పంచాంగం
తేదీ 17-04-2025, గురువారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5.49 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:17 గంటలకు.
తిథి: బహుళ చవితి మ 12.00 వరకు, తదుపరి పంచమి
నక్షత్రం: జ్యేష్ట తె 5.07 వరకు, తదుపరి మూల
శుభ సమయం: సా. 6.14 నుంచి 7.02 వరకు
దుర్ముహూర్తం: ఉ. 10.00 నుంచి 10.48 వరకు తిరిగి మ 2. 48 నుంచి 3.12 వరకు
రాహుకాలం: మ 1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ప 6.00 నుంచి 7.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: మిశ్రమ కాలం. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. ముఖ్యమైన పనుల కోసం ఇతరులపై ఆధారపడకండి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఇతరుల జోక్యం వల్ల నష్టాలు ఎదురవుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలక సమయాల్లో తోబుట్టువుల నుంచి సాయం అందుతుంది.
వృషభ రాశి: కుటుంబంలోని కొందరి ప్రవర్తన వల్ల చికాకు కలుగుతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆప్తుల నుంచి అందిన వార్తల వల్ల కలత చెందుతారు. మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో అకారణ విభేదాలు కలుగుతాయి. కోపాన్ని తగ్గించుకుని ఇతరులతో సంభాషించండి.
మిధున రాశి: వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి కావలసిన ఆర్థిక సాయం అందుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఇష్టమైన వారితో విలువైన సమయాన్ని గడుపుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. అదనపు బాధ్యతలు పెరిగినప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తించ గలుగుతారు.
కర్కాటక రాశి: స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు ఉద్యోగులకు పని ప్రదేశంలో ఆహ్లాద తర్వాత ఉంటుంది. విధుల్లో భాగంగా స్థానచలనం జరుగుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
సింహరాశి: ముఖ్యమైన పనుల్లో నిర్లక్ష్యం పనికిరాదు. మీది కాని వ్యవహారంలో తలదూర్చకండి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ పెద్దలతో కొన్ని సందర్భాల్లో విభేదిస్తారు. ఖర్చులను నియంత్రణలో ఉంచుకోండి.
కన్యారాశి: చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టండి. ఉదర సంబంధిత అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది నిర్లక్ష్యం చేయకండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. రుణాలను పెద్ద మొత్తంలో తీర్చగలుగుతారు. తీవ్రంగా శ్రమించినప్పటికీ వ్యాపారులకు నష్టాలే మిగులుతాయి.
తులారాశి: కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. భవిష్యత్తుకు ఉపయోగపడే గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో చిరకాల కోరికను నెరవేర్చుకుంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనూహ్య ధన లాభం కలుగుతుంది. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలకు ప్రణాళికలు వేస్తారు.
వృశ్చిక రాశి: శత్రువులు మిత్రులవుతారు. కుటుంబ సభ్యుల్లో సఖ్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట పై చేయి సాధిస్తారు. అవివాహితులకు వివాహం నిశ్చయం అవుతుంది.
ధనస్సు రాశి: కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను, దూర ప్రయాణాలను వాయిదా వేయటం మంచిది. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రియ మిత్రుల్లో ఒకరిని కోల్పోవాల్సి రావచ్చు.
మకర రాశి: బంధుమిత్రుల నుంచి అందిన ఒక వార్త కలవర పెడుతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది ఫలితంగా ఇబ్బందుల్లో పడతారు. ఉద్యోగులకు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఉన్నతాధికారుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. మానసిక ప్రశాంతతను దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి.
కుంభరాశి: కుటుంబ సభ్యుల సహకారంతో చిరకాల కోరికను నెరవేర్చుకుంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అవసరానికి ఇంటి పెద్దల నుంచి సాయం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముందు బకాయిలు వసూలు అవుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు.
మీన రాశి: కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. బంధుమిత్రుల నుంచి అందిన ఒక వార్త కలవర పెడుతుంది. ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. తోబుట్టులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. ఆప్తులతో విభేదించాల్సి వస్తుంది. వ్యాపారులకు ఊహించని నష్టాలు కలుగుతాయి. ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టండి.