Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 16 ఏప్రిల్ 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,946FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 16-04-2025, బుధవారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు.

సూర్యోదయం: ఉదయం 5.49 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:17 గంటలకు.
తిథి: బహుళ తదియ ఉ 10.24 వరకు, తదుపరి చవితి
నక్షత్రం: అనురాధ తె 3.07 వరకు, తదుపరి జ్యేష్ట
శుభ సమయం: ఉ 9.48 నుంచి 10.12 వరకు, తిరిగి సా. 7.12 నుంచి 7.42 వరకు
దుర్ముహూర్తం: ఉ. 11.36 నుంచి 12.24 వరకు
రాహుకాలం: మ 12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ప 7.30 నుంచి 9.00 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: తోబుట్టువు లతో కలిసి ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తుతాయి. మీ ప్రమేయం లేనప్పటికీ నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ వెనకడుగు వేయకండి. ఖర్చులు పెరుగుతాయి. అందుకు తగిన ఆదాయం కూడా అందుతుంది. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

వృషభ రాశి: బంధుమిత్రులతో అకారణ వైరం కలుగుతుంది. తీవ్రం కాకుండా చూసుకోండి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ప్రవర్తన వల్ల కలత చెందుతారు. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. రుణదాతల ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి

మిధున రాశి: చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని పూర్తి చేయగలుగుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామితో ఏర్పడిన మనస్పర్ధలను తొలగించుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యుల్లో కొందరు ప్రవర్తన వల్ల కలత చెందుతారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది.

కర్కాటక రాశి: స్థిరాస్తి సంబంధించిన ఒప్పందాలు పూర్తవుతాయి. వ్యాపారులకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ప్రయత్నాలను మొదలుపెట్టొచ్చు. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. కుటుంబ సభ్యులుగా కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి.

సింహరాశి: మీ కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమ ఎక్కువ అయినప్పటికీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొందరి ప్రవర్తన వల్ల కలత చెందుతారు. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండండి.

కన్యారాశి: భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో భవిష్యత్తుకు సంబంధించి చర్చలు జరుపుతారు. ఉద్యోగులకు పని ప్రదేశంలో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.

తులారాశి: గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. జీవిత భాగస్వామితో తలెత్తిన మనస్పర్ధలు తొలగిపోతాయి. పిల్లల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సమస్యలు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. సంయమనం పాటించండి.

వృశ్చిక రాశి: సమయస్ఫూర్తితో ఒక సమస్య నుంచి బయటపడతారు. నూతన వ్యాపారానికి కావలసిన ఆర్థిక సాయం అందుతుంది. ఖర్చులు పెరిగినప్పటికీ అందుకు తగిన ఆదాయం పెరుగుతుంది. అతిధుల రాక ఆనందాన్నిస్తుంది. ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉండండి.

ధనస్సు రాశి: భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకండి. పెట్టుబడి సంబంధిత అనారోగ్యం కారణంగా వ్యవహారాల్లో భాగస్వామితో విభేదాలు తలెత్తకుండా చూసుకోండి. ప్రత్యర్థులు మిమ్మల్ని తప్పుదారి పట్టించాలని చూస్తారు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేస్తారు. భవిష్యత్తుకు మేలు చేసి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.

మకర రాశి: విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులకు విధుల్లో భాగంగా స్థానచలనం జరుగుతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం జరిగినప్పటికీ దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారులకు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి.

కుంభరాశి: ఖర్చులు పెరిగినప్పటికీ అందుకు తగిన ఆదాయం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. తోబుట్టువులతో భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు రచిస్తారు. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. వ్యాపారులకు అనూహ్య ధన లాభం ఉంది. ఉద్యోగులకు గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

మీన రాశి: కుటుంబ సభ్యుల్లో సఖ్యత కొరవడుతుంది. ఉద్యోగులు చేయని తప్పుకు నిందపడాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. రుణాలు చేసే పరిస్థితి తలెత్తుతుంది. తీవ్రంగా శ్రమించినప్పటికీ చేపట్టిన పనులు వాయిదా పడతాయి.

సినిమా

సంక్రాంతికి శర్వా “నారి నారి నడుమ మురారి” సందడి

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారి నారి నడుమ మురారి పెద్ద సినిమాల సరసన 2026 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో ప్రేక్షకులను...

