Switch to English

రాశి ఫలాలు: సోమవారం 15 నవంబర్ 2021

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.6:05
సూర్యాస్తమయం : సా‌.5:23
తిథి: కార్తీక శుద్ధ‌ ఏకాదశి ఉ.8:37 నిమిషముల వరకు తదుపరి కార్తీక శుద్ధ ద్వాదశి
సంస్కృతవారం: ఇందువాసరః (సోమవారం)
నక్షత్రము: ‌ఉత్తరాభాద్ర రా.8:24 వరకు తదుపరి రేవతి
కరణం: భద్ర ఉ 8:37 వరకు
యోగం: వజ్రం రా. తె.4:09 వరకు తదుపరి సిద్ది
వర్జ్యం: శేషం ఉ.6:08నుండి 7:47 వరకు
దుర్ముహూర్తం: ప.12:07 నుండి 12:52 వరకు తదుపరి మ.2:22 నుండి 3:07 వరకు
రాహుకాలం: ఉ.7:30 నుండి 9:00 వరకు
యమగండం: ఉ.10:30 నుండి 12:00 వరకు
గుళికా కాలం : మ.2:48నుండి 4:12వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:48 నుండి 5:36 వరకు
అమృతఘడియలు: ఉ.8:09 నుండి 9:49 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:38 నుండి మ.12:22 వరకు

ఈరోజు (15-11-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దీర్ఘ కాలిక ఋణఒత్తిడి పెరుగుతుంది. బంధు మిత్రుల వలన కొన్ని ఊహించని సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి తగిన విశ్రాంతి లభించదు. ప్రయాణాలలో మార్గ అవరోదాలు కలుగుతాయి.

వృషభం: ఆదాయమార్గాలు పెరుగుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు బంధు మిత్రులతో శుభ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థుల ఫలితాలు ఉత్సాహనిస్తాయి.

మిధునం: చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపార పరంగా మరింత అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి దూర ప్రయాణ సూచనలున్నవి.

కర్కాటకం: ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలలో ఆటంకాలు కలుగుతాయి.ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార పరంగా ఆశించిన లాభలు అందుకుంటారు.

సింహం: దూరప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. చేపట్టిన వ్యవహారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి సోదరులతో స్ధిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. చేపట్టిన పనులలో ఒడిదుడుకులు తప్పవు.

కన్య: గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలుచేస్తారు. జీవిత భాగస్వామి నుండి ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తి కరంగా సాగుతాయి. నిరుద్యోగులుకు అరుదైన అవకాశములు లభిస్తాయి.

తుల: ఇంటా బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు శత్రు సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు రాజీ అవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

వృశ్చికం: ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి.ఇతరుల విషయాలలో తొందరపడి మాట ఇవ్వటం మంచిది కాదు. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు.

ధనస్సు: గృహమున కొన్ని పరిస్థితులు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. బంధుమిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది. సంతానం విద్యా విషయాల పై దృష్టి సారించడం మంచిది.

మకరం: చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించి లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.

కుంభం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపార ఆలోచనలలో స్థిరత్వం ఉండదు నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీనం: చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కొన్ని కీలక విషయాల గురించి చర్చిస్తారు.ధనదాయం పెరుగుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు స్ధిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఎఫ్3లో.. ఎఫ్2కి మించి ట్రిపుల్ డోస్ వినోదం గ్యారంటీ: విక్టరీ...

ఎఫ్3లో.. ‘ఎఫ్2’కి మించి ట్రిపుల్ డోస్ వినోదం ‘ఎఫ్3’లో వుంటుంది. ప్రేక్షకుల అంచనాలు ఏమాత్రం మిస్ కావు’ అని విక్టరీ వెంకటేష్ అన్నారు. మే27న ప్రపంచవ్యాప్తంగా సినిమా...

‘రాజ్ కహానీ’ ఫస్ట్ లుక్

చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన వ్యక్తి దర్శకుడైతే తను కోల్పోయింది అమ్మనే కాదు జీవితంలో వెలకట్టలేని అమ్మ ప్రేమను అని తెలుసుకొని అమ్మ ప్రేమను, అమ్మాయి ప్రేమకు...

అంటే సుందరానికి రంగో రంగ: ఆసక్తికరమైన సాంగ్

న్యాచురల్ స్టార్ నాని పలు సీరియస్ సినిమాల తర్వాత చేస్తోన్న పూర్తిస్థాయి ఎంటర్టైనింగ్ చిత్రం అంటే సుందరానికి. జూన్ 10న ఈ చిత్రం విడుదల కానుంది....

థాంక్యూ టీజర్ విడుదల తేదీ అనౌన్స్మెంట్

అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ సినిమా థాంక్యూ. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్టెనా కానీ ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్స్...

ఎన్టీఆర్ హీరోయిన్ పై ఇంకా క్లారిటీ లేదా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సాధించిన అద్భుతమైన విజయాన్ని ఆస్వాదించి ఇప్పుడు తన తర్వాతి సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని...

రాజకీయం

ఇది గుజరాత్ కాదు.. పోరుగడ్డ తెలంగాణ మోదీ వ్యాఖ్యలకు మంత్రుల కౌంటర్

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ కలలు కంటున్నారని.. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ మాత్రమేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ చేసిన...

మార్పు తథ్యం.. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త వింటారు: సీఎం కేసీఆర్

దేశంలో గుణాత్మక మార్పు రావాలని.. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త వింటారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తన పర్యటనలో భాగంగా బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత దేవెగౌడ,...

జనసేనాని ప్రశ్న స్పష్టం: వైసీపీ వద్ద సమాధానం లేని వైనం.!

కోడి కత్తి కేసు ఏమయ్యింది.? అని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ‘ఆ కేసు విచారణ చేస్తోన్నది ఎన్ఐఏ.. అది జాతీయ దర్యాప్తు సంస్థ. మీ మిత్రపక్షం బీజేపీ అధికారంలో వుంది గనుక.....

తెలంగాణ: కుటుంబ పాలన నుంచి బీజేపీకి అధికారం ఖాయం: ప్రధాని మోదీ

తెలంగాణలో బీజేపీ హవా కనిపిస్తోందని.. రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్ చేరుకున్న అనంతరం బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన స్వాగత సభలో ఆయన మాట్లాడారు. ‘కుటుంబ...

జగన్ ఓ చిల్లర ముఖ్యమంత్రి.. ప్రభుత్వాన్ని నడపలేరు: చంద్రబాబు

క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. ఇదే మహానాడు నినాదమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. మహానాడుకు వెళ్తూ చిలకలూరిపేట చేరుకున్న ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అమలాపురంలో పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై...

ఎక్కువ చదివినవి

నిఘావర్గాల హెచ్చరిక.. భారత్ లో రైల్వే ట్రాక్స్ పేలుళ్లకు పాక్ ఐఎస్ఐ కుట్ర

దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే ట్రాక్ లను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ కుట్రలు చేస్తోంది భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్ఐ...

జూ కీపర్ వేలు కొరికేసిన సింహం.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో

జమైకాలోని ఓ జూలో సింహంతో జూకీపర్ చూపిన అత్యుత్సాహం తన చేతి వేలిని పోగొట్టుకునేలే చేసింది. దిగ్భ్రాంతి కలిగించిన ఈ ఘటనలో జూ కీపర్ వేలిని సింహం కొరికేయడంతో అతను తీవ్రంగా ప్రతిఘటించాడు....

వీడిన మిస్టరీ..! సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ పాత్ర ఇదే: కాకినాడ ఎస్పీ

రాష్ట్రంలో సంచలనం రేపిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య మిస్టరీ వీడింది. కేసు వివరాలను కాకినాడ ఎస్పీ రవీంద్రనాధ్ మీడియాకు వివరించారు. ‘సుబ్రహ్మణ్యం మృతిపై అతని తల్లి ఫిర్యాదు మేరకు మొదట అనుమానాస్పద కేసు...

కాంగ్రెస్ కు భారీ షాక్.. పార్టీకి సీనియర్ నేత కపిల్ సిబల్ రాజీనామా

వరుస పరాజయాలతో కుదేలవుతున్న కాంగ్రెస్ ఓపక్క పార్టీలో సంస్కరణలకు ఉపక్రమిస్తుంటే.. మరోపక్క సీనియర్ నాయకులు షాక్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ఆ పార్టీకి...

పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్..

ఏపీలో సంచలనం రేపిన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ విషయాన్ని అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ ధ్రువీకరించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంత...