పంచాంగం
శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం శుక్లపక్షం
సూర్యోదయం: ఉ 6:11
సూర్యాస్తమయం : సా.6:06
తిథి: ఫాల్గుణ శుద్ధ చతుర్దశి మ.1:16: వరకు తదుపరి ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి
సంస్కృతవారం: బృహస్పతివాసరః (గురువారం)
నక్షత్రము : పుబ్బ రా.12:50 వరకు తదుపరి ఉత్తర
యోగం: శూల రా.1:33 వరకు తదుపరి గండ
కరణం:వనిజ మ.1:16 వరకు తదుపరి విష్టి
వర్జ్యం:ఉ.8:19 నుండి 9:58 వరకు
దుర్ముహూర్తం:ఉ.10:09 నుండి 10:57 వరకు తదుపరి మ.2:55 నుండి 3:43 వరకు
రాహుకాలం:మ.1:30 నుండి 3:00 వరకు
యమగండం: ఉ.6:00 నుండి 7:30 వరకు
గుళికా కాలం: ఉ.9:25 నుండి 10:55 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:50 నుండి ఉ.5:38 వరకు
అమృతఘడియలు:రా.6:14 నుండి 7:53 వరకు
అభిజిత్ ముహూర్తం: మ. .12:00 నుండి 12:48 వరకు
ఈరోజు. (17-03-2022) రాశి ఫలితాలు
మేషం: ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు పనిచేయవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి సంతాన విషయంలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పవు.
వృషభం: ఆర్ధిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయం లభించదు. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
మిథునం: విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటాబయట కీలక నిర్ణయాలను అమలు పరుస్తారు. ఆదాయ మార్గాలు విస్తృతమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారపరంగా స్థిరమైన లాభాలు అందుకుంటారు. దీర్ఘ కాలిక ఋణాల నుండి ఊరట పొందుతారు
కర్కాటకం: ఆర్థికంగా ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. అకారణంగా ఇతరులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.
సింహం: గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి. కుటుంబ సభ్యులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయం పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది.
కన్య: వృధా ఖర్చుల విషయంలో ఆలోచించి ముందుకు ముందుకు సాగాలి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సమయానికి నిద్రాహారాలు ఉండవు. వ్యాపార పరంగా స్వల్ప ధన నష్ట సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురి కావల్సివస్తుంది.
తుల: నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గృహ నిర్మాణ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటాబయట గౌరవమర్యాదలు పెరుగుతాయి. అవసరానికి ఆప్తుల నుండి ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది.
వృశ్చికం: ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలలో కుటుంబ పెద్దల ఆలోచనలు కలసివస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి.
ధనస్సు: ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల మాటలు కొంత మానసికంగా కలచివేస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. మానసిక ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.
మకరం: వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారపరంగా ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చేయని పనికి నిందలు పడవలసి వస్తుంది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.
కుంభం: కీలక సమయంలో జీవితభాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. నూతన గృహ వాహనయోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుండి తెలివిగా బయటపడతారు.
మీనం: చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది భాగస్వామ్య వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఆనందం కలిగిస్తుంది. స్ధిరాస్తి క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు
783727 463325I take fantastic pleasure in reading articles with quality content. This post is 1 such writing that I can appreciate. Keep up the great function. 607230
839071 935092As I internet site owner I conceive the content material material here is rattling exceptional , thanks for your efforts. 949124
593928 822271You produced some decent points there. I looked online to the issue and discovered most people is going in addition to making use of your internet site. 420857