు గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒంటరి మగ అడవి ఏనుగును ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ విజయవంతంగా బంధించింది. దాదాపు నెల...

ట్రైనీ ఐపీఎస్ ఆత్మహత్యాయత్నం.. అసలు బాధితుడు ఎవరు?

ఓ సాధారణ కానిస్టేబుల్‌గా ఉద్యోగం ప్రారంభించి, కష్టపడి చదివి ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) సాధించడం అంత తేలిక కాదు. అలాంటి అరుదైన ప్రయాణమే ఉదయ్ కృష్ణారెడ్డిది. కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఉన్నతాధికారుల చిన్నచూపును...

Jani master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఫెడరేషన్ షాక్.. షోకాజ్ నోటీసు

Jani master: డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ కు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఇటివల జరిగిన పరిణామాలతో ఆయనపై మండిపడింది. ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని...