పంచాంగం:
తేదీ 16-10-2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం, శరత్ ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:57 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:41 గంటలకు.
తిథి: శుక్ల చతుర్దశి రా. 7.52 వరకు, తదుపరి పూర్ణిమ
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా. 7.29 వరకు, తదుపరి రేవతి
దుర్ముహూర్తం: ఉ. 11.36 నుంచి 12.24 వరకు
శుభ సమయం: సా. 4.00 నుంచి 5.00 వరకు
రాహుకాలం: మ.12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు.
రాశి ఫలాలు
మేషరాశి: మిశ్రమ కాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. కీలక సమయాల్లో ఇంటి పెద్దల మద్దతు లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి కలతలు ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాల్సిన సమయం. ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకపోవడం మంచిది.
వృషభ రాశి: అదృష్ట కాలం. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య నుంచి బయటపడతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. వస్త్ర వ్యాపారం చేసే వారికి విశేషమైన లాభాలు అందుతాయి.
మిథున రాశి: చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సత్ప్రవర్తనతో ఇతరుల మనసు గెలుచుకుంటారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి: మిశ్రమ కాలం. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు. వారి మాటలకు ప్రభావితం కాకుండా ఉండాలి. మొహమాటానికి పోయి ఖర్చులు పెంచుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.
సింహరాశి: చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. పిల్లల ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. సంతానలేమితో బాధపడుతున్న వారు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామితో స్వల్పంగా విభేదించాల్సి రావచ్చు.
కన్యా రాశి: ప్రత్యర్థుల కదలికలను గమనిస్తూ ఉండాలి వారు ఇబ్బంది పెట్టాలని చూడొచ్చు. పనిభారం ఎక్కువవుతుంది అయినప్పటికీ ఒత్తిడి తీసుకోరాదు. అనవసరమైన ఆలోచనలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. చుట్టూ ఆహ్లాదకర వాతావరణ ఉండేలా చూసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ఉండాల్సిన సమయం.
తులారాశి: శారీరక శ్రమ పెరుగుతుంది. పై అధికారులు మీ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉంటారు. ఉద్యోగులకు స్థాన చలన సూచనలు ఉన్నాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా రుణాలు చేయవలసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు ఎదురవడం వల్ల సమస్యలు ఏర్పడతాయి. సహనంతో వ్యవహరించాలి.
వృశ్చిక రాశి: మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చంచల మనస్తత్వం ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. తోటి వారి సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు బుద్ధిబలంతో వ్యవహరించాలి. వ్యాపారులు ప్రణాళిక బద్ధంగా లాభాలను అందుకుంటారు. అనవసర ఖర్చులు ఉన్నప్పటికీ రుణాలు చేయరాదు.
ధనస్సు రాశి: ముందు చూపుతో వ్యవహరించి ప్రశంసలు పొందుతారు. బాధ్యతలు ఎక్కువవుతాయి. అయినప్పటికీ చాకచక్యంగా వాటిని నిర్వర్తించగలుగుతారు. బంధుమిత్రుల నుంచి అందిన ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు. పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి.
మకర రాశి: ఆత్మవిశ్వాసంతో చేసే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు. బుద్ధి బలంతో వ్యవహరించి సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. వ్యాపారులకు విశేషమైన లాభాలు అందుతాయి.
కుంభరాశి: ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అందరినీ కలుపుకొని పనిచేయడం వల్ల శుభ ఫలితాలు అందుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఉద్యోగులు పై అధికారుల పట్ల వినయంగా ఉండాల్సిన సమయం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ స్వల్ప లాభాలను అందుకుంటారు.
మీన రాశి: మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రుల సాయంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనూ విభేదించరాదు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వ్యాపారులకు స్వల్ప నష్టాలు ఏర్పడవచ్చు.