Switch to English

రాశి ఫలాలు: గురువారం 18 నవంబర్ 2021

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.6:08
సూర్యాస్తమయం : సా‌.5:21
తిథి: కార్తీక శుద్ధ‌ చతుర్దశి ఉ.11:11 నిమిషముల వరకు తదుపరి కార్తీక పౌర్ణమి
సంస్కృతవారం: బృహస్పతివాసరః (గురువారం)
నక్షత్రము: ‌భరణి రా.1:15 వరకు తదుపరి కృత్తిక
కరణం: వనీక్ ఉ.11:11 వరకు
యోగం: వరీయన్. రా.3:33వరకు తదుపరి పరిఘ
వర్జ్యం: ఉ.9:38 నుండి 11:22 వరకు
దుర్ముహూర్తం: ఉ.9:52 నుండి 10:37 తదుపరి మ.2:21 నుండి 3:08 వరకు
రాహుకాలం: మ.1:30 నుండి 3:00 వరకు
యమగండం: ఉ.6:00 నుండి 7:30 వరకు
గుళికా కాలం : ఉ.9:13 నుండి 10:37 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:50 నుండి 5:38 వరకు
అమృతఘడియలు: రా.8:07 నుండి 9:54 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:38 నుండి 12:23 వరకు

ఈరోజు (18-11-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక ఋణసమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలు అదిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కీలక వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ యోగం ఉన్నది

వృషభం: చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి సంతానానికి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. దూరప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున సమస్యలను మనోధైర్యంతో అదిగమిస్తారు.

మిధునం: ఆర్థికవ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలకు పరిష్కార మార్గాలు చూస్తారు. కొన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది.గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. గృహమున కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తాయి.

కర్కాటకం: మిత్రులతో వివాదాలను పరిష్కారమౌతాయి స్థిరాస్తి కొనుగోలు యత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహం: బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. భూ సంబంధిత వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం లభిస్తుంది.

కన్య: సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపారాలలో స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నవి. ఉద్యోగ విషయంలో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని లాభాలు పొందుతారు.

తుల: ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం లభిస్తుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

వృశ్చికం: నిరుద్యోగులకు నూతన అవకాశములు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహంగా సాగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి సోదరులతో పాత విషయాల గురించి చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలొ ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

ధనస్సు: మిత్రులతో వ్యాపార విషయమై చర్చలు చేస్తారు కుటుంబ సభ్యులు నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. దూరప్రాంతాల బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అధికారుల అనుగ్రహంతో కొన్ని పనులలో విజయం సాదిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లబ్ధి పొందుతారు.

మకరం: ఇతరులతో ఏర్పడిన వివాదాలు మిత్రుల సహాయంతో రాజీచేసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు హాజరు అవుతారు. వ్యాపార పరంగా నూతన అవకాశాలు జార విడవకుండా చూసుకోవాలి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగమున స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది.

కుంభం: వృత్తి,వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం పొందుతారు. శుభకార్యాలకు కుటుంబ సభ్యులతో హాజరావుతారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. పనుల్లో శారీరక శ్రమ తప్పదు.

మీనం: సన్నిహితుల నుండి వివాదాలకు సంభందించి కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

అంటే సుందరానికి రంగో రంగ: ఆసక్తికరమైన సాంగ్

న్యాచురల్ స్టార్ నాని పలు సీరియస్ సినిమాల తర్వాత చేస్తోన్న పూర్తిస్థాయి ఎంటర్టైనింగ్ చిత్రం అంటే సుందరానికి. జూన్ 10న ఈ చిత్రం విడుదల కానుంది....

థాంక్యూ టీజర్ విడుదల తేదీ అనౌన్స్మెంట్

అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ సినిమా థాంక్యూ. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్టెనా కానీ ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్స్...

ఎన్టీఆర్ హీరోయిన్ పై ఇంకా క్లారిటీ లేదా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సాధించిన అద్భుతమైన విజయాన్ని ఆస్వాదించి ఇప్పుడు తన తర్వాతి సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని...

బిగ్ బాస్ తెలుగు టైటిల్ గెలిచిన మొదటి మహిళ – బిందు...

బిగ్ బాస్ ఓటిటి వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ నిన్నటితో పూర్తయింది. మొత్తం ఏడుగురు ఫైనలిస్ట్ లలో చివరికి అఖిల్, బిందు మాధవి మధ్య...

వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు సినిమా షూటింగ్ డీటెయిల్స్

మెగా హీరో వరుణ్ తేజ్, గని ఇచ్చిన ప్లాప్ నుండి త్వరగానే కోలుకుని తన నెక్స్ట్ చిత్రంపై ఫోకస్ పెట్టాడు. మే 27న విడుదలవుతోన్న ఎఫ్3...

రాజకీయం

వీడిన మిస్టరీ..! సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ పాత్ర ఇదే: కాకినాడ ఎస్పీ

రాష్ట్రంలో సంచలనం రేపిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య మిస్టరీ వీడింది. కేసు వివరాలను కాకినాడ ఎస్పీ రవీంద్రనాధ్ మీడియాకు వివరించారు. ‘సుబ్రహ్మణ్యం మృతిపై అతని తల్లి ఫిర్యాదు మేరకు మొదట అనుమానాస్పద కేసు...

కోవిడ్ సంక్షోభాన్ని ధీటుగా ఎదుర్కొన్నాం మరణాల రేటూ తక్కువే: సీఎం జగన్

కోవిడ్ సంక్షోభాన్ని ఏపీ ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొందని.. ఇందుకు గ్రామ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ఎంతో దోహదపడ్డాయని సీఎం జగన్ అన్నారు. దావోస్‌ లో వైద్యారోగ్య వ్యవస్థలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఏపీకి...

అభిమాన సంఘాల నాయకుల ‘మెగా’ పంచాయితీ.!

హీరోలెప్పుడూ కలిసి మెలిసే వుంటారు. అభిమానులే అత్యుత్సాహం చూపిస్తారు.. కొట్టుకు ఛస్తారు.! ఇది తరచూ అగ్ర హీరోల సినిమాల విడుదల విషయంలో జరిగే చర్చే. చిత్రమేంటంటే మెగా కాంపౌండ్ హీరోల అభిమానుల మధ్య...

వైసీపీ సర్వే వర్సెస్ టీడీపీ సర్వే: ఇంతకీ జనసేన అసలు బలమెంత.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్వేలో, ఆ పార్టీకి 2019 ఎన్నికల తరహాలోనే బంపర్ విక్టరీ ఇంకోసారి వచ్చి పడుతుందని తేలిందట. టీడీపీ అనుకూల సర్వే ఒకటి తాజాగా బయటపడితే, అందులోనూ వైసీపీకే...

ఘనమైన గెలుపుకి మూడేళ్ళు.! ఏం లాభం జరిగింది ఏపీకి.?

ల్యాండ్ స్లైడ్ విక్టరీ.. అని రాజకీయ పరిభాషలో వాడుతుంటారు.. అదే జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో సరిగ్గా మూడేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల్లో. ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టింది. కనీ...

ఎక్కువ చదివినవి

జ్ఞానవాపి రాజకీయం.! అసలు అక్కడ ఏముంది.?

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ. జ్ఞానవాపిలో ఏముంది.? మసీదులో శివాలయం వుందా.? శివాలయాన్ని కూల్చేసి మసీదు కట్టబడిందా.? అసలేంటి కథ.? ఇటు సోషల్ మీడియాలో, అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఇంకో పక్క...

ఏపీలో ‘పవర్’ కట్.! ఇన్వర్టర్ లేదా పవన్ కళ్యాణ్.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్‌లోని తమ పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిథులతో సమావేశమయ్యారు.. మీడియా ప్రతినిథులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు. సరిగ్గా, అదే సమయంలో ‘పవర్’ పోయింది. చిత్రమేంటంటే, రాష్ట్రంలో పరిశ్రమలకు...

ఈ వారాంతం ఓటిటి ప్రియులకు పండగే!

మే 20 వీకండ్ అయినా కానీ థియేటర్లలో పెద్దగా సినిమాలు విడుదలవ్వలేదు. కానీ మరోవైపు ఓటిటిలో కంటెంట్ మాత్రం భారీగానే వచ్చి పడింది. ముందుగా బ్లాక్ బస్టర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్...

కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్సీని అరెస్టు చేయాలని టీడీపీ పట్టు

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో ఆయన మాజీ డ్రైవర్ మృతదేహం లభ్యమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈనేపధ్యంలో వాస్తవాలు తెలుసుకునేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఈరోజు కాకినాడలోని జీజీహెచ్...

రాశి ఫలాలు: గురువారం 19 మే 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు వైశాఖమాసం బహుళపక్షం సూర్యోదయం: ఉ.5:33 సూర్యాస్తమయం: సా.6:15 తిథి: వైశాఖ బహుళ చవితి రా.12:49 వరకు తదుపరి వైశాఖ బహుళ పంచమి సంస్కృతవారం: బృహస్పతి వాసరః (గురువారం) నక్షత్రము: మూల ఉ.9:30...