పంచాంగం
తేదీ 16-01-2025, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, పుష్యమాసం, హేమంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.38 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:45 గంటలకు.
తిథి: బహుళ తదియ తె. 4.25 వరకు, తదుపరి చవితి
నక్షత్రం: ఆశ్లేష మ. 12.02 వరకు తదుపరి విశాఖ
శుభ సమయం: ఏమీలేవు
దుర్ముహూర్తం: ఉ11.36 నుంచి 12.24 వరకు
రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ 6.00 నుంచి 7.30 వరకు
రాశి ఫలాలు
మేషరాశి : మిశ్రమ కాలం. అనవసర ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఉద్యోగులు ఉన్నతాధికారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పని ప్రదేశంలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవుతాయి.
వృషభ రాశి: మిశ్రమకాలం. ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. బుద్ధిబలంతో వాటిని ఎదుర్కోవాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మనసు చెడు ఆలోచనలవైపు మల్లుతుంది. బంధువుల నుంచి అందిన ఒక వార్త బాధ కలిగిస్తుంది. అవసరానికి తోబుట్టువుల నుంచి సాయం అందుతుంది.
మిథున రాశి: కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. సంతానోత్పత్తికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయమవుతుంది. ఇష్టమైన వారితో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు.
కర్కాటక రాశి: చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు రాబట్టడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సమయం వృధా చేయకండి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.
సింహరాశి: మిశ్రమకాలం. ఇతరులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది ఎవరితోనో వాగ్వాదానికి దిగకండి అనవసర ఖర్చుల ను నియంత్రించుకోవాలి. మనసు చెడు ఆలోచనల వైపుకు మల్లుతుంది. వ్యాపారులకు శ్రమతో కూడిన లాభాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.
కన్యా రాశి: కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక ముఖ్యమైన వ్యక్తితో ఈరోజు పరిచయం అవుతుంది. స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు.
తులారాశి: మానసిక ప్రశాంతతను పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం అవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.
వృశ్చిక రాశి: పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి. న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. కుటుంబంలో నెలకొన్న మనస్పర్ధలు తగ్గుముఖం పెడతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇష్టమైన వారితో విలువైన సమయాన్ని గడుపుతారు.
ధనస్సు రాశి: బంధుమిత్రుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఉద్యోగులకు కోరుకున్నచోటకు స్థానచలనం లభిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా వ్యాపారులు విశేషమైన లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకుంటారు.
మకర రాశి: సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. నీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలితాలను ఇస్తాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.
కుంభరాశి: కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. కీలకమైన వ్యవహారాల్లో ఇంటి పెద్దల మద్దతు లభిస్తుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. మొండి బకాయిలు వసూలు అవుతాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులకు అనుకూల సమయం సంతానోత్పత్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.
మీన రాశి : కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయమవుతుంది. ఇష్టమైన వారితో విలువైన సమయాన్ని గడుపుతారు. స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు.