Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 14 ఏప్రిల్ 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,747FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 14-04-2025, సోమవారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు.

సూర్యోదయం: ఉదయం 5.55 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:15 గంటలకు.
తిథి: బహుళ పాడ్యమి ఉ 6.25 వరకు, తదుపరి విదియ
నక్షత్రం: స్వాతి రా 10.17 వరకు తదుపరి విశాఖ
శుభ సమయం: రా 7.25 నుంచి 8.10 వరకు
దుర్ముహూర్తం: మ. 12.24 నుంచి 1.12 వరకు, మ. 2.46 నుంచి 3.34 వరకు
రాహుకాలం: ఉ 7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ప 10.30 నుంచి 12.00 వరకు

రాశి ఫలాలు

మేషరాశి: కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. కీలక సమయాల్లో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. పొదుపు ప్రారంభించాలనుకునే వారికి అనుకూల సమయం. సంతాన అభివృద్ధి విషయంలో శుభవార్తలు వింటారు.

వృషభ రాశి: కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. తగినంత విశ్రాంతి అవసరం. బంధువుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిథున రాశి: కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వివాదాలకు దారి తీస్తాయి. సంయమనం పాటించడం మంచిది. కోపాన్ని తగ్గించుకుని సంభాషించండి. కొందరి ప్రవర్తన వల్ల కలత చెందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. వ్యాపార భాగస్వామితో విభేదించాల్సి రావచ్చు.

కర్కాటక రాశి: వృధా ప్రయాణాలు చేస్తారు. బంధువులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్దలు తలెత్తుతాయి. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను వాయిదా వేయటం మంచిది. చేపట్టిన పనుల్లో శ్రమ అధికమవుతుంది. వ్యాపారులకు తీవ్రంగా శ్రమించినప్పటికీ నష్టాలే మిగులుతాయి.

సింహరాశి: గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామితో ఏర్పడిన మనస్పర్ధలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.

కన్యారాశి: కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. భవిష్యత్తు గురించి స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. ఉద్యోగానికి మేలు చేసి ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు. శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది.

తులారాశి: ఉద్యోగులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఫలితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. రుణ ప్రయత్నాలు ఫలించవు. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో విభేదించాల్సి వస్తుంది. సమస్య తీవ్రం కాకుండా సంయమనం పాటించండి.

వృశ్చిక రాశి: స్థిరాస్తి కొనుగోలు విషయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మాటల్లో పొదుపు పాటించండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అదనపు బాధ్యతల వల్ల పని ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా అలసటకు లోనవుతారు. కుటుంబ పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి.

ధనస్సు రాశి: వ్యాపారంలో ఆశించిన పురోగతి లభిస్తుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు అనుకూల సమయం. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఖర్చులు పెరిగినప్పటికీ అందుకు తగిన ఆదాయం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది.

మకర రాశి: ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదర సంబంధిత అనారోగ్యం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేయకండి. పెట్టుబడి ప్రయత్నాలను వ్యాపారులు వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను ఈరోజు జరపకండి. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి.

కుంభరాశి: మీ కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడపగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి.

మీన రాశి: ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో ఆకారణ వైరం కలుగుతుంది. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యులతో విభేదించాల్సి వస్తుంది. కొందరి ప్రవర్తన వల్ల కలత చెందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. మీది కాని వ్యవహారంలో తలదూర్చకండి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

సినిమా

చిరంజీవి-అనిల్ మూవీ షూట్ స్టార్ట్..

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీ రోజురోజుకూ అంచనాలను పెంచేస్తోంది. ఈ మూవీకి మొదటి నుంచి చేస్తున్న అనౌన్స్ మెంట్లు ఒక రకంగా ప్రమోషన్ల...

‘గుర్తింపు’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల..

ఈ నడుమ చిన్న సినిమాలు మంచి కంటెంట్ తో వచ్చి పెద్ద హిట్ అవుతున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. తమ సినిమా కూడా అలాంటి కోవలోకే...

నాయకుడు కంటే ‘థగ్ లైఫ్’ పెద్ద హిట్ అవుద్ది.. కమల్ హాసన్...

నాయకుడు సినిమా కంటే థగ్ లైఫ్ పెద్ద హిట్ అవుతుందని విశ్వ నటుడు కమల్ హాసన్ అన్నారు. కమల్, శింబు నటించిన థగ్ లైఫ్ మూవీ...

డైరెక్టర్ బాబీకి ఖరీదైన వాచ్ ఇచ్చిన చిరు..

మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్లను ఎంతగా ప్రోత్సహిస్తారో తెలిసిందే. ఇక తనతో పనిచేసిన వారికి ఎప్పుడూ ఎంకరేజ్ మెంట్ ఇస్తుంటారు. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ బాబీకి కూడా...

వార్2 టీజర్.. మీ ప్రేమకు ఉప్పొంగిపోయా.. ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్2 టీజర్ మే20న విడుదలైంది. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా వచ్చిన ఈ టీజర్ భారీ రెస్పాన్స్...

రాజకీయం

అమరావతికి చట్టబద్ధత: ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఢిల్లీకి వెళ్ళారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో వున్న దరిమిలా, కేంద్రం నుంచి రాష్ట్రానికి గడచిన పదకొండు నెలల కాలంలో పలు ప్రాజెక్టులు,...

థియేటర్ల బంద్ వెనక ఆ నలుగురు..? విచారణకు మంత్రి దుర్గేశ్ ఆదేశాలు..!

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్ల్ మూసేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వెనక పెద్ద కుట్ర జరుగుతోందని ఎప్పటి నుంచో...

‘మన ఊరు – మాటా మంతీ’: వెండితెరపై పవన్ కళ్యాణ్ అభివృద్ధి సినిమా

లక్షల మందిని పోగేసి, కోట్లు ఖర్చు చేసి.. బహిరంగ సభలు నిర్వహించి, సొంత డబ్బా కొట్టుకోవడం.. అనేది వైసీపీ హయాంలో చూశాం. కానీ, వెండితెరపై బాధ్యతాయుతమైన అభివృద్ధి సినిమా ఇప్పుడే చూస్తున్నాం. టీడీపీ -...

వెన్నుపోటు దినం కాదు, వైసీపీ తద్దినం.!

అధికారం కోల్పోయిన వెంటనే, బెంగళూరుకి చెక్కేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాడేపల్లి ప్యాలెస్‌ని వదిలేసి. ఎన్నికలకు రెండేళ్ళ ముందే, వైసీపీ ఓటమి ఖరారైపోయినా, ఆ విషయం తెలిసీ, ‘వై నాట్ కుప్పం.....

వైఎస్ జగన్‌కి అరెస్ట్ భయం: వైసీపీ అను‘కుల’ మీడియా లీకుల వెనుక.!

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపో మాపో అరెస్టవబోతున్నారా.? అరెస్టు భయంతోనే ఈ రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారా.? వైసీపీ అను‘కుల’...

ఎక్కువ చదివినవి

హైదరాబాద్ లో అట్లీ.. అల్లు అర్జున్ తో చర్చలు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ సినిమా రూపొందుతోంది. ఈ మూవీ అనౌన్స్ మెంట్ ను కూడా డిఫరెంట్ గా చేశారు. కానీ అప్పటి నుంచి ఎలాంటి...

‘గుర్తింపు’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల..

ఈ నడుమ చిన్న సినిమాలు మంచి కంటెంట్ తో వచ్చి పెద్ద హిట్ అవుతున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. తమ సినిమా కూడా అలాంటి కోవలోకే వస్తుందని చెబుతున్నారు 'గుర్తింపు' మూవీ టీమ్....

నాయకుడు కంటే ‘థగ్ లైఫ్’ పెద్ద హిట్ అవుద్ది.. కమల్ హాసన్ ధీమా..

నాయకుడు సినిమా కంటే థగ్ లైఫ్ పెద్ద హిట్ అవుతుందని విశ్వ నటుడు కమల్ హాసన్ అన్నారు. కమల్, శింబు నటించిన థగ్ లైఫ్ మూవీ జూన్ 5న రాబోతోంది. ఈ మూవీని...

రైతు సమస్యలపై ఆరుగురు మంత్రులతో సబ్ కమిటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి సుదీర్ఘంగా చర్చించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వివిధ రకాల...

Pawan Kalyan-Lokesh: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం.. పవన్ కల్యాణ్, లోకేశ్ దిగ్భ్రాంతి

Pawan Kalyan-Lokesh: హైదరాబాద్ నగరం చార్మినార్ ప్రాంతంలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో ఈరోజు ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దుర్ఘటనలో 17 మంది మృతి చెందడం.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు,...