Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 16 మార్చి 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,156FansLike
57,297FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం

సూర్యోదయం: ఉ.6:12
సూర్యాస్తమయం: రా.6:04 ని
తిథి: బహుళ నవమి మ.1:14 వరకు తదుపరి దశమి
సంస్కృతవారం: బృహస్పతి వాసరః (గురువారం )
నక్షత్రము: పూర్వాషాఢ రా.1:52 వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: వ్యతీపాత ఉ.7:22 వరకు తదుపరి వరీయాన్ తె.4:25 వరకు తదుపరి పరిఘ
కరణం:గరజి మ.1:14 ని. వరకు తదుపరి భద్ర
దుర్ముహూర్తం: ఉ.10:09 నుండి 10:57 వరకు తదుపరి మ.2:54 నుండి 3:42 వరకు
వర్జ్యం : మ.12:21 నుండి మ.1:51 వరకు
రాహుకాలం: మ.1:30 నుండి 3:00 వరకు
యమగండం: ఉ.6:00 నుండి 7:30 వరకు
గుళికా కాలం : ఉ.9:26 ని.నుండి 10:55 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:51 నుండి 5:39 వరకు
అమృతఘడియలు:రా.9:21 నుండి 10:50 ని వరకు
అభిజిత్ ముహూర్తం : మ.12:01 నుండి 12:48 వరకు

ఈరోజు (16-03-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులకు చేయవలసి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి.

వృషభం: దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. ఇంటా బయట కొందరి ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

మిథునం: బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్త్రీ సంబంధ వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు అధికారులతో చిన్నపాటి వివాదాలు కలగుతాయి.

కర్కాటకం: కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ పడతారు. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

సింహం: వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ముఖ్యమైన పనులలో తొందరపాటు మంచిది కాదు. నిరుద్యోగులకు కొంత అనుకూలత వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య: దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇంటా బయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరులకు ధనపరంగా మాట ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

తుల: వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలు ప్రారంభించక పోవడం మంచిది. జీవిత భాగస్వామితో అకారణంగా మాటపట్టింపులు ఉంటాయి. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది.

వృశ్చికం: నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకుంలించవు. వృధా ఖర్చులు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

ధనస్సు: వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

మకరం: నూతన ఋణ ప్రయత్నాలు చెయ్యకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధన పరంగా ఒడిదుడుకులు అదికమౌతాయి. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి కొంత పెరుగుతుంది.

కుంభం: ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం పొందుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు. ఉద్యోగమున ఆశించిన మార్పులు ఉంటాయి.

మీనం: ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది.వ్యాపారాల్లో నూతన విధానాలు అమలుచేస్తారు. ఆర్ధిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. దూర ప్రయాణాలలో తొందరపాటు మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sreeleela: ‘ఆ స్టార్ హీరోకు నేను వీరాభిమానిని..’ ఇష్టాఇష్టాలు వెల్లడించిన శ్రీలీల

Sreeleela: తాను హీరో బాలకృష్ణ (Bala Krishna) కు వీరాభిమానిని అని టాలీవుడ్ (Tollywood) లేటెస్ట్ సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) అంటోంది. ఓ ఇంటర్వ్యూలో...

Devil: బ్రిటిష్ స్పై గా కళ్యాణ్ రామ్

Devil: నందమూరి కళ్యాణ్ రామ్( Kalyan Ram) మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాకి 'డెవిల్( Devil)' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 'బ్రిటిష్...

Mrunal Thakur: మృనాల్ కు ఏమైంది? కన్నీళ్ళతో ఉన్న ఫోటోను షేర్...

Mrunal Thakur: గతేడాది విడుదలైన సీతారామం(Seetaramam) సినిమాతో హిట్ అందుకుంది మృనాల్ ఠాకూర్( Mrunal Thakur). సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ...

Arya Parvathi: నా వయసు 23.. నాకిప్పుడు చెల్లి పుట్టిందోచ్!

Arya Parvathi: బాలీవుడ్ లో 2018 లో వచ్చిన 'బదాయి హో' చిత్రం గుర్తుందా!.. పెళ్లికి ఎదిగొచ్చిన కొడుకు తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే...

Krishnavamsi: ‘నాలుగేళ్ల కష్టానికి ఫలితమిది’

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ( Krishnavamsi) దర్శకత్వం వహించిన 'రంగమార్తాండ' ( Rangamarthanda) నేడు ప్రేక్షకుల ముందుకొచ్చి అలరిస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా...

రాజకీయం

YSRCP: వైసీపీ కొంప ముంచిన ‘సలహా’.!

YSRCP: మొదటి నుంచీ అందరూ మొత్తుకుంటున్నదే. గతంలోనూ సలహాదారులున్నా, అత్యంత దారుణంగా, అత్యంత అభ్యంతరకరంగా మారింది వైసీపీ హయాంలో ‘సలహాదారుల’ వ్యవస్థ.! ఎడా పెడా సలహాదారుల్ని వైసీపీ సర్కారు నియమిస్తూ వెళుతోంది. ఎలక్ట్రానిక్...

YS Jagan: ముచ్చటగా ‘మూడు’.! వైఎస్ జగన్‌కి ‘దేవుడి’ ఝలక్.!

YS Jagan: మాటకు ముందొకసారి.. తర్వాత ఇంకోసారి.. ‘దేవుడి దయతో..’ అంటుంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ‘దేవుడి స్క్రిప్ట్’ అనే మాట కూడా...

YS Jagan: మేనమామగా.! జగన్ ‘సొంత సొమ్ము’ ఖర్చు చేస్తున్నారా.?

YS Jagan: చంద్రన్న కానుక.. ఎవడబ్బ సొమ్ము.? అన్నారు అప్పట్లో వైసీపీ నేతలు. మరిప్పుడు, జగనన్న గోరు ముద్ద.. ఎవడబ్బ సొమ్ము.? అన్న ప్రశ్న తెరపైకొస్తుంది కదా.! పైగా, ఇప్పుడు ‘మేనమామ’ అట.! ‘మేనమామగా..’...

RK Roja: ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పేసిన రోజా మేడం

RK Roja: ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆ పార్టీ నాయకులు విజయోత్సవంలో మునిగి ఉన్నారు. ఇదే ట్రెండ్ వచ్చే ఏడాది జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో...

హవ్వా.! అసెంబ్లీలో ఎమ్మెల్యేకి నిద్దరొస్తే నేరమా.?

ఆ పెద్దాయనకి నిద్దరొచ్చింది.! రోజులో ఇరవై నాలుగ్గంటలూ ప్రజా సేవ చేసేసే ఆయనగారికి, అసెంబ్లీ సమావేశాల సమయంలో నిద్దరొస్తే తప్పేంటి.? ఆయన్ని 2019 ఎన్నికల సమయంలో జెయింట్ కిల్లర్‌గా అభివర్ణించారు కాబట్టే, ఇంత...

ఎక్కువ చదివినవి

Prabhudeva: నాటు-నాటుకు ప్రభుదేవా స్టెప్పులు.. RC15లో సందడి

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RC15 షూటింగ్ లో అడుగు పెట్టారు. అమెరికా నుంచి నేరుగా ఢిల్లీ వచ్చి ఇండియా టుడే కాంక్లేవ్ లో పాల్గొని హైదరాబాద్ వచ్చారు. మరునాడే సినిమా...

Nani: ‘మరోలా చెప్పాల్సింది అలా చెప్పారు’ వెంకటేశ్ మహా వ్యాఖ్యలపై నాని..

Nani: ఇటివల ఓ చర్చా కార్యక్రమంలో దర్శకుడు వెంకటేశ్ మహా కేజీఎఫ్ ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ పై హీరో నాని స్పందించారు. ఆ కార్యక్రమాన్ని తాను చూశానని వెంకటేశ్ మహా అలా...

RC15: రామ్ చరణ్, శంకర్ సినిమాకి అదిరిపోయే టైటిల్ సెట్ అయిందిగా

RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి అదిరిపోయే టైటిల్ సెట్ అయినట్లు సమాచారం. మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్ ప్రకటన...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 18 మార్చి 2023

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం సూర్యోదయం: ఉ.6:10 సూర్యాస్తమయం: రా.6:04 ని తిథి: బహుళ ఏకాదశి ఉ.8:34 వరకు తదుపరి ద్వాదశి సంస్కృతవారం:స్థిరవాసరః (శనివారం ) నక్షత్రము: శ్రవణం రా.10:32 వరకు తదుపరి...

YS Jagan: ముచ్చటగా ‘మూడు’.! వైఎస్ జగన్‌కి ‘దేవుడి’ ఝలక్.!

YS Jagan: మాటకు ముందొకసారి.. తర్వాత ఇంకోసారి.. ‘దేవుడి దయతో..’ అంటుంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ‘దేవుడి స్క్రిప్ట్’ అనే మాట కూడా...