పంచాంగం
తేదీ 17- 09 – 2024, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:52 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:04 గంటలకు.
తిథి: శుక్ల చతుర్దశి ఉ. 11.08 వరకు, తదుపరి పూర్ణిమ
నక్షత్రం: శతభిషం ప. 2.40 వరకు, తదుపరి పూర్వభాద్ర
దుర్ముహూర్తం: ఉ 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి రా. 10.48 నుంచి 11.36 వరకు
శుభ సమయం: మ. 12.00 నుంచి 1.00 వరకు
రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ 9.00 నుంచి 10.30 వరకు.
రాశి ఫలాలు
మేష రాశి: ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో నెలకొన్న సమస్యలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మొండిగా ప్రవర్తించడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. అనవసర రుణాలు చేయవలసి వస్తుంది. ఖర్చులపై నియంత్రణ ఉండాలి. ఎవరితోనూ విభేదాలకు దిగరాదు. ప్రత్యర్థుల కదలికలను గమనిస్తూ ఉండాలి.
వృషభ రాశి: పనిభారం ఎక్కువ అవ్వడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. సమస్యల పరిష్కారంలో ఇతరుల ప్రమేయం లేకుండా చూసుకోవాలి. ఖర్చులు పెరిగినప్పటికీ రుణాలు చేయడం మానుకోవాలి. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు రావచ్చు. సహనం కోల్పోకుండా ఉండాలి.
మిథున రాశి: అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనుల్లో నెలకొన్న అడ్డంకులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. క్లిష్ట సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మొండి బకాయిలు చేతికందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. నూతన వస్తు వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.
సింహరాశి: భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనుకునే ఈ రాశి వారికి అనుకూల సమయం. అనుభవజ్ఞుల సలహా మేరకు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టవచ్చు. మొండి బకాయిలు చేతికి అందుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కుటుంబంలో ఏర్పడిన వివాదాలు చర్చల ద్వారా పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు.
కన్యారాశి: వివాదాలకు దూరంగా ఉండాలి. మొండి వైఖరి మానుకోవాలి. బాధ్యతలు పెరుగుతాయి. సమయస్ఫూర్తితో వాటిని సమర్థవంతంగా నిర్వర్తించ గలుగుతారు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదాయ పనురులపై దృష్టి పెట్టాలి. బంధుమిత్రుల తో కలిసి ఆనందంగా గడుపుతారు. పిల్లల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు.
తులారాశి: అదృష్ట కాలం. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టిన వారికి ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. ముఖ్యమైన పనుల్లో నెలకొన్న అడ్డంకులు తొలగిపోతాయి. గతంలో చేసిన పొరపాట్ల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వరాదు. ఆలోచనలను అదుపులో ఉంచుకోవాలి.
వృశ్చిక రాశి: పని భారం ఎక్కువ అవుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి వారిపై శ్రద్ధ పెట్టాలి. వ్యాపారంలో కొత్త పద్ధతులు అవలంబించడం వల్ల గణనీయమైన లాభాలు అందుతాయి. కానీ అనవసర ఖర్చుల వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కుటుంబ సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.
ధనస్సు రాశి: మిశ్రమంగా ఉంటుంది. న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకుంటారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. పూర్వీకుల ఆస్తి నుంచి లాభాలు పొందుతారు. విద్యార్థులు నూతన అవకాశాలను అందుకుంటారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రుణాలు చేయాల్సి రావచ్చు.
మకర రాశి: కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో నెలకొన్న సమస్యలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు తమ వ్యాపార భాగస్వామి ప్రవర్తన పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒప్పంద పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి.
కుంభరాశి: ఎవరితోనూ విభేదించరాదు. న్యాయపరమైన విషయాలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవి తీవ్రమవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. ముఖ్యమైన పనులను వాయిదా వేయరాదు. కుటుంబ కలహాలు పెరగకుండా చూసుకోవాలి.
మీన రాశి: సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు. వ్యాపారానికి సంబంధించి అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. వ్యాపార విస్తరణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రశాంతత పొందుతారు. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు.