పంచాంగం
తేదీ 13- 09 – 2024, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు.
తిథి: శుక్ల దశమి సా. 5.29 వరకు, తదుపరి ఏకాదశి
నక్షత్రం: పూర్వాషాఢ సా 6.12 వరకు, తదుపరి ఉత్తరాషాడ
దుర్ముహూర్తం: ఉ 8.24 నుంచి 9.12 వరకు, తదుపరి మ. 12.24 నుంచి 1.12 వరకు
శుభసమయం: సా. 5.00 నుంచి 6.00 వరకు
రాహుకాలం: ఉ 10.30 నుంచి 12.00 వరకు
యమగండం: మ. 3.00 నుంచి 4.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి శ్రమించాల్సి ఉంటుంది. ఉద్యోగాన్వేషణలో ఉన్నవారు సవాళ్లను ఎదుర్కొంటారు. అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు పంచుకోకపోవడం మంచిది. ఖర్చులు పెరుగుతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి: ప్రయాణాల్లో విలువైన సమాచారాన్ని తెలుసుకుంటారు. రాజకీయాల్లో ఉన్నవారు శుభవార్తలు వింటారు. చాలా కాలంగా గృహ కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్న ఈ రాశి వారికి ఈ రోజు శుభ సమయం. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులు ఆ ప్రయత్నాలు మొదలు పెట్టొచ్చు.
మిథున రాశి: ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరికైనా వాగ్దానం చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది. వ్యాపార భాగస్వామి చేతిలో మోసపోయే ప్రమాదం ఉంది. చాలాకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్య తీవ్రమౌతుంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి విభేదాలు తలెత్తుతాయి.
కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశి వారు పిల్లల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ ను చేజిక్కించుకుంటారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆర్థిక ప్రణాళికలు రచిస్తారు. కుటుంబ సభ్యులతో స్వల్ప వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. సహనంతో వ్యవహరించడం మంచిది.
సింహ రాశి: వ్యాపారులు కొత్త మార్గాలను అన్వేషించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక సమస్యలు కొలిక్కి వస్తాయి. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు.
కన్యారాశి: అదృష్ట కాలం. ఈ ఈ రాశిలో జన్మించిన వారి పిల్లల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా కోర్టులో పెండింగ్లో ఉన్న ఓ కేసు లో విజయం సాధిస్తారు. వ్యాపార ప్రయత్నాలు ఊపందుకుంటాయి. తద్వారా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.
తులారాశి: సవాళ్లు ఎదురవుతాయి. వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడతాయి. కుటుంబంలో విభేదాలు తలెత్తుతాయి. చేయని తప్పుకు నింద పడాల్సి రావచ్చు. విద్యార్థులు మరింత శ్రమించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.
వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. పిల్లల విషయంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయం వారు సమస్యలు ఎదుర్కో ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం కలవరపెడుతుంది. వ్యాపారులు ఒడిదుడుకులు ఎదుర్కొంటారు.
ధనస్సు రాశి: అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో గడపడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపార భాగస్వామి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామి తో ఆనందంగా గడుపుతారు. ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి: ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ వహించకపోవడం వల్ల వాటిని వాయిదా వేయాల్సి వస్తుంది. రాజకీయ రంగాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. అకారణంగా నిందలు పడాల్సి రావచ్చు. ఉద్యోగులు ఉన్నతాధికారుల పట్ల వినయంతో వ్యవహరించాలి.
కుంభరాశి : ఈరోజు ఈ రాశి వారు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి.
మీన రాశి: వాహనాలు నడిపేటప్పుడు ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులు అప్రమత్తంగా లేకపోవడం వల్ల నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంది.