Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 18 మార్చి 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం

సూర్యోదయం: ఉ.6:10
సూర్యాస్తమయం: రా.6:04 ని
తిథి: బహుళ ఏకాదశి ఉ.8:34 వరకు తదుపరి ద్వాదశి
సంస్కృతవారం:స్థిరవాసరః (శనివారం )
నక్షత్రము: శ్రవణం రా.10:32 వరకు తదుపరి ధనిష్ఠ
యోగం: శివం రా.10:10 వరకు తదుపరి సిద్ధం
కరణం:భాలవ ఉ.8:34 ని. వరకు తదుపరి కౌలవ
దుర్ముహూర్తం: ఉ.6:10 నుండి 7:45 వరకు
వర్జ్యం : ఉ.2:15 నుండి 3:44 వరకు
రాహుకాలం: ఉ.9:00 నుండి 10:30 వరకు
యమగండం: మ.1:30 నుండి 3:00 వరకు
గుళికా కాలం : ఉ.6:25 ని.నుండి 7:55 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:49 నుండి 5:37 వరకు
అమృతఘడియలు:రా.12:52 నుండి 2:21 ని. వరకు
అభిజిత్ ముహూర్తం : మ.12:00 నుండి 12:48 వరకు

ఈరోజు (18-03-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత పెంచుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు అవరోధాలు తొలగుతాయి.

వృషభం: దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. ఉద్యోగాలలో అధికారులనుండి విమర్శలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.

మిథునం: ఋణ దాతల ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు కొంత చాలాకష్టం మీద పూర్తిఅవుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు కీలక వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.

కర్కాటకం: విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. వృత్తి సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన పురోగతిలో సాధిస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

సింహం: నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. చేపట్టిన వ్యవహారములు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.

కన్య: వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్ధిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టిన వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి.

తుల: మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి,వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇంటా బయట కొందరి ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం: వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి నిరుద్యోగులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు సన్నిహితులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

ధనస్సు: నేత్ర సంభందిత ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి.

మకరం: సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెట్టి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన అవకాశములు అందుతాయి చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు.

కుంభం: వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు చేదాటుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీనం: నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...