పంచాంగం
తేదీ 15-03-2025, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు.
తిథి: బహుళ పాడ్యమి మ. 12.49 వరకు, తదుపరి విదియ
నక్షత్రం: ఉత్తర ఉ 7.43 వరకు, తదుపరి హస్త
శుభ సమయం: ఉ 11.56 నుంచి 12.22 వరకు
దుర్ముహూర్తం: ఉ. 6.00 నుంచి 7.36 వరకు
రాహుకాలం: ఉ. 9.00 నుంచి 10.30 వరకు
యమగండం: మ. 1.30 నుంచి 3.00 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: అనుకూల సమయం. భవిష్యత్తుపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. కీలక సమయాల్లో తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. సంపాదన పై దృష్టి పెడతారు. పట్టుదలతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.
వృషభ రాశి: మనసు చెడు ఆలోచనల వైపుకు మల్లుతుంది. మీ ప్రవర్తన వల్ల ఇతరులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆప్తుల నుంచి అందిన ఒక వార్త కలవర పెడుతుంది. ఆలోచనల్లో స్థిరత్వం అవసరం. ముఖ్యమైన పనులపై శ్రద్ధ పెట్టండి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
మిధున రాశి: మీ ప్రవర్తన వల్ల ఇష్టమైనవారు దూరమయ్యే ప్రమాదం ఉంది. జీవిత భాగస్వామి సలహా తప్పనిసరిగా పాటించండి, మేలు జరుగుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి.పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే ప్రయత్నాలను వ్యాపారులు వాయిదా వేయడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంది.
కర్కాటక రాశి: సంతాన అభివృద్ధి విషయంలో శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మొండి బకాయిలు వసూలు అవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు.
సింహరాశి: ముఖ్యమైన పనుల కోసం ఇతరులపై ఆధారపడకండి. స్వశక్తిని నమ్ముకుని ముందుకు సాగండి. అంతా మంచే జరుగుతుంది. ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. జాగ్రత్తగా ఉండండి. అరువు తెచ్చుకున్న వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.
కన్యా రాశి: భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు సాయం అందుతుంది. రుణాలను పెద్ద మొత్తంలో తీర్చగలుగుతారు. చిన్ననాటి స్నేహితులను కొలుసుకొని ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
తులారాశి: ఇతరుల మాటల వల్ల కలత చెందుతారు. ఆప్తుల నుంచి అందిన ఒక వార్త కలవర పెడుతుంది. ముఖ్యమైన పనులను, ప్రయాణాలను వాయిదా వేయండి. మీది కానీ వ్యవహారంలో తల దూర్చడం వల్ల న్యాయపరమైన చిక్కుల్లో పడతారు. ఎవరి మనసు నొప్పించకుండా మాట్లాడండి. చంచల మనస్తత్వం వల్ల ఇబ్బందుల్లో పడతారు.
వృశ్చిక రాశి: అదృష్ట కాలం. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. జీవిత భాగస్వామితో నెలకొన్న విభేదాలు తొలగిపోతాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. విధుల్లో భాగంగా ఉద్యోగులు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.
ధనుస్సు రాశి: మొండి బకాయిలు వసూలు అవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలను పెద్ద మొత్తంలో తీర్చగలుగుతారు. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. సత్ప్రవర్తనతో ఇతరుల మనసు గెలుచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకుంటారు.
మకర రాశి: ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. సొంత నిర్ణయాల వల్ల ఇబ్బందుల్లో పడతారు. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండండి. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం.
కుంభరాశి: జీవిత భాగస్వామితో గత కొంతకాలంగా నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. మీ పనితీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
మీన రాశి: చేపట్టిన పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడతాయి. సానుకూల దృక్పథంతో ఉండండి. కొన్ని వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో విభేదించాల్సి రావచ్చు. ఆప్తులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్యలను కుటుంబ సభ్యుల సమక్షంలో పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.