అఖండ 2 రిలీజ్ వాయిదా – కొత్త తేదీ త్వరలో: నిర్మాతల...

అఖండ 2 కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిర్మాతలు నిన్న రాత్రి లేట్‌గా ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను వెల్లడించారు. సినిమా విడుదల కోసం టీమ్...

BIGG BOSS 9 TELUGU E90: తొలి ఫైనలిస్ట్ గా కల్యాణ్...

బిగ్ బాస్ సీజన్ 9 శుక్రవారం ప్రసారమైన 90వ ఎపిసోడ్ నిజంగా మసాలా, ఎమోషన్, హీట్‌ అన్నీ కలగలసిన రోలర్ కోస్టర్ లాంటిది. మొదటి ఫైనలిస్ట్...

అసలు “ఎరోస్–14 రీల్స్” వివాదం, అప్పుల కథ ఏమిటి ?

టాలీవుడ్‌లో ఎరోస్ ఇంటర్నేషనల్ మరియు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య నడుస్తున్న ఆర్థిక వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదానికి మూలం మహేష్...

CHIRANJEEVI: లుక్స్, స్టయిల్ తో రఫ్పాడేస్తున్న మెగాస్టార్

CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్తగా చెప్పక్కర్లేని ఘనతలు. తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని సరికొత్త కోణంలో అందించిన సినీ రారాజు. 47 ఏళ్ల...

రాజకీయం

చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీ కి సహకరించిన నారా భువనేశ్వరి

హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తున్న సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దులోని నాయికన్ గూడెం చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఏపీ లిక్కర్ స్కాం: నిందితులకు ఏసీబీ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ దాఖలు చేసిన...

పిల్లలను దేశానికి ఉపయోగ పడేలా తీర్చిదిద్దాలి: పవన్ కల్యాణ్

చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్యార్థుల భవిష్యత్‌పై కీలక సూచనలు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం ఎంత బలంగా ఉంటే...

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై రీటైర్డ్ ఐపీఎస్ పస లేని ఆరోపణలు!

ఆయన పేరు ఎం నాగేశ్వరరావు. గతంలో ఆయన సీబీఐ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ మాత్రమే.! సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుంటుంటారు, చాలా అంశాలపై తన అభిప్రాయాల్ని...

ఎక్కువ చదివినవి

సంక్రాంతికి శర్వా “నారి నారి నడుమ మురారి” సందడి

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారి నారి నడుమ మురారి పెద్ద సినిమాల సరసన 2026 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనుంది. సామజవరగమన సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయంతో...

చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీ కి సహకరించిన నారా భువనేశ్వరి

హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తున్న సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దులోని నాయికన్ గూడెం చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...

BIGG BOSS 9 TELUGU E90: తొలి ఫైనలిస్ట్ గా కల్యాణ్ సెన్సేషనల్ ఎంట్రీ! సినిమా దృశ్యాన్ని తలపించిన తనూజ

బిగ్ బాస్ సీజన్ 9 శుక్రవారం ప్రసారమైన 90వ ఎపిసోడ్ నిజంగా మసాలా, ఎమోషన్, హీట్‌ అన్నీ కలగలసిన రోలర్ కోస్టర్ లాంటిది. మొదటి ఫైనలిస్ట్ కోసం జరిగిన గేమ్స్ ఇంట్లో టెన్షన్‌ని...

పిల్లలను దేశానికి ఉపయోగ పడేలా తీర్చిదిద్దాలి: పవన్ కల్యాణ్

చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్యార్థుల భవిష్యత్‌పై కీలక సూచనలు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం ఎంత బలంగా ఉంటే...

హైదరాబాద్‌కి కొరియన్ దర్శకుడు యూ ఇన్-షిక్… ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం సినిమాలు చేసే ఆలోచన

న్యూఢిల్లీలోని కొరియా రిపబ్లిక్ రాయబార కార్యాలయం, కొరియన్ ఫిల్మ్ కౌన్సిల్ భాగస్వామ్యంతో, హైదరాబాద్‌ కొరియా గౌరవ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో మూడవ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ బంజారాహిల్స్‌లోని ఎల్‌.వి. ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో...