పంచాంగం:
తేదీ 15-02-2025, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.32 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:00 గంటలకు.
తిథి: తదియ రా. 10.38 వరకు, తదుపరి చవితి
నక్షత్రం: ఉత్తర రా.12.33 వరకు, తదుపరి హస్త
శుభ సమయం: ఉ 11.38 నుంచి 12.14 వరకు తిరిగి సా. 4.38నుంచి 5.26 వరకు
దుర్ముహూర్తం: ఉ 6.00 నుంచి 7.36 వరకు
రాహుకాలం: ప. 9.00 నుంచి 10.30 వరకు
యమగండం: మ. 1.30 నుంచి 3.00 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: మిశ్రమకాలం. కుటుంబ సమస్యల వల్ల కలత చెందుతారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో వేధించాల్సి వస్తుంది. కీలక సమయాల్లో ఇంటి పెద్దల మద్దతు లభిస్తుంది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఒక పని ఈరోజు పూర్తవుతుంది.
వృషభ రాశి: చిరకాల కోరికను కుటుంబ సభ్యుల మద్దతుతో నెరవేర్చుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు.
మిథున రాశి: చేపట్టిన పనులపై శ్రద్ధ పెట్టాలి. లేకపోతే పొరపాట్లు జరిగే ప్రమాదం ఉంది. మీది కానీ వ్యవహారంలో తలదూర్చకండి. వ్యాపారులకు హెచ్చుతగ్గులతో కూడిన ఫలితాలు ఉంటాయి. ప్రత్యర్థులు తప్పుదారి పట్టించాలని చూస్తారు. జాగ్రత్తగా ఉండండి. కీలక వ్యవహారంలో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.
కర్కాటక రాశి: కుటుంబ సమస్యలు కొద్దిపాటి ఆందోళన కలిగిస్తాయి. మనసు చెడు ఆలోచనల వైపుకు మల్లుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు ప్రయాణాలు వీలైనంతవరకు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
సింహరాశి: మిశ్రమకాలం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఉద్యోగులు ఉన్నతాధికారుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. పని ప్రదేశంలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి.గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు.
కన్యారాశి: కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు తొలి అడుగు పడుతుంది.
తులారాశి: తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ ప్రవర్తన వల్ల జీవిత భాగస్వామి కలత చెందే ప్రమాదం ఉంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. ఆప్తుల నుంచి అందిన ఒక వార్త బాధపెడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం.
వృశ్చిక రాశి: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి.
ధనస్సు రాశి: అరువు తీసుకున్న వాహనాల వల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడతాయి. ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకండి. మొహమాటానికి తావివ్వకండి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ రుణాలు చేయరాదు. అవసరానికి తోబుట్టువుల సాయం అందుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.
మకర రాశి: ఉద్యోగులు విధుల్లో భాగంగా ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఇతరులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకండి. ప్రత్యర్థుల కదలికలను గమనిస్తూ ఉండండి. బంధుమిత్రుల నుంచి అందిన ఒక వార్త వల్ల కలత చెందుతారు.
కుంభరాశి: మిశ్రమకాలం: ముందు చూపుతో వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండండి. ఉన్నతాధికారులతో జాగ్రత్తగా సంభాషించాలి. ప్రయాణాల్లో కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడతాయి. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండండి. ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టిన పనులు శుభ ఫలితాలను ఇస్తాయి.
మీన రాశి: కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. ఇతరులతో సంభాషించేటప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.