పంచాంగం
తేదీ 13-02-2025, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:57 గంటలకు.
తిథి: బహుళ పాడ్యమి రా. 7.47 వరకు, తదుపరి విదియ
నక్షత్రం: మఖ రా. 8.48 వరకు, తదుపరి పుబ్బ
శుభ సమయం: ఉ 5.24 నుంచి 6.14 వరకు
దుర్ముహూర్తం: ఉ 10.00 నుంచి 10.48 వరకు తదుపరి మ. 2.48 నుంచి 3.36 వరకు
రాహుకాలం: ప. 1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ 6.00 నుంచి 7.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: ముఖ్యమైన విషయాల్లో మీ అంచనాలు తప్పుతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని సందర్భాల్లో విభేదించాల్సి రావచ్చు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు మరింత తీవ్రమవుతాయి. చెప్పుడు మాటలకు లోను కాకుండా ఉండండి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
వృషభ రాశి: సమయానుకూలంగా వ్యవహరించాలి. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్య మళ్ళీ తిరగబడుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఏ విషయం గురించి అతిగా ఆలోచించకండి. నమ్మిన వారే మోసం చేసే ప్రమాదం ఉంది. ప్రత్యర్ధుల కదిలికలపై దృష్టి పెట్టాలి.
మిథున రాశి: గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. మొండిబకాయిలు వసూలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులకు అనూహ్యమైన లాభాలు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.
కర్కాటక రాశి: ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. మొహమాటాలకు తావివ్వకండి. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోకండి. అపరిచితులతో మిత సంభాషణ మంచిది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పని ప్రదేశంలో కొంత ప్రతికూలత ఉంటుంది. సమయానుకూలంగా వ్యవహరించాలి.
సింహరాశి: కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆప్తుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.
కన్యారాశి: మిశ్రమ కాలం.అదనపు బాధ్యతలు పెరుగుతాయి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. బంధుమిత్రుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులను చేపట్టే ముందు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది.
తులారాశి: మిశ్రమకాలం. కొన్ని విషయాల్లో మీ అంచనాలు తప్పుతాయి. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. అరువు తెచ్చుకున్న వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ రుణాల జోలికి పోకపోవడం మంచిది.
వృశ్చిక రాశి: ఇంటా బయటా పై చేయి సాధిస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆప్తుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ధనస్సు రాశి: ఆలోచనలను అదుపులో ఉంచుకోవాలి. మనసు చెడు పనులవైపు మల్లుతుంది. మొహమాటానికి పోయి ఖర్చులు పెంచుకుంటారు. రుణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రుణదాతల ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ముఖ్యమైన లావాదేవీలు వాయిదా వేయటం మంచిది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి.
మకర రాశి: మిశ్రమ కాలం. బంధుమిత్రులతో కొద్దిపాటి విభేదాలు తలెత్తవచ్చు. పెద్దలతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. కొందరి ప్రవర్తన వల్ల కలత చెందుతారు. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అవసరానికి తోబుట్టువుల నుంచి సాయం అందుతుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులు అనుభవజ్ఞల సలహా తీసుకోవడం మంచిది.
కుంభరాశి: చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు సాధించడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. అవసరానికి డబ్బు సాయం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. ఉద్యోగులు విధుల భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. తమ పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. ఖర్చుల విషయంలో పొదుపు పాటించండి.
మీన రాశి: కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.