పంచాంగం
తేదీ 15- 09 – 2024, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:52 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:04 గంటలకు.
తిథి: శుక్ల ద్వాదశి ప. 3.04 వరకు, తదుపరి త్రయోదశి
నక్షత్రం: శ్రవణం సా. 5.04 వరకు, తదుపరి ధనిష్ట
దుర్ముహూర్తం: సా. 4.25 నుంచి 5.13 వరకు
శుభ సమయం: ఉ. 7.00 నుంచి 9.00 వరకు
రాహుకాలం: సా. 4.30 నుంచి 6.00 వరకు
యమగండం: మ. 12.00 నుంచి 1.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో విభేదించాల్సి వస్తుంది. వారితో మృదువుగా సంభాషించడం వల్ల పరిష్కారం అవుతుంది. వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోకపోవడం మంచిది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
వృషభ రాశి: చాలాకాలంగా ఎదురుచూస్తున్న ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారులకు విశేషమైన లాభాలు అందుతాయి. రాజకీయ రంగాల వారు నూతన బాధ్యతలు అందుకుంటారు.
మిథున రాశి: మీ మీ రంగాల్లో శ్రద్ధ పెట్టి పని చేయాలి. లేకపోతే పొరపాట్లు జరిగే ప్రమాదం ఉంది. గతంలో బాధించిన అనారోగ్యం మళ్లీ ఇబ్బంది పెట్టొచ్చు. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి ఉపాధ్యాయులతో చర్చించాలి. గిట్టని వారు మీ పనికి అడ్డంకులు సృష్టిస్తారు. మనో బలంతో వాటిని ఎదుర్కోవాలి.
కర్కాటక రాశి: బద్దకాన్ని వదిలి ముందుకు సాగకపోతే సమస్యలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో ఏర్పడిన మనస్పర్ధలను సామరస్యంగా చర్చించుకోవాలి. పెద్దల సమక్షంలో కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. అరువు తెచ్చుకున్న వాహనాలు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి.
సింహరాశి: ఈరోజు ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల నుంచి తీసుకున్న వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. భావోద్వేగంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపారులకు హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ స్వల్ప లాభాలు పొందుతారు. కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి.
కన్యా రాశి: అధిక పని భారం ఒత్తిడిని కలిగిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి అందిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అవసరానికి డబ్బు చేతికందుతుంది. జీవిత భాగస్వామితో నెలకొన్న సమస్యలు తొలగిపోతాయి.
తులారాశి: నూతన వస్తు, వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. సొంతింటి కల నెరవేరుతుంది. తొందరపాటు నిర్ణయం వల్ల కొంత డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి మీ ప్రవర్తనతో కలత చెందుతారు. తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నెరవేర్చే ప్రయత్నం చేయాలి. మీ ప్రవర్తన తో పిల్లలు నొచ్చుకునే ప్రమాదం ఉంది.
వృశ్చిక రాశి: కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. గతంలో చేసిన పొరపాటు కారణంగా ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అపరిచిత వ్యక్తుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారులకు ఒడిదుడుకులు ఎదురవుతాయి.
ధనస్సు రాశి: ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాహనాన్ని అరువుగా తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎటువంటి వివాదాల్లోనూ జోక్యం చేసుకోరాదు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.
మకర రాశి: ముఖ్యమైన పని కోసం ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. విద్యార్థులు చదువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు చూపించే ప్రేమను ఇతరులు అపార్థం చేసుకునే ప్రమాదముంది. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. జీవిత భాగస్వామి భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు.
కుంభరాశి: చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. సమయస్ఫూర్తితో పై అధికారుల మెప్పు పొందుతారు. చాలాకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు శుభవార్తలు అందుకుంటారు.
మీన రాశి: కుటుంబ సమస్యలతో కలత చెందుతారు. పనిమీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల పొరపాట్లు జరుగుతాయి. ఫలితంగా నిందలు పడాల్సి రావచ్చు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో సంభాషించేటప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే ఆలోచన వాయిదా వేయడం మంచిది.