పంచాంగం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు వైశాఖమాసం శుక్లపక్షం
సూర్యోదయం: ఉ.5:33
సూర్యాస్తమయం: సా.6:15
తిథి: వైశాఖ శుద్ధ చతుర్దశి మ.12:21 వరకు తదుపరి వైశాఖ శుద్ధ పౌర్ణమి
సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం)
నక్షత్రము: స్వాతి మ.3:10 వరకు తదుపరి విశాఖ
యోగం: వ్యతిపాత ఉ.9:18 వరకు తదుపరి వరీయాన్
కరణం: వనిజ ఉ.11:54 వరకు తదుపరి విష్టి
వర్జ్యం: రా.8:30 నుండి 10:01 వరకు
దుర్ముహూర్తం: సా.4:25 నుండి 5:13 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం: మ.12:00 నుండి 1:30 వరకు
గుళికా కాలం : మ.3:24 నుండి సా.5:01 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:12 నుండి తె.5:00 వరకు
అమృతఘడియలు: ఉ.6:44 నుండి 8:17 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:46 నుండి మ.12:38 వరకు
ఈరోజు (15-05-2022) రాశి ఫలితాలు
మేషం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులు నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పదవులు పెరుగుతాయి.
వృషభం: నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలు పొందుతారు. సంతానం విద్యా ఫలితాలు సంతృప్తి కలిగిస్తాయి.
మిథునం: చేపట్టిన పనులు ఆకస్మికంగా వాయిదా వేస్తారు.కుటుంబ విషయంలో స్థిరమైన ఆలోచనలు చెయ్యలేరు బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి తప్పదు.
కర్కాటకం: చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి వ్యాపారాలు మందగిస్తాయి.
సింహం: ముఖ్యమైన వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు ఉద్యోగార్థులకు ఆశించిన స్థాన చలనాలు కలుగుతాయి.
కన్య: ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలరు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి జీవితభాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి.
తుల: ఆర్థిక అనుకూలత కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి ఉద్యోగ విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు మరింత కష్టపడాలి.
వృశ్చికం: ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో కాని పూర్తికావు కొన్ని వ్యవహారాలలో కావలసిన వారే మోసగిస్తారు. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్ర హారాలు ఉండవు. వ్యాపారాలు తీసుకున్న నిర్ణయాలు కలిసిరాక నిరాశ కలిగిస్తాయి.
ధనుస్సు: అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు కలుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
మకరం: బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవర పెడతాయి చేపట్టిన పనులలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు.
కుంభం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ఆర్థికంగా కొంత ప్రతికూల పరిస్థితులుంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో అవసరానికి మించి ఖర్చు చేయవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో లోపాలు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
మీనం: కుటుంబ పెద్దలతో కలహ సూచనలు ఉన్నవి. ఆర్థిక లావాదేవీలు కొంత మందికొడిగా సాగుతాయి శ్రమతో గాని కొన్ని పనులు పూర్తి కావు. దూర ప్రయాణాలలో వాహనం ఇబ్బందులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి నిరుద్యోగులు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.