Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 13 ఏప్రిల్ 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,747FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 13-04-2025, ఆదివారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు.

సూర్యోదయం: ఉదయం 5.55 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:15 గంటలకు.
తిథి: బహుళ పాడ్యమి పూర్తి
నక్షత్రం: చిత్త రా 7.40 వరకు, తదుపరి స్వాతి
శుభ సమయం: ప 8.25 నుంచి 9.01 వరకు, మ. 2.50 నుంచి 3.02వరకు
దుర్ముహూర్తం: సా 4.25 నుంచి 5.13 వరకు
రాహుకాలం: ఉ సా 4.30 నుంచి 6.00 వరకు
యమగండం: ప 12.00 నుంచి 1.30 వరకు

రాశి ఫలాలు

మేషరాశి: ఆప్తులతో అకారణ వైరం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో విభేదించాల్సి వస్తుంది. ఇంటి సభ్యుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను ఈరోజు జరపకపోవడం మంచిది. తీవ్రంగా శ్రమించినప్పటికీ వ్యాపారులకు నష్టాలే మిగులుతాయి.

వృషభ రాశి: మిశ్రమ కాలం. చేపట్టిన పనుల్లో శ్రమ ఎక్కువైనప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. అవసరానికి తోబుట్టువుల నుంచి సాయం అందుతుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

మిథున రాశి: ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారులకు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. బంధువులతో మాట పట్టింపులు ఏర్పడతాయి.

కర్కాటక రాశి: రుణదాతల ఒత్తిడి ఎక్కువవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అకారణ విభేదాలు తలెత్తుతాయి. వాటిని తొలగించే ప్రయత్నం చేయాలి. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకుని ఇతరులతో సంభాషించండి.

సింహరాశి: కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఇంటి సభ్యుల మధ్య సఖ్యత కొరవడుతుంది. వ్యక్తిగత సమస్యలను ఇంటి పెద్దల సమక్షంలో పరిష్కరించుకోండి. అందులో ఇతరుల జోక్యం మంచిది కాదు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అనుకోని ఖర్చులు పెరుగుతాయి.

కన్య రాశి: చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రుల మధ్య ఏర్పడిన మనస్పర్ధలు తొలగిపోతాయి. ఆప్తుల నుంచి అందిన శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అవసరానికి తోబుట్టువుల నుంచి సాయం అందుతుంది.

తులారాశి: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.అవసరానికి సాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు ఒత్తిడి నుంచి బయటపడతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పురోగతిలో నెలకొన్న ఆటంకాలు తొలగిపోతాయి.

వృశ్చిక రాశి: ఆర్థిక సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనారోగ్య సమస్యల వల్ల ఆందోళన చెందుతారు. ముఖ్యమైన పనులను, ప్రయాణాలను వాయిదా వేయండి. ఆర్థిక లావాదేవీల బాధ్యతలను ఇతరులకు అప్పజెప్పొద్దు. బంధువులతో అకారణ వివాదాలు ఏర్పడతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.

ధనస్సు రాశి: చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రశాంతతను దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. బంధువులతో మాట పట్టింపులు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కొరవడుతుంది. స్థిరాస్తి కొనుగోలు వాయిదా పడతాయి

మకర రాశి: న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. స్థిరాస్తి కొనుగోళ్ల విషయంలో నెలకొన్న ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార విస్తరణలో భాగంగా పెట్టుబడి పెట్టే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.

కుంభరాశి: ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. భవిష్యత్తుకు మేలు చేసే గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. ఆప్తులతో నెలకొన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యాపారులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది.

మీనరాశి: వివాదాలకు దూరంగా ఉండండి. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఫలితంగా ఆప్తులతో ఆకారణ వైరం తలెత్తుతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. మానసిక ప్రశాంతతను దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కొందరి ప్రవర్తన వల్ల కలత చెందుతారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

సినిమా

చిరంజీవి-అనిల్ మూవీ షూట్ స్టార్ట్..

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీ రోజురోజుకూ అంచనాలను పెంచేస్తోంది. ఈ మూవీకి మొదటి నుంచి చేస్తున్న అనౌన్స్ మెంట్లు ఒక రకంగా ప్రమోషన్ల...

‘గుర్తింపు’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల..

ఈ నడుమ చిన్న సినిమాలు మంచి కంటెంట్ తో వచ్చి పెద్ద హిట్ అవుతున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. తమ సినిమా కూడా అలాంటి కోవలోకే...

నాయకుడు కంటే ‘థగ్ లైఫ్’ పెద్ద హిట్ అవుద్ది.. కమల్ హాసన్...

నాయకుడు సినిమా కంటే థగ్ లైఫ్ పెద్ద హిట్ అవుతుందని విశ్వ నటుడు కమల్ హాసన్ అన్నారు. కమల్, శింబు నటించిన థగ్ లైఫ్ మూవీ...

డైరెక్టర్ బాబీకి ఖరీదైన వాచ్ ఇచ్చిన చిరు..

మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్లను ఎంతగా ప్రోత్సహిస్తారో తెలిసిందే. ఇక తనతో పనిచేసిన వారికి ఎప్పుడూ ఎంకరేజ్ మెంట్ ఇస్తుంటారు. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ బాబీకి కూడా...

వార్2 టీజర్.. మీ ప్రేమకు ఉప్పొంగిపోయా.. ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్2 టీజర్ మే20న విడుదలైంది. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా వచ్చిన ఈ టీజర్ భారీ రెస్పాన్స్...

రాజకీయం

అమరావతికి చట్టబద్ధత: ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఢిల్లీకి వెళ్ళారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో వున్న దరిమిలా, కేంద్రం నుంచి రాష్ట్రానికి గడచిన పదకొండు నెలల కాలంలో పలు ప్రాజెక్టులు,...

థియేటర్ల బంద్ వెనక ఆ నలుగురు..? విచారణకు మంత్రి దుర్గేశ్ ఆదేశాలు..!

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్ల్ మూసేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వెనక పెద్ద కుట్ర జరుగుతోందని ఎప్పటి నుంచో...

‘మన ఊరు – మాటా మంతీ’: వెండితెరపై పవన్ కళ్యాణ్ అభివృద్ధి సినిమా

లక్షల మందిని పోగేసి, కోట్లు ఖర్చు చేసి.. బహిరంగ సభలు నిర్వహించి, సొంత డబ్బా కొట్టుకోవడం.. అనేది వైసీపీ హయాంలో చూశాం. కానీ, వెండితెరపై బాధ్యతాయుతమైన అభివృద్ధి సినిమా ఇప్పుడే చూస్తున్నాం. టీడీపీ -...

వెన్నుపోటు దినం కాదు, వైసీపీ తద్దినం.!

అధికారం కోల్పోయిన వెంటనే, బెంగళూరుకి చెక్కేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాడేపల్లి ప్యాలెస్‌ని వదిలేసి. ఎన్నికలకు రెండేళ్ళ ముందే, వైసీపీ ఓటమి ఖరారైపోయినా, ఆ విషయం తెలిసీ, ‘వై నాట్ కుప్పం.....

వైఎస్ జగన్‌కి అరెస్ట్ భయం: వైసీపీ అను‘కుల’ మీడియా లీకుల వెనుక.!

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపో మాపో అరెస్టవబోతున్నారా.? అరెస్టు భయంతోనే ఈ రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారా.? వైసీపీ అను‘కుల’...

ఎక్కువ చదివినవి

పాకిస్థాన్ వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం.. పవన్ కల్యాణ్‌ ఫైర్..

పాకిస్థాన్ మన భారతదేశం జోలికి వస్తే వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం అని పవన్ కల్యాణ్‌ ఫైర్ అయ్యారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని.. అలాంటి వారిని అస్సలు క్షమించకూడదు అంటూ తెలిపారు....

Nara Lokesh: ప్రధాని మోదీని కలిసిన మంత్రి లోకేశ్.. ‘యువగళం’ పుస్తకం ఆవిష్కరణ

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేశ్ కుటుంబసమేతంగా శనివారంనాడు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఇటివల ప్రధాని అమరావతి వచ్చిన సందర్భంలో...

వెన్నుపోటు దినం కాదు, వైసీపీ తద్దినం.!

అధికారం కోల్పోయిన వెంటనే, బెంగళూరుకి చెక్కేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాడేపల్లి ప్యాలెస్‌ని వదిలేసి. ఎన్నికలకు రెండేళ్ళ ముందే, వైసీపీ ఓటమి ఖరారైపోయినా, ఆ విషయం తెలిసీ, ‘వై నాట్ కుప్పం.....

లిక్కర్ స్కామ్: అన్యాయం, అక్రమం.. అంటూ వైసీపీ గగ్గోలు.!

దేశాన్ని కుదిపేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. మంత్రి సహా ముఖ్యమంత్రి కూడా జైలుకు వెళ్ళారు....

‘మన ఊరు – మాటా మంతీ’: వెండితెరపై పవన్ కళ్యాణ్ అభివృద్ధి సినిమా

లక్షల మందిని పోగేసి, కోట్లు ఖర్చు చేసి.. బహిరంగ సభలు నిర్వహించి, సొంత డబ్బా కొట్టుకోవడం.. అనేది వైసీపీ హయాంలో చూశాం. కానీ, వెండితెరపై బాధ్యతాయుతమైన అభివృద్ధి సినిమా ఇప్పుడే చూస్తున్నాం. టీడీపీ -...