Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 15 ఏప్రిల్ 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,177FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 15-04-2025, మంగళవారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు.

సూర్యోదయం: ఉదయం 5.55 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:15 గంటలకు.
తిథి: బహుళ విదియ ఉ 8.30 వరకు తదుపరి తదియ
నక్షత్రం: విశాఖ రా. 12.50 వరకు, తదుపరి అనురాధ
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: ఉ. 08.24 నుంచి 9.12 వరకు, రా. 10.48 నుంచి 11.36 వరకు
రాహుకాలం: మ 3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ప 9.00 నుంచి 10.30 వరకు

రాశి ఫలాలు

మేషరాశి: సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి.

వృషభ రాశి: రుణ ప్రయత్నాలు ఫలించవు. ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. రుణ దాతల ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో ఒక వ్యవహారంలో విభేదించాల్సి వస్తుంది. వ్యాపార భాగస్వామి ప్రవర్తనను గమనిస్తూ ఉండండి

మిథున రాశి: చాలాకాలం నుంచి ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు ఈరోజు పరిష్కారం లభిస్తుంది ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య గత కొంతకాలంగా నెల కొన్న మనస్పర్ధలు తగ్గుముఖం పడతాయి. వ్యాపార విస్తరణ కోసం పెట్టుబడి పెట్టేందుకు వ్యాపారులకిది అనుకూల సమయం.

కర్కాటక రాశి: ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు.

సింహరాశి: బంధుమిత్రులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు తొలి అడుగు పడుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది.

కన్య రాశి: చేపట్టిన పనుల్లో జాప్యం పెరుగుతుంది. సమయానికి పనులుకు పూర్తిగా కాకపోవడం వల్ల ఆందోళన చెందుతారు. చేయని తప్పుకు మాట పడాల్సి రావచ్చు. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోకండి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని ఇతరులతో సంభాషించండి. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను, ప్రయాణాలను వాయిదా వేయండి.

తులారాశి: చేపట్టిన పనుల్లో పురోగతి లభిస్తుంది. ఇంటా బయట పై చేయి సాధిస్తారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ప్రయాణాల్లో భవిష్యత్తుకు మేలు చేసే గొప్ప వ్యక్తిని కలుసుకుంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

వృశ్చిక రాశి: ఖర్చులు పెరిగినప్పటికీ అందుకు తగిన ఆదాయం లభిస్తుంది. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు శుభ ఫలితాలను ఇస్తాయి. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. మొండి బకాయిలు వసూలు అవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

ధనస్సు రాశి: మానసిక ప్రశాంతతను దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి.ఎవరితోనూ విభేదాలు పెట్టుకోకండి. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. వాటిని తొలగించుకునేందుకు ప్రయత్నించండి. విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంది.

మకర రాశి: ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టిన పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేస్తారు. మొండి బకాయిలు వసూలు అవుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కుంభరాశి: మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. బంధుమిత్రులతో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఆప్తుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. రుణ సమస్యల నుంచి బయటపడతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి.

మీన రాశి: ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.ఉదర సంబంధిత అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యులతో విభేదించాల్సి వస్తుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఖర్చులు పెరుగుతాయి. రుణాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.

సినిమా

బిగ్‌బాస్‌తో గుర్తింపు.. ఐటెమ్ సాంగ్‌తో మళ్లీ వార్తల్లోకి శ్రష్టి వర్మ

టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రష్టి వర్మ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇటీవల బిగ్‌బాస్ తెలుగు 9లో పాల్గొని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె, ఇప్పుడు...

Yash: ధురంధర్-2 టీమ్ పై హీరో యశ్ అసహనం..! కారణమిదేనా?

Yash: మరో పాన్ ఇండియా క్లాష్ సిద్ధమవుతోంది. రెండు సినిమాలూ ప్రేక్షకులు, ఇండస్ట్రీల్లో బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీటి విడుదల తేదీ ‘మార్చి 19’పైనే...

ఇళయరాజా పాటలపై సరిగమ కేసు.. కోర్టు ఆదేశాలతో పరిమితులు

సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగంపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ, తమ ఆధీనంలో ఉన్న వందకు పైగా సినిమాల...

వేలంటైన్స్ డేకి మళ్లీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ!

వేలంటైన్స్ డే వీకెండ్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అదే సమయంలో రిలీజ్ అయిన ‘ఫంకీ’, ‘సీతాపయనం’...

Chiranjeevi: ‘చేతికి కట్టు’.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: తన భుజానికి ఉన్న పట్టీ గురించి వివరాలు వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. శ్రేయోభిలాషులు, అభిమానుల ఆందోళనకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘చేతికి...

రాజకీయం

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంపై సుభుదేంద్ర తీర్థ ఆవేదన

అమరావతి: తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో గతంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందన్న ఆరోపణలపై మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై...

నెయ్యి కొనుగోలు ఆరోపణలపై టిటిడి స్పష్టీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ప్రసాదాల తయారీలో వినియోగించే ఆవు నెయ్యి కొనుగోలు విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని టిటిడి బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రచారం...

శాసనమండలిలో రభసకు వైసీపీ పక్కదారి: జనసేన ఎమ్మెల్యేలు

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్‌పై చర్చించాల్సిన సమయంలో వైసీపీ శాసనమండలిలో రభస సృష్టిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ తీవ్రంగా విమర్శించారు....

వైద్య వృత్తిలో నైతికతే అసలైన బలం: లోకేష్

మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టభద్రులైన వైద్యులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతిక స్థానంలో...

ఎక్కువ చదివినవి

‘ధర్మస్థల నియోజకవర్గం’ నుంచి ఈ వారమే స్పెషల్ సాంగ్

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరు భాస్కర్ నిర్మిస్తున్న పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ నుంచి ఈ వారంలోనే తొలి సాంగ్ విడుదల కానుంది. జై జ్ఞాన ప్రభ...

Nikhil: హీరో నిఖిల్ పోస్ట్ పై చర్చ..! ఎవరినుద్దేశించి..?

Nikhil: హీరో నిఖిల్ ‘ఎక్స్’ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. నిఖిల్ ఎవరిని, ఏ సినిమాని ఉద్దేశించి ఆ పోస్ట్ చేశారోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు....

పార్టీకి పవన్ కళ్యాణ్ రూ.2 కోట్లు విరాళం: జనసేన కొత్త సభ్యత్వానికి శ్రీకారం

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రూ.2 కోట్ల విరాళం అందించి...

అంబటి వ్యాఖ్యలపై మండలిలో మంత్రి లోకేష్ ఫైర్

అమరావతి: శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి...

థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డ్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది: సంతోష్ శోభన్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా థియేటర్లలో మంచి స్పందనతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి వస్తున్న ఆదరణతో ఈ చిత్రం సూపర్ హిట్...