Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 18 జనవరి 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,838FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 18-01-2025, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, పుష్యమాసం, హేమంత ఋతువు.

సూర్యోదయం: ఉదయం 6.38 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:45 గంటలకు.
తిథి: బహుళ పంచమి పూర్తిగా
నక్షత్రం: పుబ్బ మ. 3.01 వరకు, తదుపరి ఉత్తర
శుభ సమయం: ఉ 11.31 నుంచి 12.08 వరకు, తదుపరి 4.32 నుంచి 5.20 వరకు
దుర్ముహూర్తం: ఉ 6.00 నుంచి ఉ 7.36 వరకు
రాహుకాలం: ఉ 9.00 నుంచి 10.30 వరకు
యమగండం: మ. 1.30 నుంచి 3.00 వరకు

రాశి ఫలాలు

మేషరాశి : సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం.

వృషభ రాశి: మనశ్శాంతిని దూరం చేసే సంఘటనలకు దూరంగా ఉండండి. అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి. అవసరానికి తోబుట్టువుల నుంచి సాయం అందుతుంది. పెద్దల సమక్షంలో వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవాలి. ముఖ్యమైన పనులను వాయిదా వేయండి.

మిధున రాశి: ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. రుణదాతల ఒత్తిడి ఎక్కువవుతుంది. మీది కానీ వ్యవహారంలో తలదూర్చకండి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు.

కర్కాటక రాశి: ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్య మళ్ళీ తిరగబడుతుంది. ఆహార నియమాలు పాటించాలి. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అనూహ్యమైన లాభాలు అందుతాయి.

సింహరాశి: ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంపద పెరుగుతుంది. ప్రతిభతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది.

కన్య రాశి: విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యుల్లో కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనూహ్యమైన లాభాలు అందుతాయి. పిల్లల భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు.

తులారాశి: చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కోర్టు కేసుల నుంచి బయటపడతారు. న్యాయవాద వృత్తుల వారు శుభవార్తలు వింటారు. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు తొలి అడుగు పడుతుంది. ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది.

వృశ్చిక రాశి: అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల్లో సఖ్యత పెరుగుతుంది. ఇంటి పెద్దల సాయంతో చిరకాల కోరికను నెరవేర్చుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.

ధనస్సు రాశి: ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. అదనపు బాధ్యతలు పెరిగినప్పటికీ సమర్థవంతంగా వాటిని నిర్వర్తించగలుగుతారు. మీ ప్రతిభతో ఇతరుల ప్రశంసలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. సంతానలేమితో బాధపడుతున్న వారు శుభవార్తలు వింటారు.

మకర రాశి: పెద్ద మొత్తంలో రుణాలను తీర్చగలుగుతారు. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా విశేషమైన లాభాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి. రాజకీయ రంగాల వారికి నూతన పదవీ లాభాల సూచితం. ఉద్యోగులకు కోరుకున్న చోట స్థానచలనం లభిస్తుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.

కుంభరాశి: ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి సంపద పెరుగుతుంది. వ్యాపారులకు ఊహించని లాభాలు అందుతాయి నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి.

మీన రాశి: దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. అదనపు ఖర్చులను అదుపులో నియంత్రించుకోగలగాలి. సంపద సృష్టిపై శ్రద్ధ పెట్టాలి. భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక ముఖ్యమైన వ్యక్తితో ఈరోజు ఈ రాశి వారికి పరిచయమవుతుంది. కీలక సమయాల్లో ఇంటి పెద్దల మద్దతు లభిస్తుంది. అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు.

సినిమా

Tollywood: ‘పక్కోడి ముందు పరువు తీసేసుకోవాలి’ ఇదే టాలీవుడ్ నయా ట్రెండ్..!

Tollywood: ఎక్కడైనా, ఎవరైనా తమ పరువు కాపాడుకోవాలనే చూస్తారు. వేరేవారి ముందైతే తప్పనిసరిగా కాపాడుకుంటారు. కానీ.. తెలుగువాళ్లు తమ పరువు తీసుకోవడానికి.. మరీ ముఖ్యంగా ఇతరుల...

Ram Charan Birthday Special: ‘ఇంతై.. ఇంతింతై..’ తెలుగు సినిమాపై రామ్...

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తెరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే ఆయనకు ధీటైన వారసుడిగా అటు ఫ్యామిలీ, ఇటు సినిమాల్లోనూ పేరు తెచ్చుకున్నారు రామ్...

రాబిన్ హుడ్ కోసం డేవిడ్ వార్నర్ వచ్చేశాడు..!

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమా మార్చి 28న రిలీజ్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో...

అల్లు అర్జున్ డ్యుయల్ రోల్..?

పుష్ప 2 తో పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పనులు మొదలు పెట్టాడని తెలుస్తుంది. త్రివిక్రంతో చేయాల్సిన భారీ...

బ్లాక్ డ్రెస్ లో ‘బేబీ’ అదుర్స్..!

బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య నెక్స్ట్ సిద్ధు జొన్నలగడ్డతో జాక్ సినిమాతో రాబోతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న...

రాజకీయం

డీలిమిటేషన్ పంచాయితీ: వైఎస్ జగన్ ఎందుకు వెళ్ళలేదు.?

డీలిమిటేషన్ ప్రక్రియను పాతికేళ్ళు ఆపేయాలంటూ తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే, సంచలనాత్మక డిమాండ్ చేసింది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడం సబబు కాదన్నది చెన్నయ్‌లో డీఎంకే నేతృత్వంలో వివిధ రాజకీయ పార్టీల అధినేతల...

మంత్రి లోకేష్ చొరవతో విద్యాశాఖ లో సంస్కరణలు

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యాశాఖలో ఆయన చేపడుతున్న సంస్కరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, టెక్నాలజీపై పట్టు లాంటివి పెంపొందించేందుకు తాజాగా మరోసారి కీలక సంస్కరణలు...

15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక.!

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, అప్పుల కుప్పగా మారిపోయింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణకు గణనీయంగా ఆదాయాన్ని ఇచ్చే హైద్రాబాద్ నగరం, రాజధానిగా వుంది. కానీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని...

పదకొండు వర్సెస్ మూడు, ఇరవై మూడు.!

‘మేం అధికారంలోకి వస్తే, పదకొండు అనే నెంబర్‌ని పూర్తిగా తొలగిస్తాం..’ అని గనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే.? అసలు అలా జరుగుతుందా.? ఛాన్సే లేదు.! కానీ, ఇలాంటి...

బూతులు లేవు, బాధ్యతలు మాత్రమే.! కూటమి సర్కారుకి జన నీరాజనం.!

అసెంబ్లీ సమావేశాలు అంటే, బూతులే.. ఒకప్పుడు.! ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూడ ముచ్చటగా వుంటున్నాయ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల గురించి ప్రస్తావన వస్తోంటే, ఇంటిల్లిపాదీ ప్రత్యక్ష ప్రసారాల్ని...

ఎక్కువ చదివినవి

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తాం : నారా లోకేష్..!

ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై వాస్తవాలను చెబుతున్నా కూడా వైసీపీ వినే పరిస్థితి లేదని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంపై వైసీపీ...

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 17 మార్చి 2025

పంచాంగం తేదీ 17-03-2025, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ తదియ సా. 4.57 వరకు,...

అసెంబ్లీ చుట్టూ తిరుగుతున్న జగన్, అసెంబ్లీలోకి వెళ్ళడానికెందుకు భయపడుతున్నట్లు.?

ఓ వైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇంకో వైపు, ప్రతిపక్ష హోదా ఆశిస్తున్న పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం, అసెంబ్లీ వైపు అస్సలు చూడకుండా, అసెంబ్లీ చుట్టూనే...

విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రానాలపై కేసు నమోదు..!

అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్ మీద తెలంగాణ పోలీసులు సీరియస్ యాక్షన్ లోకి దిగారు. ఇప్పటికే తమ స్వలాభం కోసం డబ్బుకి ఆశపడి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన...

బల ప్రదర్శనతో వైఎస్ జగన్ ఏం సాధిస్తారు.?

మొన్న గుంటూరు మిర్చియార్డు సందర్శన సందర్భంగా పోటెత్తిన జన సందోహం.! నిన్న కూడా ఓ వివాహ వేడుకకి హాజరైతే, అక్కడా జన సంద్రం.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్...