పంచాంగం
తేదీ 14-01-2025, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, పుష్య మాసం, హేమంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.36 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:39 గంటలకు.
తిథి: బహుళ పాడ్యమి తె. 3.41 వరకు, తదుపరి విదియ
నక్షత్రం: పునర్వసు ఉ 10.52 వరకు, తదుపరి పుష్యమి
శుభ సమయం: సా. 4.30 నుంచి 5.10 వరకు
దుర్ముహూర్తం: ఉ 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి రా. 10.46 నుంచి 11.36 వరకు
రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ 9.00 నుంచి 10.30 వరకు
రాశి ఫలాలు
మేషరాశి : వివాదాల్లో చిక్కుకుంటారు. అనవసర ఆలోచనలతో సమయం వృధా చేసుకోకండి. మొహమాటానికి పోయి ఖర్చులు పెంచుకుంటారు. మీది కానీ వ్యవహారాల్లో తలదూర్చవద్దు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కొరవడుతుంది. మనశ్శాంతిని దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి.
వృషభ రాశి: పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక సమస్య నుంచి బయటపడతారు. సత్ప్రవర్తనతో ఇతరుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
మిథున రాశి: పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే ఆలోచనను వ్యాపారులు వాయిదా వేయడం మంచిది. స్వల్పంగా ఆర్థిక నష్టం జరుగుతుంది.తీవ్రంగా శ్రమించినప్పటికీ చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు రావు. కొందరి ప్రవర్తన వల్ల కలత చెందుతారు. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
కర్కాటక రాశి: బంధుమిత్రుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, స్థానచలన సూచనలు ఉన్నాయి వ్యాపారులకు అనూహ్యమైన లాభాలు అందుతాయి.
సింహరాశి: మానసిక ప్రశాంతతను దూరం చేసే సంఘటనలకు దూరంగా ఉండండి. ఎవరితోనూ వాగ్వాదానికి దిగరాదు. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. అవి తీవ్రమవ్వకుండా సంయమనం పాటించండి. అపరిచితులతో వ్యక్తిగత వివరాలను పంచుకోరాదు. అరువు తీసుకున్న వాహనాల వల్ల ఖర్చు పెరుగుతుంది.
కన్యారాశి: అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానలేమితో బాధపడుతున్న వారికి అందుకు సంబంధించిన శుభవార్తలు వింటారు. సత్ప్రవర్తనతో ఇతరుల మనసు గెలుచుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు.
తులారాశి: మిశ్రమకాలం. చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు రావడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృశ్చిక రాశి: సంతాన ప్రాప్తికి సంబంధించిన శుభవార్తలు వింటారు. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అందుకు సంబంధించి తొలి అడుగు పడుతుంది. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు అనుకూల సమయం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులు ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టొచ్చు.
ధనస్సు రాశి: ఆప్తుల నుంచి అందిన వార్తతో కలత చెందుతారు. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. మీ ప్రమేయం లేకపోయినప్పటికీ నిందలు పడతారు. ఆర్థిక నష్టం జరుగుతుంది. మీ మాటను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
మకర రాశి: బంధుమిత్రుల నుంచి అందిన ఒక వార్త కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
కుంభరాశి: కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టమైన వారితో విలువైన సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టండి.
మీన రాశి: ఏదైనా ముఖ్యమైన పని మొదలు పెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే ఆలోచనను వ్యాపారులు వాయిదా వేయడం మంచిది. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలను చర్చల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టాలని. బంధుమిత్రుల నుంచి అందిన ఒక వార్త బాధ కలిగిస్తుంది.