Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 14 ఫిబ్రవరి 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,844FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 14-02-2025, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు.

సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:57 గంటలకు.
తిథి: బహుళ విదియ రా. 8.55 వరకు, తదుపరి తదియ
నక్షత్రం: పుబ్బ రా. 10.54 వరకు తదుపరి ఉత్తర
శుభ సమయం: ఉ 9.26 నుంచి 9.56 వరకు తిరిగి సా. 4.26 నుంచి 4.38 వరకు
దుర్ముహూర్తం: ఉ 8.24 నుంచి 9.12 వరకు తదుపరి మ. 12.24 నుంచి 1.12 వరకు
రాహుకాలం: ప. 10.30 నుంచి 12.00 వరకు
యమగండం: మ. 3.00 నుంచి 4.30 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు తగ్గుముఖం పడతాయి. రుణాల కోసం ప్రయత్నించే వారు సులభంగా రుణాలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

వృషభ రాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కొన్ని విషయాల్లో మీ అంచనాలు తప్పుతాయి. చెయ్యని తప్పుకు నింద పడాల్సి రావచ్చు. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకండి. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకండి.

మిథున రాశి: గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఆప్తుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వ్యాపారులకు చాలా కాలం తర్వాత అనూహ్యమైన లాభాలు అందుతాయి. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. ఇష్టమైన వ్యక్తితో విలువైన సమయాన్ని గడుపుతారు.

కర్కాటక రాశి: చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. మొండి బకాయిలు వసూలు అవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

సింహరాశి: సంతాన అభివృద్ధి విషయంలో శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. న్యాయవాద రంగానికి చెందిన వారికి నూతన పదవీ లాభ సూచితం.

కన్యారాశి: మిశ్రమకాలం. ప్రారంభించిన పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు ఎదురవుతాయి. ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఆత్మవిశ్వాసంతో వారిని ఎదుర్కోవాలి. వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకండి. వివాదాలకు దూరంగా ఉండండి. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. అవసరానికి తోబుట్టువుల నుంచి సాయం అందుతుంది.

తులారాశి: అదృష్ట కాలం. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులను ఈరోజు పూర్తి చేయగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా విశేషమైన లాభాలు అందుతాయి. కోర్టు కేసుల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

వృశ్చిక రాశి: సొంతింటి కల నెరవేర్చుకునేందుకు తొలి అడుగు పడుతుంది. అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు. ఆప్తుల నుంచి అందిన వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఉద్యోగార్థులకు శుభవార్తలు అందుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం.

ధనస్సు రాశి: మనసు చెడు ఆలోచనల వైపుకు మల్లుతుంది. ఆలోచనల్లో స్థిరత్వం లేకపోవడం వల్ల సమస్యల్లో పడతారు. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో విభేదించాల్సి రావచ్చు. పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండండి. ఇంటి పెద్దల్లో ఒకరికి ఉదర సంబంధిత అనారోగ్యం ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది. నిర్లక్ష్యం చేయకండి.

మకర రాశి: ఆర్థిక వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. మొహమాటానికి తావివ్వరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రుణాలు చేయొద్దు. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు ఆలోచించి ఇవ్వండి. ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి.

కుంభరాశి: ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. పని ప్రదేశంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. భవిష్యత్తుకు ఉపయోగపడే గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది.

మీన రాశి: మిశ్రమ కాలం. అవసరానికి తోబుట్టువుల నుంచి సాయం అందుతుంది. వ్యక్తిగత సమస్యలను కుటుంబ సభ్యుల సమక్షంలో పరిష్కరించుకోవడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండండి.

సినిమా

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ వేరు..?

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా...

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్...

రాజకీయం

దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?

కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.? ఈ ప్రశ్న సాక్షాత్తూ...

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

కొల్లేరు సమస్య.. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు..!

ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరు చెరువు గట్లు పేల్చేసిన విధానం నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరు పూర్వ వైభవం...

ఎక్కువ చదివినవి

ఇరవయ్యేళ్ళు నిద్రపో జగన్: జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సలహా.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని అసెంబ్లీకి పంపిన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ ‘జయకేతనం’ పేరుతో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నిక జనసేన కీలక నేత...

బిగ్ క్వశ్చన్: రాజకీయ నేరాల్ని కూటమి ప్రభుత్వం అదుపు చేయలేకపోతోందా.?

జనసేన నేతలు, కార్యకర్తలపై దాడులు.! బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులు.! టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు.! దాడులు చేస్తున్నదేమో వైసీపీ నేతలు, కార్యకర్తలు.! ఇదేమీ వైసీపీ హయాం కాదు.! అప్పట్లో అయితే, పైన చెప్పుకున్న...

47 ఏళ్ల శాసనసభ ప్రస్థానం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసన సభ్యునిగా మొదటి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నేడు. 47 ఏళ్ల క్రితం అనగా 1978 మార్చి 15న ఆయన శాసన సభ్యునిగా ప్రమాణ...

ఇండియన్‌ సినిమా క్వీన్‌ రష్మిక

నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న 'ఛావా' సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. యేసుబాయి పాత్రలో రష్మిక నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఛావా సినిమా సూపర్ హిట్ కావడంతో...

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్.. 11 మందిపై కేసు నమోదు..!

ఈజీ మనీ కోసం బెట్టింగ్ యాప్స్ ట్రై చేస్తూ లాభ పడటం సంగతి అటుంచితే దాని కోసం భారీ మొత్తంలో అప్పుచేసి ఆ అప్పు తీర్చలేక సూసైడ్ చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు.....