పంచాంగం
తేదీ 18-03-2025, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు.
తిథి: బహుళ చవితి సా. 7.02 వరకు తదుపరి పంచమి
నక్షత్రం: స్వాతి మ. 2.52 వరకు తదుపరి విశాఖ
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: ఉ. 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి రా. 10.48 నుంచి నుంచి 11.36 వరకు
రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
రాశి ఫలాలు
మేషరాశి: దూరమైన వారు తిరిగి చేరువవుతారు. క్లిష్ట సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు పెట్టుబడికి కావాల్సిన అన్ని వనరులు చేతికి అందుతాయి. ఉద్యోగులకు పని ప్రదేశంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది.
వృషభ రాశి: బంధుమిత్రులతో కలిసి భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత సమస్యలను ఇంటి పెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అవసరానికి తోబుట్టువుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
మిథున రాశి: స్వయంకృతాపరాధం తో ఆప్తులను దూరం చేసుకుంటారు. మీ మాట తీరు వల్ల ఇతరులు నొచ్చుకునే ప్రమాదం ఉంది. మనసు చెడు ఆలోచనల వైపుకు మల్లుతుంది. పెద్దల మాటను పెడచెవిన పెట్టడం వల్ల ఇబ్బందుల్లో పడతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి.
కర్కాటక రాశి: మొహమాటలకు పోయి ఖర్చులు పెంచుకుంటారు. రుణాలు చేయాల్సి రావచ్చు. ప్రత్యర్ధులు రెచ్చగొట్టాలని చూస్తారు. జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను ఈరోజు జరుపకపోవడం మంచిది.
సింహరాశి: ఉద్యోగులు తమ పని తీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.
కన్య రాశి: ప్రతికూల ఆలోచనలు దరిచేరనివ్వకండి. కొన్ని విషయాల్లో మీ అంచనాలు తప్పుతాయి. మనో నిబ్బరంతో ఉండండి. పని ఒత్తిడి వల్ల అలసట పెరుగుతుంది. ఆరోగ్యం పై దృష్టి పెట్టండి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
తులారాశి: అనుకోని ఆదాయం పెరుగుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆస్తి సంబంధ వివాదాలు తొలగిపోతాయి. దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య నుంచి ఈరోజు ఉపశమనం కలుగుతుంది. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి జాగ్రత్తగా ఉండండి.
వృశ్చిక రాశి: అదనపు బాధ్యతలు పెరగడం వల్ల పని ఒత్తిడి ఎక్కువవుతుంది. అలసటకు లోనవుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్లక్ష్యం పనికిరాదు. అపరిచితులతో ఆర్థిక లావాదేవీలు జరపకపోవడం మంచిది. ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి.
ధనస్సు రాశి: ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య మరింత తీవ్రమవుతుంది. నిర్లక్ష్యం చేయకండి. తగినంత విశ్రాంతి అవసరం. ముఖ్యమైన పనులను, ప్రయాణాలను వాయిదా వేయటం మంచిది. మీది కాని వ్యవహారంలో తలదూర్చకండి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.
మకర రాశి: ఆప్తుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
కుంభరాశి: మిశ్రమ కాలం. నిర్లక్ష్య ధోరణిని పక్కన పెట్టండి. ఏకపక్ష నిర్ణయాల వల్ల చిక్కుల్లో పడతారు. వ్యక్తిగత సమస్యలను కుటుంబ సభ్యుల సమక్షంలో పరిష్కరించుకోండి. ముఖ్యమైన పనులను మొదలుపెట్టేటప్పుడు ఇంటి పెద్దల సలహా తీసుకోండి. మీ మాటల వల్ల ఇతరులు కలత చెందే అవకాశం ఉంది.
మీనరాశి: ఇతరులతో ఆచితూచి సంభాషించండి. మీ ప్రవర్తన వల్ల ఇతరులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో స్వల్పంగా విభేదించాల్సి రావచ్చు. సమస్య తీవ్రమవుతుందన్నప్పుడు మౌనంగా ఉండటం మంచిది. తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ఈరోజు ఎటువంటి లావాదేవీలు జరపకపోవడం మంచిది.