పంచాంగం
తేదీ 16-02-2025, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.32 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:00 గంటలకు.
తిథి: చవితి రా. 12.33 వరకు తదుపరి పంచమి
నక్షత్రం: హస్త రా. 2.59 వరకు తదుపరి చిత్త
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: సా 4.25 నుంచి 5.13 వరకు
రాహుకాలం: ప. 4.30 నుంచి 6.00 వరకు
యమగండం: మ. 12.00 నుంచి 1.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: అదృష్ట కాలం. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. రుణాల బాధలు తీరిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.
వృషభ రాశి: మిశ్రమకాలం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సహనంతో వ్యవహరించండి. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం మంచిది. చేయనితప్పుకు మాట పడాల్సి రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. భవిష్యత్తుకు సంబంధించి తెలివైన నిర్ణయాలు తీసుకోండి. విభేదాలకు దూరంగా ఉండండి. మీ మంచితనం మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళుతుంది.
మిథున రాశి: కుటుంబ సభ్యులతో విభేదించాల్సి రావచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. విలువైన వస్తువుల కొనుగోలును వాయిదా వేయండి. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నమ్మినవారే మోసం చేసే ప్రమాదం ఉంది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.
కర్కాటక రాశి: అదృష్ట కాలం నడుస్తోంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఒక ముఖ్యమైన పని ఈరోజు పూర్తవుతుంది. పెద్దల ఆశీర్వాదంతో చిరకాల కోరికను నెరవేర్చుకుంటారు.
సింహరాశి: ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. కొంతమంది తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండండి. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలను మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా మీరే పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. రుణాలు జోలికి పోవద్దు. దూర ప్రయాణాలు వాయిదా వేయండి.
కన్యా రాశి: భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. ఒక వ్యవహారంలో అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. సంతాన అభివృద్ధి విషయంలో శుభవార్తలు వింటారు.
తులారాశి: ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. రెట్టించిన ఉత్సాహంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. పని ప్రదేశంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వారికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అందుతాయి.
వృశ్చిక రాశి: భవిష్యత్తుకు సంబంధించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. గత కొంతకాలంగా ఏర్పడిన గందరగోళ పరిస్థితి నుంచి బయటపడతారు. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. గొప్ప వారితో పరిచయం భవిష్యత్తుకు మేలు చేకూరుస్తుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. మొండి బకాయిలు వసూలు అవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ధనస్సు రాశి: అదృష్ట కాలం చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధుమిత్రుల సాయంతో చిరకాల కోరికను నెరవేర్చుకుంటారు. సొంతింటి కల నెరవేరేందుకు తొలి అడుగు పడుతుంది.
మకర రాశి: మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా విశేషమైన లాభాలు అందుతాయి. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
కుంభరాశి: మిశ్రమకాలం. చేపట్టిన పనిలో కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆప్తుల నుంచి అందిన ఒక వార్త కలవర పెడుతుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. విలువైన వస్తువులను సేకరిస్తారు. ఎవరితోనూ ఇభేదాలు పెట్టుకోకండి.
మీన రాశి: కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. అదనపు బాధ్యతలు పెరిగినప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తించ గలుగుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి.