పంచాంగం
తేదీ 16-03-2025, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు.
తిథి: బహుళ విదియ మ. 2.51 వరకు, తదుపరి తదియ
నక్షత్రం: హస్త ఉ 10.05 వరకు తదుపరి చిత్త
శుభ సమయం: ఉ 8.08 నుంచి 8.44 వరకు, తిరిగి 2.32 నుంచి 2.42 వరకు.
దుర్ముహూర్తం: సా. 4.25 నుంచి 5.13 వరకు
రాహుకాలం: సా 4.30 నుంచి 6.00 వరకు
యమగండం: మ. 12.00 నుంచి 1.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. అవసరానికి తోబుట్టువుల నుంచి సాయం అందుతుంది. భవిష్యత్తుపై దృష్టి పెడతారు. మొండి బకాయిలు వసూలు అవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్యను పెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటారు.
వృషభ రాశి: మీ మాటకు విలువ పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయటా పై చేయి సాధిస్తారు. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. జీవిత భాగస్వామి సలహా పాటించండి. అంతా మంచే జరుగుతుంది. పిల్లల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు.
మిథున రాశి: మిశ్రమకాలం. కొన్ని వ్యవహారాల్లో ఆప్తులతో విభేదించాల్సి రావచ్చు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు. ఇష్టమైన వారిని కలుసుకొని భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి.
కర్కాటక రాశి: చెప్పుడు మాటలకు దూరంగా ఉండండి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.
సింహరాశి: మిశ్రమ కాలం. శారీరక శ్రమ పెరుగుతుంది. పని భారం ఎక్కువవుతుంది. ఒత్తిడికి లోనవుతారు. రుణదాతల ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆర్థిక నష్టాలను చవి చూడాల్సి రావచ్చు. వ్యాపారులు తీవ్రంగా శ్రమించినప్పటికీ నష్టాలే ఎదురవుతాయి. ఉద్యోగులు పై అధికారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
కన్య రాశి: శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యమైన పనులు మొదలుపెట్టేముందు కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. సొంత నిర్ణయాలు సమస్యలను తెచ్చిపెడతాయి. కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం ఉత్తమం. మంచి చేయాలనుకున్నా చెడు ఎదురవుతుంది. చేయని తప్పుకు నిందలు పడాల్సి రావచ్చు.
తులారాశి: శుభకాలం. సత్ప్రవర్తనతో ఇతరుల మనసు గెలుచుకుంటారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి అధికారుల ప్రశంసలు పొందుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అందుతాయి. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పై దృష్టి పెట్టాలి.
వృశ్చిక రాశి: మిశ్రమకాలం. ప్రారంభించే పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్లక్ష్యం పనికిరాదు. ఒక వ్యవహారంలో డబ్బు చేతికందుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి.
ధనస్సు రాశి: శుభకాలం. ఇష్టమైన వారితో విలువైన సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. మొండి బకాయిలు వసూలు అవుతాయి. వ్యాపారులకు విశేషమైన లాభాలు అందుతాయి. చంచలమైన మనస్తత్వం ఇబ్బందులను తెచ్చిపెడుతుంది.
మకర రాశి: భవిష్యత్తుకు ఉపయోగపడే గొప్ప వ్యక్తులు పరిచయమవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. తోబుట్టువుల మద్దతుతో అనుకున్నది సాధిస్తారు.
కుంభరాశి: అనుకూల సమయం. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగులు తమ పనితీరుతో అధికారుల మన్ననలు పొందుతారు. బుద్ధి బలంతో వ్యవహరించి ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆర్థికంగా బలపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. ఉద్యోగంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు.
మీనరాశి: మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి, రుణాలు చేయాల్సి రావచ్చు. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. నమ్మిన వారే మోసం చేసే ప్రమాదం ఉంది. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అవసరానికి ఇంటి పెద్దల నుంచి సాయం అందుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు.