పంచాంగం
తేదీ 12-10-2024, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం, శరత్ ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:56 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:46 గంటలకు.
తిథి: శుక్ల దశమి తె. 4.15 వరకు, తదుపరి ఏకాదశి.
నక్షత్రం: శ్రవణం రా.12.56 వరకు, తదుపరి ధనిష్ట.
దుర్ముహూర్తం: ఉ 6.00 నుంచి 7.36 వరకు
శుభ సమయం: సా. 5.00 నుంచి 6.00 వరకు
రాహుకాలం: ఉ 9.00 నుంచి 10.30 వరకు
యమగండం: మ. 1.30 నుంచి 3.00 వరకు.
రాశి ఫలాలు
మేష రాశి: కుటుంబ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలి. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఇంటి పెద్దల మద్దతుతో ఆస్తి సంబంధ వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారులు చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా లాభాలను పొందుతారు.
వృషభ రాశి: వ్యాపారంలో మార్పులు చేసుకోవడం ద్వారా లాభాలను పొందుతారు. స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడి మంచి రాబడిని అందిస్తుంది. మొండి బకాయిలు చేతికి అందుతాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి వాగ్వాదం జరుగుతుంది. విధుల్లో భాగంగా ఆకస్మిక ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
మిథున రాశి: మొండి పట్టుదల సమస్యలను తెచ్చిపెడుతుంది. కుటుంబ సభ్యులతో మాటలు పడాల్సి రావచ్చు. ఇంటి పెద్దల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. చుట్టూ ఉన్న వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులు విధుల్లో భాగంగా ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కొద్దిపాటి మానసిక ఒత్తిడి ఉంటుంది.
కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశి వారు ఆలోచించి ముందడుగు వేయాలి. గతంలో చేసిన పొరపాట్ల వల్ల ఉద్యోగులు పైఅధికారుల ఆగ్రహానికి గురి కావచ్చు. గిట్టని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పాత స్నేహితుడిని కలుసుకున్నప్పటికీ వారితో వ్యక్తిగత విషయాలు పంచుకోకపోవడం మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి.
సింహ రాశి: ఆదాయం మెరుగ్గా ఉంటుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి సరైన సమయం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
కన్యా రాశి: ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. చాలా కాలం తర్వాత పాత స్నేహితుడిని కలుసుకొని ఆనందంగా గడుపుతారు. గిట్టని వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత విషయాలు పంచుకోరాదు.
తులా రాశి: అదృష్ట కాలం. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. తల్లితో స్వల్ప వాగ్వాద సూచనలు ఉన్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.
వృశ్చిక రాశి: గతంలో పిల్లలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారు నష్టాలు చవి చూడాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో వాగ్వాదం వల్ల కలత చెందుతారు. ఆప్తుల నుంచి అందిన వార్త కలవరపెడుతుంది.
ధనస్సు రాశి: తోబుట్టువుల సహకారంతో వ్యాపార విస్తరణ చేస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. చాలాకాలం తర్వాత పాత స్నేహితుని కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు పని ప్రదేశంలో అనవసర వివాదాలు తలెత్తవచ్చు. జాగ్రత్తగా మాట్లాడటం మంచిది.
మకర రాశి: విజయపథంలో ముందుకు సాగుతారు. ఆస్తి సంబంధ వివాదాలు పరిష్కారమవుతాయి. పెద్దల సలహాతో వ్యాపార విస్తరణ చేసి లాభాలను పొందుతారు. కొత్త ప్రాజెక్టులను చేపట్టే ప్రయత్నాలను మొదలు పెట్టొచ్చు. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు.
కుంభరాశి: మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకపోవడం ఉత్తమం. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.
మీన రాశి: ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగులపై ఉన్నతాధికారుల ఒత్తిడి ఉంటుంది. చెప్పుడు మాటలకి ప్రభావితం అవుతారు. సోమరితనం సమస్యలను తెచ్చిపెడుతుంది. చేపట్టిన పనులను వాయిదా వేయకపోవడం మంచిది. ఇంటి పెద్దల జోక్యంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.