పంచాంగం
తేదీ 15-10-2024, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం, శరత్ ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:57 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:41 గంటలకు.
తిథి: శుక్ల త్రయోదశి రా. 9.52 వరకు, తదుపరి చతుర్దశి
నక్షత్రం: పూర్వాభాద్ర రా. 9.08 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర
దుర్ముహూర్తం: ఉ. 08.21 నుంచి 09.12 వరకు, రా. 10. 48 నుంచి 11.36 వరకు
శుభ సమయం: మ. 12.00 నుంచి 1.00 వరకు
రాహుకాలం: మ.3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు.
రాశి ఫలాలు
మేష రాశి: చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. విజయం సిద్ధిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారులు ప్రణాళిక బద్ధంగా లాభాలు పొందుతారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయట పడతారు.
వృషభ రాశి: సమయానుకూలంగా వ్యవహరించాలి. కొందరి ప్రవర్తన కలత పెట్టవచ్చు. పట్టించుకోకుండా ఉండటం మంచిది. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ప్రత్యర్ధులు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి. పనుల్లో శ్రమ పెరగకుండా చూడాలి.
మిథున రాశి: భవిష్యత్తుకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. పెద్దల సలహా పాటించాలి. జీవిత భాగస్వామి తో విభేదించరాదు. ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. కుటుంబ సభ్యులు మీ ప్రవర్తనతో కలత చెందుతారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి.
కర్కాటక రాశి: పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ సమయస్ఫూర్తితో వ్యవహరించి వాటిని చక్కదిద్దుతారు. కుటుంబ సమస్యలను చాకచక్యం గా పరిష్కరించగలుగుతారు. జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గతంలో పోగొట్టుకున్న వస్తువును తిరిగి పొందుతారు.
సింహరాశి: మిశ్రమ కాలం. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల తోడ్పాటు ఉంటుంది. తొందరపడి ఎవరికి వాగ్దానం చేయరాదు. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే తిరిగి వసూలు అవ్వడం కష్టం. మొహమాటంతో వ్యవహరించరాదు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు.
కన్యారాశి: అదృష్ట కాలం. సమయస్ఫూర్తితో ఇతరుల మెప్పు పొందుతారు. సత్ప్రవర్తనతో వ్యవహరించి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. సమయానికి సాయం చేసేవారు ఉన్నారు. బుద్ధి బలంతో ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
తులారాశి: మొహమాటానికి పోయి ఖర్చులు పెంచుకుంటారు ఫలితంగా రుణాలు చేయాల్సి రావచ్చు. కఠినంగా వ్యవహరించాల్సిన సమయం. కుటుంబ సభ్యులతో ఎట్టి పరిస్థితుల్లోనూ విభేదించరాదు. అనవసర వాగ్వాదాలు సమస్యలను తెచ్చి పెడతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అపరిచితులకు దూరంగా ఉండటం మంచిది.
వృశ్చిక రాశి: చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోయి విజయం సాధిస్తారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. పూర్వీకుల ఆస్తి సంబంధ వివాదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. కొత్త వ్యక్తుల పరిచయం ఉపయోగకరంగా ఉంటుంది.
ధనస్సు రాశి: బంధుమిత్రుల నుంచి అందిన ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు. వ్యాపారులు గణనీయమైన లాభాలు పొందుతారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి అనుకూల సమయం. బుద్ధి బలంతో వ్యవహరించి ఒక సమస్య నుంచి బయటపడతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు.
మకర రాశి: అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయాలు సాధిస్తారు. సంతాన లేమితో బాధపడుతున్న వారు శుభవార్తలు అందుకుంటారు.
కుంభరాశి: మిశ్రమకాలం. కీలక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బంధుమిత్రుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. గతంలో పోగొట్టుకున్న వస్తువును తిరిగి పొందుతారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.
మీన రాశి: శ్రమ అధికమవుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. రుణాలు చేయాల్సి రావచ్చు. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం భవిష్యత్తుకు మేలు చేకూరుస్తుంది.