పంచాంగం
తేదీ 13- 08 – 2024, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, శ్రావణమాసం, వర్ష ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:46 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 6:32 గంటలకు
తిథి: శుక్ల నవమి తె 5.36 వరకు తదుపరి దశమి
నక్షత్రం: విశాఖ ఉ 7.36 వరకు, తదుపరి అనురాధ
దుర్ముహూర్తం: ప. 08.24 నుంచి 9.12 వరకు, తిరిగి రా. 10.48 నుంచి 11.36 వరకు
శుభ సమయం: ఏమీ లేవు
రాహుకాలం: ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ 9.00 నుంచి 10.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: సవాళ్లతో కూడుకున్న సమయం. ప్రత్యర్థుల కదలికలను గమనిస్తూ ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాలు నష్టాలను తెచ్చి పెడతాయి. మీ ప్రవర్తన పట్ల జీవిత భాగస్వామి కలత చెందుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. వైద్యున్ని సంప్రదించాల్సి రావచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. రుణాలు చేయవలసి వస్తుంది.
వృషభ రాశి: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.
మిథున రాశి: దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తవుతాయి. చెప్పుడు మాటలకు దూరంగా ఉండాలి. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. విధుల్లో భాగంగా ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఏదైనా వివాదాలు ఉంటే అవి పపరిష్కారం అవుతాయి.
కర్కాటక రాశి: అనుకూల సమయం. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మొండి బకాయిలు చేతికి అందుతాయి. విద్యార్థులు నూతన విద్యావకాశాలు అందుకుంటారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులకు అనుకూల సమయం. గతంలో పోగొట్టుకున్న విలువైన వస్తువును ఈరోజు తిరిగి పొందుతారు. మనస్పర్ధల వల్ల దూరమైన వారు ఈరోజు చేరువవుతారు.
సింహరాశి: వ్యాపారంలో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటారు. ప్రణాళిక బద్దంగా పనిచేసినప్పటికీ సమస్యలు తప్పవు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. అనారోగ్య సమస్య తలెత్తితే వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది. కుటుంబ సభ్యులతో విభేదించరాదు. తల్లిదండ్రుల సలహా కొన్ని సమయాల్లో ఉపయోగపడుతుంది. గతంలో చేసిన పొరపాట్ల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కన్యారాశి: ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయ వనరులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు అతిథుల రాక సంతోషాన్ని ఇస్తుంది.
తులారాశి: కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాలనుకునే ఈ రాశి వ్యాపారులకు అనుకూల సమయం. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునే ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. పురోగతి మార్గంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ప్రత్యర్థులు ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి వాటిని ఎదుర్కోగలగాలి.
వృశ్చిక రాశి: సవాళ్లతో కూడుకున్న సమయం కుటుంబ సభ్యుల నుంచి అందిన ఒక వార్త ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారంలో నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపార భాగస్వామి మోసం చేసే ప్రమాదం ఉంది. జీవిత భాగస్వామి సలహాను తప్పకుండా పాటించండి. మీ జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిని కోల్పోవాల్సి రావచ్చు.
ధనస్సు రాశి: మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నందున ఎవరి వద్ద వాహనం అరువుగా తీసుకోరాదు. మీ ప్రమేయం లేకపోయినా నిందలు పడాల్సి వస్తుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు శుభవార్తలు అందుతాయి. గతంలో చేసిన తప్పులను గుర్తుచేసుకొని కలత చెందుతారు. పని భారం కారణంగా ఒత్తిడికి లోనవుతారు.
మకర రాశి: వివాదాలకు దూరంగా ఉండాలి. అపరిచితులతో మిత సంభాషణ మంచిది. ఉద్యోగాలకు సిద్ధమయ్యేవారు ఒత్తిడికి లోనవుతారు. విధుల్లో భాగంగా ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది.భాగస్వామ్య వ్యాపారాలు అంతగా కలిసి రావు. కుటుంబ సభ్యుల్లో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
కుంభరాశి: నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూల సమయం. విధుల్లో భాగంగా అత్యవసర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ సమస్య నుంచి బయటపడతారు. ఆర్థిక సమస్యల వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. జీవిత భాగస్వామితో విభేదించరాదు.
మీన రాశి: ఉద్యోగులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. సహోద్యోగులు మద్దతు కరువవుతుంది. కుటుంబ సభ్యుల నుంచి అందిన ఒక వార్త కలవరపెడుతుంది. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే ఇతరులకు వాగ్దానం చేయాలి. పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. రుణాలు చేయవలసి వస్తుంది.