పంచాంగం
తేదీ 17-02-2025, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.32 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:00 గంటలకు.
తిథి: బహుళ పంచమి రా. 2.48 వరకు తదుపరి షష్ఠి
నక్షత్రం: చిత్త తె 3.37 వరకు, తదుపరి స్వాతి
శుభ సమయం: ఉ 5.51 నుంచి 6.27 వరకు
దుర్ముహూర్తం: ప. 12.24 నుంచి 1.12 వరకు తిరిగి ప. 2.46 నుంచి 3.36 వరకు
రాహుకాలం: ఉ 7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ప. 10.30 నుంచి 12.00 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: అనుకూల సమయం. చేపట్టిన పనుల్లో సత్ఫలితాలను పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. చక్కటి ఆలోచన విధానంతో అందర్నీ మెప్పిస్తారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. కొన్ని వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.
వృషభ రాశి: ఆప్తుల నుంచి అందిన ఒక వార్త ఆందోళన కలిగిస్తుంది. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. వివాదాల జోలికి వెళ్ళకండి.తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఖర్చులపై నియంత్రణ అవసరం. దూర ప్రయాణాలు వాయిదా వేయండి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
మిథున రాశి: వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే ఆలోచనను అమల్లో పెట్టొచ్చు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఇంటి సభ్యుల మధ్య నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి.
కర్కాటక రాశి: అదృష్ట కాలం నడుస్తోంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. భవిష్యత్తుకు సంబంధించి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూల సమయం. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోండి. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. మొండి బకాయిలు వసూలు అవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
సింహరాశి: మిశ్రమ కాలం. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. ముఖ్యమైన పనుల్లో నిర్లక్ష్యం పనికిరాదు. ఏకపక్ష నిర్ణయాల వల్ల ఇబ్బందుల్లో పడాల్సి రావచ్చు. ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. అనారోగ్య సమస్య ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి.
కన్యా రాశి: కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి.
తులారాశి: మనశ్శాంతిని దూరం చేసి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆప్తుల నుంచి అందిన ఒక వార్త కలవర పెడుతుంది. వ్యాపారులకు ఒడిదొడుకులతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. ప్రత్యర్ధులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోకండి.
వృశ్చిక రాశి: అనుకూల సమయం. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. పని ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులకు అనూహ్యమైన లాభాలు అందుతాయి. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు.
ధనస్సు రాశి: ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రుల రాక ఆనందాన్నిస్తుంది. ఆప్తుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం.
మకర రాశి: ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే ఆలోచనను వ్యాపారులు వాయిదా వేయటం మంచిది. ఆర్థిక లావాదేవీల పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రమాదం జరిగి అవకాశం ఉన్నందున ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం వల్ల న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
కుంభరాశి: చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆప్తులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఖర్చులపై నియంత్రణ అవసరం.
మీన రాశి: అదృష్ట కాలం. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. కీర్తి ప్రతిష్టలను పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు ఒత్తిడి నుంచి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి.