పంచాంగం
తేదీ 14-10-2024, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం, శరత్ ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:56 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:46 గంటలకు.
తిథి: శుక్ల ద్వాదశి రా. 12.47 వరకు, తదుపరి త్రయోదశి
నక్షత్రం: శతభిషం రా. 10.38 వరకు, తదుపరి పూర్వాభాద్ర
దుర్ముహూర్తం: ప. 12.24 నుంచి 1.12 వరకు, మ. 2 46 నుంచి 3.34 వరకు
శుభ సమయం: ఉ 6.00 నుంచి 7.00 వరకు
రాహుకాలం: ఉ 7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు.
రాశి ఫలాలు
మేషరాశి: అదృష్ట కాలం. గత కొంతకాలంగా వేధిస్తున్న మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కుదుటపడతాయి. కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా విశేషమైన లాభాలు అందుతాయి. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు.
వృషభ రాశి: ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ప్రయత్నాలను వ్యాపారులు ఈరోజు మొదలు పెట్టవచ్చు. రాజకీయ రంగాల్లో వారికి అదనపు బాధ్యతలు పెరుగుతాయి.
మిథున రాశి: మొహమాటం దరిచేరనీయరాదు. అనుకోని సమస్యలు ఎదురవుతాయి. మనోబలంతో ఎదుర్కోవాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ నమ్మి ఆర్థిక లావాదేవీలు జరపరాదు. వ్యాపారానికి సంబంధించిన రహస్యాలను ఎవరితోనూ చెప్పరాదు. ఆప్తులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది.
కర్కాటక రాశి: కుటుంబ సభ్యుల మద్దతుతో చిరకాల కోరికను నెరవేర్చుకుంటారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఒక ముఖ్యమైన పని ఈరోజు పూర్తవుతుంది.న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. కోర్టు కేసుల్లో పై చేయి సాధిస్తారు. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు.
సింహరాశి: అదృష్ట కాలం. ఉద్యోగులకు వారి అభీష్టం మేరకు స్థానచలన సూచనలు ఉన్నాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. వ్యాపారులకు విశేషమైన లాభాలు అందుతాయి. విద్యార్థులు నూతన విద్యావకాశాలను అందుకుంటారు. గతంలో పోగొట్టుకున్న వస్తువును తిరిగి పొందే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు.
కన్యారాశి: అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు. కీలక సమయాల్లో తోబుట్టువుల మద్దతు లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఆప్తుల నుంచి అందిన ఒక వార్త ఆనందాన్నిస్తుంది. సంతానలేమితో బాధపడుతున్న వారు శుభవార్తలు వింటారు. బ్యాంకు రుణం కోసం ఎదురుచూస్తున్న వారు ఈరోజు సులభంగా పొందగలుగుతారు. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
తులారాశి: మిశ్రమ కాలం. పని ఒత్తిడి ఎక్కువవుతుంది. తీవ్రంగా శ్రమించి ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. బంధువులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. సహనంతో వ్యవహరించడం మంచిది. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. తల్లిదండ్రులతో మాటలు పడాల్సి రావచ్చు. ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు ఇంటి సభ్యులతో చర్చించడం మంచిది.
వృశ్చిక రాశి: మానసిక ఒత్తిడిని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రశాంతతను పొందుతారు. మనోబలంతో వ్యవహరించాల్సిన సమయం ఎవరిని నమ్మి వ్యక్తిగత విషయాలు పంచుకోరాదు. కీలక సమయాల్లో జీవిత భాగస్వామి సలహా ఉపయోగపడుతుంది. పిల్లల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు.
ధనస్సు రాశి: వ్యక్తిగత సమస్యలను కుటుంబ సభ్యులతో పంచుకోవడం ద్వారా పరిష్కారం లభిస్తుంది. మనస్థాపాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోరాదు. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి రావచ్చు. మనో నిబ్బరంతో ఉండాల్సిన సమయం. కీలక సమయాల్లో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది.
మకర రాశి: శుభకాలం. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులు ఈరోజు ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. ఉద్యోగులకు స్థానచలన సూచనలు ఉన్నాయి. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి ఈరోజు ఉపశమనం పొందుతారు. పూర్వీకుల ఆస్తి సంబంధ వివాదాలు కొలిక్కి వస్తాయి.
కుంభరాశి: కష్టకాలం. అనుకోని ఆపదలు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి రావచ్చు. ఖర్చులు పెరుగుతాయి.వాటిపై నియంత్రణ అవసరం. అనవసర రుణాలు చేయాల్సి రావచ్చు. బంధువులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ప్రవర్తన వల్ల కలత చెందుతారు. మనస్థాపం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది.
మీన రాశి: మిశ్రమకాలం.బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఒక వ్యవహారంలో ఆప్తులతో విభేదించాల్సి రావచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ప్రణాళిక బద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. మొహమాటానికి పోయి ఖర్చులు పెంచుకుంటారు.