పంచాంగం
తేదీ 18-04-2025, శుక్రవారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5.49 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:17 గంటలకు.
తిథి: బహుళ పంచమి మ. 1.11 వరకు, తదుపరి షష్ఠి
నక్షత్రం: మూల పూర్తిగా
శుభ సమయం: ప. 10.14 నుంచి 10.44 వరకు, తిరిగి సా. 5.14 నుంచి 5.26 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.24 నుంచి 09.12 వరకు తిరిగి మ 12. 24 నుంచి 1.12 వరకు
రాహుకాలం: ఉ 10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ప 3.00 నుంచి 4.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: మిశ్రమకాలం. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. ఆప్తులతో విభేదించాల్సి వస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభ రాశి: కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. మానసిక ప్రశాంతతను పెంపొందించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పురోగతిలో నెలకొన్న ఆటంకాలు తొలగిపోతాయి.
మిథున రాశి: గతంలో ఇబ్బంది పెట్టిన సమస్యలు మళ్లీ తెర పైకి వస్తాయి. కుటుంబ సభ్యుల ఆగ్రహానికి గురవుతారు. వ్యాపారులకు మిశ్రమ కాలం. పెట్టుబడి పెట్టే ప్రయత్నాలను ప్రస్తుతానికి విరమించడం మంచిది. ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టిన పనులు శుభ ఫలితాలను ఇస్తాయి.
కర్కాటక రాశి: మిశ్రమ కాలం చేపట్టిన పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు ఎదురవుతాయి. ఆయనప్పటికీ పూర్తి చేయగలుగుతారు. మీ సహనాన్ని పరీక్షించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. సంయమనంతో ఉండండి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి.
సింహరాశి: ముఖ్యమైన పనులను వాయిదా వేయకండి. నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందుల్లో పడతారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్య మళ్ళీ తిరగబడుతుంది. ఆలోచనల్లో స్థిరత్వం అవసరం. వివాదాలకు తావివ్వకండి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి.
కన్యారాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఉదర సంబంధిత అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఆహార నియమాలు పాటించండి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపారులకు కష్టంతో కూడిన ఫలితాలు వస్తాయి.
తులారాశి: దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. పాత రుణాలు తీర్చడానికి కొత్తగా అప్పులు చేస్తారు. వ్యాపార భాగస్వామితో వివాదాలు తలెత్తుతాయి. ఆర్థిక సమస్యలు చికాకు కలిగిస్తాయి. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం ఉంటుంది. పనిపై దృష్టి పెట్టండి.
వృశ్చిక రాశి: చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. అనూహ్య ధన లాభం కలుగుతుంది. విధుల్లో భాగంగా ఉద్యోగులకు స్థానచలనం జరుగుతుంది. తమ పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు.
ధనస్సు రాశి: ఉద్యోగులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. తీవ్రంగా శ్రమించి పనిచేసినప్పటికీ అధికారుల ఆగ్రహానికి గురవుతారు. కొన్ని సమయాల్లో సొంత నిర్ణయాల వల్ల ఇబ్బందుల్లో పడతారు. ముఖ్యమైన పనుల విషయంలో పెద్దల సలహా తీసుకోండి. వ్యాపారులు పెట్టుబడి ప్రయత్నాలకు దూరంగా ఉండండి.
మకర రాశి: తోబుట్టువులతో ఏర్పడిన స్థిరాస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఖర్చులు పెరిగినప్పటికీ అందుకు తగిన ఆదాయం అందుతుంది. సమయానుకూలంగా వ్యవహరించండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు.
కుంభరాశి: అదృష్ట కాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆప్తులతో నెలకొన్న వివాదాలు తొలగిపోతాయి. ఇష్టమైన వారితో విలువైన సమయాన్ని గడుపుతారు. చేపట్టిన పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు.
మీన రాశి: మొండి బకాయిలు వసూలు అవుతాయి. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పనుల్లో ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు.