పంచాంగం
తేదీ 12- 09 – 2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు.
తిథి: శుక్ల నవమి సా. 6.04 వరకు, తదుపరి దశమి
నక్షత్రం: మూల సా. 6.00 వరకు తదుపరి పూర్వాషాఢ
దుర్ముహూర్తం: ఉ 10.00 నుంచి 10.48 వరకు, తదుపరి మ. 2.48 నుంచి 3.36 వరకు
శుభ సమయం: ఉ 11.00 నుంచి 12.00 వరకు
రాహుకాలం: ప. 1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ 6.00 నుంచి 7.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. రెచ్చగొట్టేవారున్నారు. జాగ్రత్తగా ఉండాలి. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండాలి. తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోరాదు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. కుటుంబ సభ్యులతో మాటలు పడాల్సి రావచ్చు సహనంతో వ్యవహరించాలి.
వృషభ రాశి: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మనో బలంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అపరిచితులతో మిత సంభాషణ మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల ప్రమేయం లేకుండా చూసుకోవాలి. వ్యాపార భాగస్వామి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది
మిథున రాశి: ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సమస్పూర్తి తో వ్యవహరించి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. బంధుమిత్రుల నుంచి అందిన ఒక శుభవార్త సంతోషాన్నిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రత్యర్థుల ఎత్తుగడలను చాకచక్యంగా ఎదుర్కొంటారు.
కర్కాటక రాశి: తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. చంచల మనస్తత్వం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ ప్రవర్తనతో కుటుంబ సభ్యులు కలత చెందవచ్చు. బాగా ఆలోచించి ఇతరులకు వాగ్దానం చేయాలి. డబ్బు అప్పుగా ఇచ్చే ఆలోచనను విరమించుకోవడం మంచిది. ఇతరుల మాటలకు వ్యాపారులు ప్రభావితం కాకుండా ఉండాలి.
సింహరాశి: చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. మీ ప్రవర్తన పట్ల ఉన్నతాధికారులు అసంతృప్తి చెందవచ్చు. ఆ ప్రభావం మీ ప్రమోషన్లు ఇంక్రిమెంట్లపై పడుతుంది. బంధుమిత్రులతో ఆచితూచి మాట్లాడాలి. ఒక సంఘటనతో కలత చెందుతారు. అందరిని కలుపుకుని పోవడం వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు.
కన్యా రాశి: ప్రత్యర్థుల కదలికలను గమనిస్తూ ఉండాలి. పనిభారం ఎక్కువవుతుంది. అయినప్పటికీ ఒత్తిడి తీసుకోరాదు. అనవసరమైన ఆలోచనలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. చుట్టూ ఆహ్లాదకర వాతావరణ ఉండేలా చూసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ఉండాల్సిన సమయం. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోవద్దు.
తులారాశి: శారీరక శ్రమ పెరుగుతుంది. పై అధికారులు మీ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉంటారు. ఉద్యోగులకు స్థాన చలన సూచనలు ఉన్నాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా రుణాలు చేయవలసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు ఎదురవడం వల్ల సమస్యలు ఏర్పడతాయి. సహనంతో వ్యవహరించాలి.
వృశ్చిక రాశి: మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చంచల మనస్తత్వం ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. తోటి వారి సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు బుద్ధిబలంతో వ్యవహరించాలి. వ్యాపారులు ప్రణాళిక బద్ధంగా లాభాలను అందుకుంటారు. అనవసర ఖర్చులు ఉన్నప్పటికీ రుణాలు చేయరాదు.
ధనస్సు రాశి: ముందు చూపుతో వ్యవహరించి ప్రశంసలు పొందుతారు. బాధ్యతలు ఎక్కువవుతాయి. అయినప్పటికీ చాకచక్యంగా వాటిని నిర్వర్తించగలుగుతారు. బంధుమిత్రుల నుంచి అందిన ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు. పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. వ్యాపారులకు సాధారణ ఫలితాలు ఉంటాయి.
మకర రాశి: ఆత్మవిశ్వాసంతో చేసే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. తోబుట్టువుల మద్దతు లభిస్తుంది.బుద్ధి బలంతో వ్యవహరించి సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. వ్యాపారులకు విశేషమైన లాభాలు అందుతాయి.
కుంభరాశి: ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అందరినీ కలుపుకొని పనిచేయడం వల్ల శుభ ఫలితాలు అందుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఉద్యోగులు పై అధికారుల పట్ల వినయంగా ఉండాల్సిన సమయం. వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ స్వల్ప లాభాలను అందుకుంటారు. ఏ పనైనా కుటుంబ సభ్యులతో చర్చించి మొదలుపెట్టడం మంచిది.
మీన రాశి: మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రుల సాయంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనూ విభేదించరాదు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. విద్యార్థులు స్వల్పంగా ఒత్తిడికి గురవుతారు. వ్యాపారులకు స్వల్ప నష్టాలు ఏర్పడవచ్చు.