పంచాంగం
తేదీ 14- 09 – 2024, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు.
తిథి: శుక్ల ఏకాదశి సా. 4.26 వరకు, తదుపరి ద్వాదశి
నక్షత్రం: ఉత్తరాషాఢ సా. 6.16 వరకు, తదుపరి శ్రవణం
దుర్ముహూర్తం: ఉ 6.00 నుంచి 7.36 వరకు
శుభసమయం: సా. 5.00 నుంచి 6.00 వరకు
రాహుకాలం: ఉ 9.00 నుంచి 10.30 వరకు
యమగండం: మ. 1.30 నుంచి 3.00 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: మిశ్రమ కాలం. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి అనుకూల సమయం. వ్యాపారాల్లో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేవారికి మంచి ఫలితాలు ఉంటాయి. సహోద్యోగుల ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు.
వృషభ రాశి: ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. దీర్ఘకాలిక ప్రణాళికలు ఊపందుకుంటాయి. విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. కీలక వ్యవహారాల్లో ఇంటి పెద్ద ల మద్దతు లభిస్తుంది. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు.
మిథున రాశి: కొత్త వ్యక్తుల పరిచయం వల్ల ప్రయోజనం కలుగుతుంది. తొందరపడి పెట్టుబడులు పెట్టడం వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. రుణ సంబంధ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడతాయి. అందర్నీ మెప్పించాల్సి ఉంటుంది. ప్రత్యర్థుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
కర్కాటక రాశి: ఆనందంగా గడుపుతారు. రాజకీయ రంగాల్లో ఉన్నవారు శుభవార్తలు వింటారు. వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకపోవడం ఉత్తమం. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. వ్యాపారులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే ఆలోచనను వాయిదా వేయడం మంచిది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సింహరాశి: ఆస్తికి సంబంధించి తోబుట్టువులతో వాగ్వాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. గతంలో చేసిన పొరపాట్లని సరిదిద్దుకోపోవడం వల్ల అధికారుల ఆగ్రహానికి గురవుతారు. కుటుంబ సభ్యుల నుంచి అందిన ఒక వార్త నిరుత్సాహానికి గురిచేస్తుంది. మానసిక విచారం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీ ప్రమేయం లేక పోయినా నిందలు పడాల్సి రావచ్చు.
కన్యా రాశి: ఈ రాశి వారికి మిశ్రమకాలం. కొత్త వ్యాపార ప్రణాళికలు రూపొందిస్తారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. సహోద్యోగులతో సామరస్యంగా మెలగడం మంచిది. ప్రమాదం జరిగే అవకాశం వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది.
తులారాశి: సొంత నిర్ణయాలు పొరపాట్లకు దారి తీయవచ్చు. ఉద్యోగులు ప్రమోషన్లు పొందినప్పటికీ సంతృప్తి చెందరు. ముఖ్యమైన విషయాల గురించి ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలను పొందటం కష్టమవుతుంది. పూర్వీకుల ఆస్తి విషయం లో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి: సానుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్లతో పాటు స్థానచలన సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. తోబుట్టువుల సహకారం లభిస్తుంది జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి.
ధనస్సు రాశి: ఖర్చులు అనివార్యం అయినప్పటికీ దానికి తగిన ఆదాయం కూడా పొందుతారు. ఏవైనా కొత్త పనులు ప్రారంభించాలనుకునే వారికి అనుకూల సమయం. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పిల్లల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
మకర రాశి: ఈరోజు మకర రాశి వారికి ఆకస్మిక ధనవ్యయ సూచనలు ఉన్నాయి. ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆస్తి వివాదాల్లో పై చేయి సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న అనిశ్చితి తొలగిపోతుంది.
కుంభరాశి: ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. గౌరవ ప్రతిష్టలు పెరిగినప్పటికీ సంతృప్తి చెందరు. ఆర్థిక సమస్యల కారణంగా భాగస్వామితో వాగ్వాదం చోటు చేసుకుంటుంది. వైవాహిక జీవితంలో కలతలు చోటుచేసుకునే అవకాశం ఉంది. మూడో వ్యక్తి జోక్యం మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. నిందలు పడాల్సి రావచ్చు.
మీనరాశి: ఉత్సాహంగా పనిచేస్తారు. అవసరానికి డబ్బులు చేతికందుతాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని సంతోషపడతారు. బంధువుల రాకతో ఆనందపడతారు. వ్యాపారులు గతం కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు. రాజకీయ రంగాల వారికి అదనపు బాధ్యతలు పెరుగుతాయి.