Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 12 ఫిబ్రవరి 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,855FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 12-02-2025, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు.

సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:57 గంటలకు.
తిథి: పౌర్ణమి రా. 7.08 వరకు, తదుపరి పాడ్యమి
నక్షత్రం: ఆశ్లేష రా. 7.35 వరకు, తదుపరి మఖ
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: ఉ 11.36 నుంచి 12.24 వరకు
రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ 7.30 నుంచి 9.00 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: ఆరోగ్యాన్ని నిర్లక్యం చేయరాదు. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్య మళ్లీ తిరగబడుతుంది. ఖర్చులపై నియంత్రణ ఉండాలి. అనవసర అప్పులు చేస్తారు. రుణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. అందరితోనూ మిత సంభాషణ మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

వృషభ రాశి: అదృష్ట కాలం. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా విశేషమైన లాభాలు అందుతాయి. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.

మిథున రాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోరాదు. ప్రత్యర్థులు తప్పుదారి పట్టించాలని చూస్తారు. జాగ్రత్తగా ఉండండి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఉద్యోగులు అధికారులతో ఆచితూచి వ్యవహరించండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

కర్కాటక రాశి: మిశ్రమకాలం. ఆత్మ విశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇంటా బయటా పై చేయి సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంది.

సింహరాశి: కొన్ని వ్యవహారాల్లో మౌనంగా ఉండటం మంచిది. అనవసర ఆలోచనలు చేయకండి. మనసు చెడు పనుల వైపుకు మల్లుతుంది. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండండి. జీవిత భాగస్వామితో ఏర్పడిన మనస్పర్ధలు తీవ్రం కాకుండా చూసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య కొద్దిపాటి విభేదాలు ఏర్పడవచ్చు.

కన్య రాశి: భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. గొప్ప వ్యక్తులతో పరిచయం అవుతుంది. సంతానాభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

తులారాశి: కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఆప్తుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

వృశ్చిక రాశి: అదనపు బాధ్యతలు పెరుగుతాయి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. ఒత్తిడికి లోనవుతారు. అనుకున్న ఫలితాలు సాధించడానికి తీవ్రంగా శ్రమించాల్సి రావచ్చు. అరువు తెచ్చుకున్న వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. వివాదాలకు తావివ్వకండి.

ధనస్సు రాశి: కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడపగలుగుతారు. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. మొండి బకాయిలు వసూలు అవుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి.

మకర రాశి: మిశ్రమ కాలం. పట్టుదలతో అనుకున్న పనులు నెరవేర్చగలుగుతారు. అవసరానికి తోబుట్టువుల నుంచి సాయం అందుతుంది. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. ఎటువంటి వివాదాలకు తావివ్వకండి. పని ప్రదేశంలో కొంత గందరగోళ వాతావరణం ఉంటుంది.

కుంభరాశి: భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు.

మీన రాశి: ఇతరులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ముఖ్యమైన పనులను, ప్రయాణాలను వాయిదా వేయండి. ఎటువంటి ఆర్థిక లావాదేవీలను జరపకపోవడం మంచిది. అపరిచితులతో మిత సంభాషణ మంచిది. ఆప్తులతో కొద్దిపాటి విభేదాలు ఏర్పడవచ్చు.

సినిమా

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను తాజాగా మరోసారి...

దిల్ రూబా కనెక్ట్ అయితే ఊహించనంత రేంజ్ : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ థిల్లాన్, కెతి దేవిసన్ హీరోయిన్స్ గా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమా...

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్...

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత...

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌...

రాజకీయం

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’...

ఆరేళ్లుగా పోరాడుతున్నా.. నిందితులు బయటే తిరుగుతున్నారుః వైఎస్ సునీత

తన తండ్రి చనిపోయి ఆరేళ్లు గడుస్తోందని.. న్యాయం కోసం తాను ఇంకా పోరాడుతున్నట్టు వైఎస్ సునీత తెలిపారు. తన తండ్రి చావుకు కారణమైన వారిలో ఒక్కరు మాత్రమే జైలులో ఉన్నారని.. మిగతా వారంతా...

పారిశుద్ధ్యం, స్వచ్ఛత పట్ల ప్రజల్లో మార్పు రావాలి : నారా లోకేష్

పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాలని వారిలో చైతన్యం కలిగించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని అన్నారు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. కూటమి...

జయకేతనం.! పవన్ కళ్యాణ్ తెచ్చిన ‘మార్పు’ ఇదీ.!

‘మీరు ఓజీ ఓజీ అని అరవడం బాగానే వుంటుంది. కానీ, దానికి సమయం అలాగే సందర్భం చూసుకోవాలి’ అని పలు సందర్భాల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన...

జనసేన లక్ష్యాలు పెద్దవి.. చాలా చాలా పెద్దవి.!

తన చిన్నప్పటి విషయాల్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జయకేతనం బహిరంగ సభలో గుర్తు చేసుకున్నారు. అదే వేదికపైనున్న తన సోదరుడు నాగబాబుని చూస్తూ, ఆ విషయాలు చెబుతున్నప్పుడు పవన్ కళ్యాణ్...

ఎక్కువ చదివినవి

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌ పోస్టర్ బ్యానర్‌లో నాని సమర్పణలో రాబోతున్న...

శ్రీలీలకు మెగాస్టార్ కానుక..!

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సెట్స్ లో ప్రముఖ కథానాయిక శ్రీలీల తళుక్కున మెరిసారు. వశిష్ట డైరెక్షన్ లో చిరంజీవి చేస్తున్న విశ్వంభర సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా సెట్స్ లో...

Bollywood: ‘ఎవరో తెలీని దక్షిణాది హీరోల సినిమాలకు 600కోట్లు’ గేయ రచయిత కామెంట్స్

Bollywood: ‘ముక్కూ, మొహం తెలీని దక్షిణాది హీరో సినిమాలకు ఇక్కడ రూ.600-700కోట్లు వస్తున్నాయి. మన ప్రేక్షకులకు ఏమైంది..? ఏటా కొత్త హిందీ సినిమాలు వస్తున్నా మనవాళ్లని అలరించలేకపోతున్నాయి. కారణమేంట’ని ప్రముఖ హిందీ గీత...

పిల్లలపై రాజకీయాలు వద్దు..!

పిల్లలపై రాజకీయ ప్రభావం లేకుండా ఉండాలని అన్నారు నారా లోకేష్. అందుకు తగినట్టుగా విద్యాశాఖలో మార్పులను తీసుకొచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. పిల్లల విద్య మీద రాజకీయ ప్రభావం లేకుండా చేస్తున్నారు. రాజకీయాలకు అసలు...

జయకేతనం.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై జనసేనాని సంతకం.!

రాజకీయ పార్టీలకు కార్యకర్తలుంటారు.! కానీ, జనసేన పార్టీకి సైనికులున్నారు.! ‘వాళ్ళు పార్టీ కార్యకర్తలు కాదు, ఓటు హక్కు కూడా లేని పిల్లలు..’ అంటూ జనసేన పార్టీ మీద ఒకప్పుడు వినిపించిన రాజకీయ విమర్శలు...