పంచాంగం
తేదీ 16- 07- 2024, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆషాఢ మాసం, గ్రీష్మ రుతువు.
సూర్యోదయం: ఉదయం 5:38 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:38 గంటలకు.
తిథి: శుక్ల దశమి సా. 4.54 వరకు, తదుపరి ఏకాదశి.
నక్షత్రం: విశాఖ రా.12.03 వరకు, తదుపరి అనురాధ
దుర్ముహూర్తం: ఉ 8.24 నుంచి 9.12 వరకు,తిరిగి రా.10.48 నుంచి 11.36 వరకు.
శుభ సమయం: మ. 12.00 నుంచి 1.00 వరకు
రాహుకాలం: ప. 3.00 నుంచి 4.30 వరకు.
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: కష్టకాలం. ఎలాంటి వివాదాల్లోనూ తల దూర్చరాదు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు పెట్టుబడుల కోసం అనుభజ్ఞుల సలహా తీసుకోవాలి. వ్యాపార భాగస్వామి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. రుణ దాతల నుంచి ఒత్తిడి ఎక్కువవుతుంది.
వృషభ రాశి: న్యాయపరమైన కేసుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఒడిదొడుకులు ఉంటాయి. అయినప్పటికీ వ్యాపారులు మెరుగైన లాభాలను అందుకుంటారు. పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండండి.
మిథున రాశి: మొండి బకాయిలు వసూలు అవుతాయి. అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లి అనారోగ్యం కాస్త ఆందోళన కలిగిస్తుంది. చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి: ఆత్మ విశ్వాసం తో పని చేసి విజయం సాధిస్తారు. బ్యాంకుల నుంచి రుణాలు అందుతాయి. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. గిట్టని వారు ఇబ్బంది పెడతారు.
సింహరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారం కోసం రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సులభంగా అందుతాయి. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. పనుల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కన్యా రాశి: వ్యాపారులు తీవ్రంగా శ్రమించినప్పటికీ నష్టాలను చవి చూస్తారు. వ్యాపార భాగస్వాములు మోసం చేసే ప్రమాదం ఉంది. పూర్వీకుల ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రవర్తన వల్ల సహోద్యోగులు కలత చెందుతారు.
తులా రాశి: ఉత్సాహవంతంగా పని చేస్తారు. పెద్దల సహకారంతో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
వృశ్చిక రాశి: ఆటంకాలు ఎదురైనా సమయస్ఫూర్తి తో వాటిని ఎదుర్కుంటారు. అవసరానికి డబ్బు చేతికందుతుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి: ఆత్మ విశ్వాసం తో పని చేస్తారు. పై అధికారుల మెప్పు పొందుతారు. కీలక సమయాల్లో ఇతరుల సలహాలు పాటించడం మంచిది. పెద్దల సహకారం ఉంటుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.
మకర రాశి: అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. న్యాయ పరమైన చిక్కుల్లో పడతారు. ఆత్మ విశ్వసాన్ని కోల్పోరాదు. మృదు సంభాషణ మంచిది. జీవిత భాగస్వామి తో స్వల్ప విభేదం ఏర్పడవచ్చు. వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు.
కుంభ రాశి: అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగులు స్వల్ప నిరుత్సాహానికి గురవుతారు. అవివాహితులకు తమకు నచ్చిన వ్యక్తితో వివాహం నిశ్చయం అవుతుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉద్యోగాన్ని పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి.
మీనరాశి: అనుకూల సమయం.కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న మనస్పర్ధలు పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రత్యర్థులు మీ పనిలో అడ్డంకులు సృష్టిస్తారు. వాటిని ఆత్మ విశ్వాసం తో ఎదుర్కోవాలి. పిల్లలు మీ ప్రవర్తన వల్ల నోచ్చుకునే ప్రమాదం ఉంది.