పంచాంగం
తేదీ 15-01-2025, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, పుష్యమాసం, హేమంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.38 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:45 గంటలకు.
తిథి: బహుళ తదుపరి విదియ తె 3.46 వరకు, తదుపరి తదియ
నక్షత్రం: పుష్యమి ఉ 11.12 వరకు, తదుపరి ఆశ్లేష
శుభ సమయం: ఉ 8.56 నుంచి 9.12 వరకు తిరిగి సా. 3.20 నుంచి 4.20 వరకు
దుర్ముహూర్తం: ఉ11.36 నుంచి 12.24 వరకు
రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ 7 30 నుంచి 9.00 వరకు
రాశి ఫలాలు
మేషరాశి : కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోబుటులతో కలిసి భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం.
వృషభ రాశి: సమయపాలనపై దృష్టి పెట్టాలి. మనసు చెడు ఆలోచనల వైపు మల్లుతుంది జాగ్రత్తగా ఉండండి. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.
మిథున రాశి: ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాల్సిన సమయం. నమ్మిన వారే మోసం చేసే ప్రమాదం ఉంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఖర్చులపై నియంత్రణ ఉండాలి. రుణదాతల ఒత్తిడి ఎక్కువవుతుంది. అరువు తీసుకున్న వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి.
కర్కాటక రాశి: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అనుకూల సమయం. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునేవారు ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టొచ్చు.
సింహరాశి: మిశ్రమ కాలం. అదనపు బాధ్యతలు పెరుగుతాయి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది ఒత్తిడికి లోనవుతారు. కుటుంబ సభ్యులతో స్వల్పంగా విభేదించాల్సి రావచ్చు. సంయమనం పాటించండి. జీవిత భాగస్వామి సలహాతో ఒక సమస్య నుంచి బయటపడతారు.
కన్య రాశి: బుద్ధి బలంతో వ్యవహరిస్తారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు. మీ కీర్తి ప్రతిష్టల్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
తులారాశి: ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రుల నుంచి అందిన వార్త ఆనందాన్నిస్తుంది. సంతానోత్పత్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
వృశ్చిక రాశి: ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఆప్తులతో స్వల్పంగా విభేదించాల్సి రావచ్చు. ఖర్చుల విషయంలో పొదుపు పాటించండి. ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.
ధనస్సు రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని మనశ్శాంతిని పొందుతారు. వ్యాపారులు అనూహ్యమైన లాభాలు పొందుతారు. రాజకీయ రంగాల వారికి నూతన పదవీ లాభ సూచితం. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి.
మకర రాశి: కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. విధుల్లో భాగంగా ఉద్యోగులు దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. భవిష్యత్తుకు మేలు చేసే ఒక ముఖ్యమైన వ్యక్తిని ఈరోజు కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
కుంభరాశి: చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. పురోగతిలో నెలకొన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు శుభ ఫలితాలను ఇస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.
మీన రాశి: అదనపు బాధ్యతలు పెరుగుతాయి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. ఒత్తిడికి గురి చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోరాదు. కుటుంబ సభ్యుల్లో సఖ్యత కొరవడుతుంది. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.