పంచాంగం
తేదీ 12-01-2025, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, పుష్య మాసం, హేమంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.36 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:39 గంటలకు.
తిథి: త్రయోదశి ఉ 6.12 వరకు, తదుపరి చతుర్దశి
నక్షత్రం: మృగశిర ఉ 11.33 వరకు, తదుపరి ఆరుద్ర
శుభ సమయం: ఉ 10.20 నుంచి 10.54 వరకు
దుర్ముహూర్తం: సా. 4.25 నుంచి 5.13 వరకు
రాహుకాలం: సా 4.30 నుంచి 6.00 వరకు
యమగండం: మ. 12.00 నుంచి 1.30 వరకు
రాశి ఫలాలు
మేషరాశి : అనుకూల సమయం. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. కీలక సమయాల్లో ఇంటి పెద్దల మద్దతు లభిస్తుంది. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పురోగతి లభిస్తుంది. వ్యాపారులకు విశేషమైన లాభాలు అందుతాయి.
వృషభ రాశి: జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం. ఇతరుల వ్యవహారంలో తలదూర్చకండి. మీ ప్రమేయం లేకపోయినా కొన్ని సందర్భాల్లో మాట పడాల్సి రావచ్చు. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు అందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను జాగ్రత్తగా చూసుకోవాలి. రుణదాతల ఒత్తిడి ఎక్కువవుతుంది. మనసు చెడు ఆలోచనల వైపు మల్లుతుంది.
మిథున రాశి: ఈరోజు ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్య మళ్ళీ తిరగబెడుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకండి. వ్యాపారులు పెట్టుబడి పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి.
కర్కాటక రాశి: కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకుంటారు. సత్ప్రవర్తనతో ఇతరుల మనసు గెలుచుకుంటారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. అవివాహితులకు వివాహ సంబంధాలు హరిస్తాయి.
సింహరాశి: ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకండి. అవి తిరిగి వసూలు అవ్వడం కష్టమవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. మొహమాటానికి పోయి అనవసర ఖర్చులు పెంచుకుంటారు. విలాసవంతమైన వస్తువులపై మనసు మల్లుతుంది. ప్రయాణంలో జాగ్రత్తలు అవసరం. ఒక వ్యవహారంలో ఇంటి పెద్దల మద్దతు లభిస్తుంది
కన్య రాశి: ప్రతిభతో అందర్నీ ఆకట్టుకుంటారు. సత్ప్రవర్తనతో ఇతరుల మనసు గెలుచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. అవసరానికి తోబుట్టువుల నుంచి సాయం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.
తులారాశి: నూతన వ్యాపారాలు మొదలుపెట్టడానికి అనుకూల సమయం. దైవ దర్శనం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయత్నాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. కొద్దిపాటి ఆర్థిక నష్టం జరుగుతుంది. విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంది.
వృశ్చిక రాశి: చేపట్టిన పనుల్లో అనుకున్న ఫలితాలు రాబట్టడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోకండి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ప్రవర్తన వల్ల కలత చెందుతారు. బంధుమిత్రుల నుంచి అందిన వార్త మనశ్శాంతిని దూరం చేస్తుంది.
ధనస్సు రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు వేస్తారు. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే వారికి శుభవార్తలు అందుతాయి.
మకర రాశి: బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో శుభకార్యానికి సంబంధించిన ప్రస్తావన వస్తుంది. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు తొలి అడుగు పడుతుంది. సంతానలేమితో బాధపడుతున్న వారికి శుభవార్తలు అందుతాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులకు అనుకూల సమయం.
కుంభరాశి: పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సత్ప్రవర్తన తో ఇతరుల మనసు గెలుచుకుంటారు. ఇంటిపెద్దల సాయంతో చిరకాల కోరికను నెరవేర్చుకుంటారు. అవసరానికి ఆర్థిక సాయం చేసేవారు ఉన్నారు. మొండి బకాయిలు వసూలు అవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
మీన రాశి: గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్య మళ్ళీ తిరగబెడుతుంది. నిర్లక్ష్యం చేయరాదు. మీ మాటలు ఇతరులు చెడుగా అర్థం చేసుకుని ప్రమాదం ఉంది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో సంభాషించేటప్పుడు వినయంగా ఉండటం మంచిది. మీది కానీ వ్యవహారంలో తలదూర్చకండి. ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. మనోబలంతో ఎదుర్కోవాలి.