Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 18 ఫిబ్రవరి 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,861FansLike
57,764FollowersFollow

పంచాంగం:

తేదీ 18-02-2025, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు.

సూర్యోదయం: ఉదయం 6.32 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:00 గంటలకు.
తిథి: బహుళ షష్ఠి తె 3.34 వరకు, తదుపరి సప్తమి
నక్షత్రం: స్వాతి పూర్తిగా
శుభ సమయం: సామాన్యం
దుర్ముహూర్తం: ప. 8.24 నుంచి 9.12 వరకు తిరిగి రా. 10.48 నుంచి 11.36 వరకు
రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ప. 9.00 నుంచి 10.30 వరకు

రాశిఫలాలు

మేష రాశి: చెడు అలవాట్లకు ఎక్కువ ఖర్చు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు. పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండండి. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. మీది కానీ వ్యవహారంలో తలదూర్చకండి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి.

వృషభ రాశి: బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి చిన్న తరహా పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టేవారు కాస్త జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే అవి తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.

మిధున రాశి: పని భారం ఎక్కువ అవడం వల్ల అలసటకు లోనవుతారు. ఒత్తిడి పెరుగుతుంది. పొదుపు ప్రారంభించాలి అనుకునే వారికి ఈరోజు అనుకూల సమయం. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు. సంతాన అభివృద్ధి విషయంలో శుభవార్తలు వింటారు. వ్యాపారులు పెట్టుబడి పెట్టే ముందు అనుభవజ్ఞులను సంప్రదించండి.

కర్కాటక రాశి: భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. మీ ఆవేశం వల్ల కుటుంబ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఆప్తులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. చెడు ఆలోచనలకు, అలవాట్లకు దూరంగా ఉండండి. మిమ్మల్ని రెచ్చగొట్టేవారున్నారు. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండండి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి.

సింహరాశి: ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. గొప్ప వ్యక్తులతో పరిచయం అవుతుంది. ఉద్యోగులకు పని ప్రదేశంలో అనుకూలంగా ఉంటుంది. తమ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. అనారోగ్య సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం.

కన్యారాశి: కొంత గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటారు. స్పష్టమైన ఆలోచనలు మేలు చేస్తాయి. ఏకపక్ష నిర్ణయాలకు దూరంగా ఉండండి. ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించేముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

తులారాశి: కీలక సమయాల్లో తోబుట్టువుల మద్దతు లభిస్తుంది, కుటుంబ సభ్యుల సలహాతో ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా అనూహ్యమైన లాభాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులను సేకరిస్తారు. బంధుమిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు.

వృశ్చిక రాశి: మిశ్రమకాలం.నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులు అనుభవజ్ఞుల సలహా తీసుకొని పెట్టుబడులు పెట్టండి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది.

ధనస్సు రాశి: ఆర్థిక సమస్యలు చుట్టు ముడతాయి. మొహమాటాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ రుణాలు చేయరాదు. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండండి. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఇతరులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అనవసర వివాదాలు జోలికి వెళ్ళకండి.

మకర రాశి: చేపట్టిన పనులను ఉత్సాహంతో పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంటా బయటా పై చేయి సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. ఆప్తుల నుంచి అందిన ఒక వార్త కుటుంబంలో సంతోషాన్ని ఇస్తుంది. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులు ఈరోజు పూర్తవుతాయి.

కుంభరాశి: మిశ్రమకాలం. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీ ఆవేశం వల్ల ఇష్టమైనవారు దూరమయ్యే ప్రమాదం ఉంది.అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామితో ఒక వ్యవహారంలో విభేదించాల్సి రావచ్చు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఇతరులతో సంభాషించేటప్పుడు మాటలను అదుపులో ఉంచుకోండి.

మీన రాశి: గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. రుణాల బాధలు తొలగిపోతాయి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు పూర్తవుతాయి. తోబుట్టులతో కలిసి ఆనందంగా గడుపుతారు. భవిష్యత్తుకు ఉపయోగపడే గొప్ప వ్యక్తిని కలుసుకుంటారు.

సినిమా

దిల్ రూబా కనెక్ట్ అయితే ఊహించనంత రేంజ్ : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ థిల్లాన్, కెతి దేవిసన్ హీరోయిన్స్ గా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమా...

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్...

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత...

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌...

టచ్ చేశావ్ కిరణ్..!

తను ఎదుగుతూ మరో పదిమంది ఎదగడానికి సహాయం చేయడం అన్నది చాలా గొప్ప విషయం. తాను అనుభవించిన కష్టం తెలుసు కాబట్టి మరొకరు ఆ కష్టం...

రాజకీయం

స్టూడెంట్స్ లో మార్పు కోసం గుంజీలు తీసిన హెచ్ ఎం.. అభినందించిన లోకేష్

ఏపీ విద్యాశాఖలో మార్పుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యార్థులను కొట్టడం ద్వారా కాకుండా బుద్ధులు నేర్పించడం ద్వారా మార్చాలనేది విద్యాశాఖ ముఖ్య ఉద్దేశం. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా...

పోసాని బ్లాక్‌మెయిల్ చేస్తే, న్యాయస్థానం బెయిల్ ఇస్తుందా.?

నోటికొచ్చిందల్లా వాగితే, రాజకీయ ప్రత్యర్థుల ఇళ్ళల్లోని చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు తెగబడతానంటూ రెచ్చిపోతే.. వ్యవస్థలు ఊరుకుంటాయా.? ఎప్పుడూ తామే అధికారంలో వుంటాం కాబట్టి, ఎలాంటి రాక్షసత్వానికైనా తెగబడొచ్చనుకుంటే కుదురుతుందా.? కుదరదు, ఇది ప్రజాస్వామ్యం. సినీ...

చంద్రబాబుని ఏకాకిని చేద్దామనుకున్న జగన్.! తానే చివరికి ఏకాకిగా మిగిలిపోయె.!

చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కొనే క్రమంలో, ఆయన్ని ఏకాకిగా మార్చేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. రాజకీయాల్లో రాజకీయ యెత్తుగడల్ని తప్పు పట్టలేంగానీ.. వైఎస్ జగన్ అనుసరించిన...

ఏ-2 విజయ సాయి రెడ్డి మనసెందుకు విరిగిపోయింది.?

వైసీపీ మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి, ‘నా మనసు విరిగిపోయింది’ అంటూ చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్నే ఆశ్చర్యపరుస్తున్నాయి. ‘మీకే మనసు విరిగిపోయిందంటే, మా పరిస్థితి ఏంటి.?’ అని కొందరు వైసీపీ...

ఆడుదాం ఆంధ్రా స్కామ్‌.. రంగంలోకి ACB..!

వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాలో కోట్ల అవకతవకలపై ACB విచారణకు సిద్ధమైంది ప్రభుత్వం. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో జరిగిన అవకతవకలు, ఆరోపణలపై సమగ్ర విచారణ జరగనుంది. ఎన్నికల ముందు ఏపీలోని యువ...

ఎక్కువ చదివినవి

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో కొందరు ఇలాంటి పనులు చేస్తుంటారు. ప్రస్తుతం...

పోసాని బ్లాక్‌మెయిల్ చేస్తే, న్యాయస్థానం బెయిల్ ఇస్తుందా.?

నోటికొచ్చిందల్లా వాగితే, రాజకీయ ప్రత్యర్థుల ఇళ్ళల్లోని చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు తెగబడతానంటూ రెచ్చిపోతే.. వ్యవస్థలు ఊరుకుంటాయా.? ఎప్పుడూ తామే అధికారంలో వుంటాం కాబట్టి, ఎలాంటి రాక్షసత్వానికైనా తెగబడొచ్చనుకుంటే కుదురుతుందా.? కుదరదు, ఇది ప్రజాస్వామ్యం. సినీ...

అధికారుల తప్పుకు లోకేష్ క్షమాపణ!

మంత్రి నారా లోకేష్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. తనకు సంబంధం లేని విషయం అయినప్పటికీ అధికారులు చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పడంతో పాటు, జరిగిన తప్పును సరిదిద్దుతానంటూ హామీ ఇచ్చారు....

బలహీన వర్గాలకే టీడీపీ పెద్దపీట..!

ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గాను పొత్తులో భాగంగా రెండు జనసేన, బీజేపీలకు కేటాయించగా మిగిలిన 3 సీట్లకు గాను టీడీపీ తమ అభ్యర్ధులను ప్రకటించింది. టీడీపీ 3 ఎమ్మెల్సీ స్థానాలను బలహీన...

బేబమ్మ అటెన్షన్ రాబట్టేలా..!

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి సినిమాల లెక్క ఎలా ఉన్నా ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తుంది. తెలుగులో ఎంట్రీ ఇవ్వడమే ఒక సూపర్ హిట్ అందుకున్న అమ్మడు ఆ తర్వాత కెరీర్...