Switch to English

రాశి ఫలాలు: శనివారం 19 జూన్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్టమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:29
సూర్యాస్తమయం: సా.6:31
తిథి: జ్యేష్ఠ శుద్ధ నవమి సా.4:24 వరకు తదుపరి దశమి
సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం)
నక్షత్రము: హస్త సా.5:09 వరకు తదుపరి చిత్త
యోగం: వరీయాన్ రా.9:31 వరకు తదుపరి పరిఘ
కరణం: కౌలవ మ. 2:36 వరకు
వర్జ్యం: రా.12:42 నుండి 2:12 వరకు
దుర్ముహూర్తం: ఉ. 5:29 నుండి 7:12 వరకు
రాహుకాలం: ఉ.9:00 నుండి ఉ.10:30 వరకు
యమగండం: మ.1:30 నుండి 3:00 వరకు
గుళికా కాలం : ఉ.5:46 నుండి ఉ.7:24 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:10 నుండి తె.4:58 వరకు
అమృతఘడియలు: ఉ.11:24 నుండి మ.12:56 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:51 నుండి మ.12:43 వరకు

ఈరోజు (19-06-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: అనుకొన్న పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కొన్ని కీలక విషయాలపై చర్చలు చేస్తారు. ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. శత్రువులుకూడా మిత్రులుగా మారి సహాయపడతారు.

వృషభం: సమాజంలో కొత్త మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సంతాన పరమైన ఇబ్బందులు బాధిస్తాయి.

మిథునం: స్ధిరాస్తి వివాదాలకు సంభందించి సన్నిహితుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. కుటుంబంలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో కొంత జాప్యం తప్పదు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలు కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది.

కర్కాటకం: చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. అనుకొన్న పనులు నూతనోత్సాహంతో పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గృహమునకు దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

సింహం: పాత మిత్రులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి , ఉద్యోగాలు స్థిరత్వం ఉండవు.

కన్య: దీర్ఘకాలిక ఋణ సమస్యలు పరిష్కారమౌవుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా విజయం సాధిస్తారు. గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలlo సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.

తుల: చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. నూతన రుణయత్నాలు చేస్తారు. దూరప్రయాణాలలో వాహన అవరోధాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రారంభ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి , ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం: ముఖ్యమైన వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. కుటుంబమున దీర్ఘ కాలిక సమస్యలు తీరతాయి. ఆర్థికంగా స్థిరమైన ఆలోచనలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

ధనస్సు: నిరుద్యోగుల శ్రమ ఫలించి నూతన అవకాశాలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

మకరం: వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్య వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.

కుంభం: సన్నిహితులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరమైన చికాకులు పెరుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. సోదర వర్గం నుండి కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగ యత్నాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలలో స్వల్ప నష్ట సూచనలున్నవి.

మీనం: మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకుంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

రాజకీయం

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎక్కువ చదివినవి

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్, రియా సుమన్ హీరోయిన్లుగా 'జితేందర్ రెడ్డి'...

కడపలో వైసీపీకి షర్మిల డ్యామేజ్.! వర్ణనాతీతమే.!

‘కొంగుపట్టి అడుగుతున్నా.. న్యాయం చేయండి..’ అంటూ కంటతడి పెడుతున్నారు కడప లోక్ సభ నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సోదరి సునీతా రెడ్డితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో వైఎస్...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...