పంచాంగం:
తేదీ 12-11-2024, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, కార్తీక మాసం, శరత్ ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:29 గంటలకు.
తిథి: శుక్ల ఏకాదశి ప.12.30 వరకు, తదుపరి ద్వాదశి
నక్షత్రం: ఉత్తరాభాద్ర తె 3.39 వరకు, తదుపరి రేవతి.
దుర్ముహూర్తం: ఉ 8.24 నుంచి 9.12 వరకు, రా 10.48 నుంచి 11.36 వరకు
శుభ సమయం: మ 12.00 నుంచి 1.00 వరకు
రాహుకాలం: ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ 9.00 నుంచి 10.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: కష్టకాలం.పాత అనారోగ్యం మళ్లీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సఖ్యత లేకపోవడం వల్ల కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం మంచిది కాదు. ప్రత్యర్థులు వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూస్తారు. పనులను వాయిదా వేయరాదు. పోగొట్టుకున్న వస్తువును తిరిగి పొందే అవకాశం ఉంది.
వృషభ రాశి: వ్యాపారులు గణనీయమైన లాభాలు పొందుతారు. చాలా కాలంగా పెండింగ్ లో కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల సలహాలను పాటించడం మంచిది. కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యం మంచిది కాదు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలను ఇంటి పెద్దల జోక్యంతో పరిష్కరించుకుంటారు.
మిథున రాశి: ఆనందంగా గడుపుతారు. చాలాకాలం తర్వాత పాత స్నేహితుడిని కలుసుకుని సంతోషంగా గడుపుతారు. స్థాన చలనం కోరుకునే ఉద్యోగులకు అనుకూల సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తారు. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా విశేషమైన లాభాలు అందుతాయి.
కర్కాటక రాశి: ఉద్యోగులకు స్థాన చలన సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులకు ఇచ్చిన మాట నెరవేర్చే ప్రయత్నం చేయాలి. ప్రియ మిత్రుణ్ణి కోల్పోయే అవకాశం ఉంది. కీలక సమయాల్లో సహోద్యోగుల సహకారం అందుతుంది. ఆప్తుల నుంచి అందిన వార్తలు మనశ్శాంతిని కలిగిస్తాయి.
సింహరాశి: క్లిష్ట సమయాల్లో జీవిత భాగస్వామి మద్దతుగా నిలుస్తుంది. వ్యాపారులు నూతన పెట్టుబడి ఆలోచనను వాయిదా వేసుకోవడం మంచిది. దూర ప్రయాణాలు చేసే ముందు ఇంటి పెద్దల సలహా తీసుకోవడం ఉత్తమం. వాహనాల నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీ ప్రమేయం లేకపోయినప్పటికీ నిందలు పడాల్సి రావచ్చు.
కన్యారాశి: అధికంగా ఖర్చు చేశారు. అది తర్వాత ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. పెద్దల సమక్షంలో చర్చించడం వల్ల జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు.
తులారాశి: ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకపోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు మోసపోయే అవకాశం ఉంది. ఒప్పంద వ్యాపారానికి సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా చూసుకోవాలి. విధుల్లో భాగంగా ఉద్యోగులు దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు.
వృశ్చిక రాశి: సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. పనులు వాయిదా వేయకండి. మీ సమస్యలను తండ్రితో చర్చించడం వల్ల పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామి ప్రవర్తన ఒత్తిడికి గురిచేస్తుంది. ఆప్తుల నుంచి అందిన వార్తలతో కలత చెందుతారు. స్వల్పంగా ఆస్తి నష్టం సంభవిస్తుంది.
ధనస్సు రాశి: జాగ్రత్తగా ఉండాలి. దురుసుగా మాట్లాడటం వల్ల న్యాయపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. చుట్టూ ఉన్న వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే ఆలోచనను వాయిదా వేయటం మంచిది. కొన్ని సమయాల్లో మౌనంగా ఉండటం మంచిది. జీవిత భాగస్వామితో విభేదాలు తీవ్రమవుతాయి.
మకర రాశి: శుభకాలం. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న కోర్టు వివాదాల్లో పై చేయి సాధిస్తారు. కుటుంబ సభ్యులను పాత అనారోగ్యం మళ్లీ ఇబ్బంది పెట్టొచ్చు. పిల్లల ప్రవర్తన పట్ల ఆనందంగా ఉంటారు. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.
కుంభరాశి: మిశ్రమకాలం. ముఖ్యమైన పనులను వేగవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు విద్యపై పూర్తిగా దృష్టి పెట్టాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. గతంలో చేసిన పొరపాట్ల విషయంలో పై అధికారుల ఆగ్రహానికి లోనవుతారు. పనిచేసే ప్రదేశంలో ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.
మీన రాశి: అదృష్ట కాలం. కుటుంబంలోకి కొత్త సభ్యున్ని ఆహ్వానిస్తారు. ఉద్యోగులకు స్థానచలన సూచనలు ఉన్నాయి. క్లిష్ట సమయాల్లో తల్లిదండ్రుల సలహా ఉపయోగపడుతుంది. జీవిత భాగస్వామితో చర్చించడం వల్ల చాలా సమస్యలు తొలగుతాయి. పిల్లల భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు.